Pappu Laanti Abbayi Video Song | 'పప్పు' లాంటి అబ్బాయి | Kamma Rajyam Lo Kadapa Reddlu - Sakshi
Sakshi News home page

పప్పులాంటి అబ్బాయి...

Published Mon, Nov 11 2019 6:05 AM | Last Updated on Mon, Nov 11 2019 3:16 PM

kammarajyamlo kadapa redla movie song launch - Sakshi

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో ఓ దృశ్యం

ట్రెండ్‌ సెట్టింగ్‌ చిత్రాలను తీయడంలో దర్శక–నిర్మాత రాంగోపాల్‌ వర్మకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆయన అందిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ‘‘ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రాజకీయ నేపథ్యాల్లో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. ఆదివారం విడుదల చేసిన ‘పప్పులాంటి అబ్బాయి..’ పాట మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement