నాగ్‌తో సరేన్‌ | Nagarjuna gets new heroine Myra Sareen in Ram Gopal Varma's film | Sakshi

నాగ్‌తో సరేన్‌

Dec 1 2017 12:17 AM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna gets new heroine Myra Sareen in Ram Gopal Varma's film - Sakshi

హీరోయిన్‌ అనుష్కను సెలక్ట్‌ చేశారట. కాదు... హీరోయిన్‌గా స్నేహా ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌! కాదు.. కాదు... వేరే సీనియర్‌ హీరోయిన్‌ ఆల్రెడీ సైన్‌ కూడా చేసేశారట. ఇదిగో.. ఇలాంటి చర్చలే నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫిమేల్‌ లీడ్‌ గురించి జరిగాయి. ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు రామ్‌గోపాల్‌ వర్మ. ‘‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్‌ లీడ్‌ ఎవరన్న విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అవన్నీ తప్పు. హీరోయిన్‌గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి. తన పేరు మైరా సరీన్‌’’ అని పేర్కొన్నారాయన. అంతేకాదు మైరా సరీన్‌ ఫొటోలను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే మైరా సరీన్‌ గురించి ‘సాక్షి’ రామ్‌గోపాల్‌ వర్మను సంప్రదించినప్పుడు ‘‘సరీన్‌ ఇప్పటివరకు నటించలేదు. నటనకు కొత్త. తనకిదే ఫస్ట్‌ సినిమా’’ అని చెప్పారాయన. నాగ్‌తో సినిమా.. పైగా వర్మలాంటి సెన్సేషనల్‌ డైరెక్టర్‌.. అడగ్గానే ఎగిరి గంతేసి, మైరా సరీన్‌... ‘సరేన్‌’ అని ఉంటారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement