స్టార్ ఇమేజ్ కోసం సినిమాలు చేయను! | manchu manoj attack movie release on friday | Sakshi

స్టార్ ఇమేజ్ కోసం సినిమాలు చేయను!

Published Thu, Mar 31 2016 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

స్టార్ ఇమేజ్ కోసం సినిమాలు చేయను!

స్టార్ ఇమేజ్ కోసం సినిమాలు చేయను!

 ‘‘నేనే పాత్ర చేసినా నటుడిగా సంతృప్తి పొందాలనుకుంటాను. ఇమేజ్ గురించి ఆలోచించకుండా విభిన్న పాత్రలు చేయాలన్నదే నా సంకల్పం’’ అని మంచు మనోజ్ అన్నారు. ఆయన హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్ తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన ‘ఎటాక్’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మనోజ్ చెప్పిన ముచ్చట్లు...
 
 ఈ చిత్రంలో రాధాకృష్ణ పాత్రలో నటించా. వెరీ సాఫ్ట్ అండ్ కూల్ పర్సన్. కూల్‌గా ఉండే వ్యక్తి తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో చాలా రఫ్‌గా మారతాడు. రెండు వర్గాల వారిలో ఎవరు ఎవరిపై ‘ఎటాక్’ చేశారు అనేది సస్పెన్స్.
 
 హైదరాబాద్‌లోని ధూల్ పేటలో జరిగిన యథార్థ సంఘటనలతో రామ్‌గోపాల్ వర్మగారు కథ రెడీ చేశారు. చాలా రోజుల తరువాత ఆయన మనసుపెట్టి ఈ సినిమా చేశారు.
 
 నా 11 ఏళ్ల కెరీర్‌లో ‘దొంగ -దొంగది’ నుంచి ‘ఎటాక్’ వరకూ స్టార్ ఇమేజ్ కోసం చేసిన చిత్రాలేవీ లేవు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా ఒక పాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోవాలన్నదే నా కోరిక.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement