'ఎటాక్'కి రెడీ అవుతున్న వర్మ | Ramgopal varma attack manchu manoj, jagapathi babu | Sakshi
Sakshi News home page

'ఎటాక్'కి రెడీ అవుతున్న వర్మ

Published Tue, Jan 12 2016 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

'ఎటాక్'కి రెడీ అవుతున్న వర్మ

'ఎటాక్'కి రెడీ అవుతున్న వర్మ

కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్తో రామ్గోపాల్ వర్మలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగ్గ హిట్లు ఇవ్వటంలో విఫలమవుతూ వస్తున్న వర్మ కిల్లింగ్ వీరప్పన్తో మళ్లీ గాడిలో పడ్డాడు. కన్నడ, తెలుగు భాషల్లో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా కిక్తో ఇప్పుడు గతంలో ఆగిపోయిన సినిమాలను కూడా రిలీజ్కు రెడీ చేస్తున్నాడు రామ్గోపాల్ వర్మ.

మంచు మనోజ్ హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ఎటాక్'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా కిల్లింగ్ వీరప్పన్ మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న నిర్మాతలు, ఎటాక్ సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నారు. మనోజ్తో పాటు జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి నెలాఖరుకల్లా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ ఎటాక్తో వర్మ తన ఫాం కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement