
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు గడుస్తున్నా.. వివాదం మాత్రం తగ్గడం లేదు. మాకు అన్యాయం జరిగింది, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, ప్రకాశ్ రాజ్ ఆరోపణలు అన్ని అర్థరహితమని ‘మా’అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు అంటున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై సినీ పెద్దలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: ‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!)
ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే.. సోషల్ మీడియా వేదికగా తన అసంతృతప్తిని తనదైన స్టైల్లో వ్యక్తం చేశాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మంచు మనోజ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. మరి మనోజ్ ట్వీట్ కి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021