Kamma Rajyam Lo Kadapa Reddlu
-
రివైండ్ 2019: తలనొప్పిగా మారిన సిన్మాలు.. వివాదాలు
సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకులు నిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల ఏదో ఒక సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి థియేటర్లోకి వచ్చే వరకు అడుగడుగునా ఆటంకాలతో చిత్ర నిర్మాతలు తలబాదుకుంటున్నారు. ఏదైనా చిత్రం విడుదలకు ముందు ఈ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. కథను కాపీ కొట్టడం, సినిమా పేర్లను కాపీ కొట్టడం.. వివాదాస్పదమైన పేర్లు పెట్టడం.. సినిమా అంతా పూర్తి అయ్యాక సెన్సార్షిప్ సర్టిఫికెట్ వివాదం. ఇలాంటి కారణాలు తెలుగు చిత్ర సీమను ఈ ఏడాది విమర్శల్లో నెట్టాయి.. మరీ వాటి విశేషాలెంటో ఓసారి చుద్దాం రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనం అవుతుంది. వర్మ సినిమా చేస్తున్నాడు అంటే అప్పటి నుంచే ఏం చేయబోతున్నాడు. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. సినిమా టైటిల్ ఏం పెట్టబోతున్నాడు అనే దాని చుట్టూనే మొదటగా అందరూ ఆలోచిస్తారు. అలా ఈ సంవత్సరం విమర్శల్లో కేంద్ర బిందువులా మారాడు వర్మ. ఆయన చేసిన రెండు సినిమాలు వివాదాల్లో నిలిచాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్కు కౌంటర్‌గా వర్మ ఈ మూవీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనపుడు కూడా ఇంతగా చర్చ జరగలేదు కానీ వర్మ మాత్రం సంచలనాలకు తెరతీసాడు. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది. అయితే, ఏపీ హైకోర్టు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. దీంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి చుక్కెదరయ్యింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించడంతో ఏపీలో విడుదల కాలేదు. తెలంగాణలో మాత్రం ఈ చిత్రాన్ని మార్చి 29 న విడుదల చేశారు. కానీ, ఏపీలో మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాలేదు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అలియాస్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రాంగోపాల్‌వర్మ తీసే ప్రతీ సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తాడు. కొన్నాళ్ళ క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్‌తో ఇంకొక వివాదాన్ని రాజేసాడు. ఈ సినిమా రాజకీయంగాను, కొన్ని వర్గాల పార్టీ నేతలలో ఆందోళన కలిగేలా చేసింది. ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకులను కించపరిచేలా, వారి హోదాను దిగజార్చేలా సినిమా ఉందన్నకారణంతో పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిన విషయం విదితమే. ఈ చిత్రం పట్ల ఏపీలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన పాత్రను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు పేరు మార్చాలని సూచంచడంతో కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కాస్తా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని పేరు మార్చారు. సినిమా టైటిల్ మార్చినప్పటికీ సెన్సార్ బోర్డు అనుమతి లభించలేదు. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన కోర్టు వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. చివరికి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ తన సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఒక ప్రముక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా మెగా ఫ్యామిలీతోఅంటూ వివాదాల్లో నిలిచాడు. అది కాస్త 24 గంటలు కాకుండానే ఈ సినిమాను నేను తీయడం లేదని తేల్చి చెప్పాడు. తాను విన్న కధ 39 మంది పిల్లలున్న మెగా ఫామిలీ పై సినిమా తీయడం నావల్ల కాదని, తనకు చిన్నపిల్లలంటే ఇష్టముండదని అందుకే ఆ సినిమా చేయట్లదన్నాడు వర్మ. దీనిపై చిరంజీవి వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అందువల్ల వర్మ వెనక్కి తగ్గాడని టాలివుడ్ లో చర్చ నడుస్తుంది. గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకీ వివాదంగా మారిన మరో తెలుగు చిత్రం వాల్మీకీ. తమిళంలో విజయవంతమైన జిగార్తండను దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా టైటిల్ సమస్యనే ఎదుర్కొంది. వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో లో రివాల్వర్ ని యాడ్ చేయడంతో వాల్మికి కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. రివాల్వర్ పెట్టి వాల్మీకిల మనోభావాలను కించపరిచేలా చేశారని చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. సినిమా పేరును మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చివరి క్షణంలో గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చి సెప్టెంబర్ 13న విడుదల చేశారు. వరుణ్ తేజ్ తన సింగిల్ క్యారెక్టర్‌తోనే సినిమాను పండించాడు. ఈ సినిమా యాక్షన్, కామెడీ పరంగా మంచి హిట్‌ను సాధించింది. జార్జి రెడ్డి తెలుగులో వివాదస్పదమైన మరో చిత్రం జార్జి రెడ్డి. 1970లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకుంటూ..రాజకీయ పంథాలో విద్యార్థి ఉద్యమాన్నినడిపిన నాయకుడు జార్జిరెడ్డి. ఆయన కథ ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కించారు. జార్జిరెడ్డి 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో హత్యకు గురయ్యాడు. ఆయన సిద్దాంతాలను వ్యతిరేకించే రైట్ వింగ్ విద్యార్థి సంఘం ఆయన్ను హత్య చేసి ఉంటారని ఆరోపనలు ఉన్నాయి. అయితే సినిమాలో కేవలం జార్జిరెడ్డి నడిపి ఉద్యయాన్ని, ఆయన హీరోయిజాన్ని చూపించడంతో రైట్ వింగ్ రాజకీయాలు నడిపేవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి సిద్దాంతాలను తెరకెక్కించే సందర్భంలో తమను తప్పుగా చూపే ఎలిమెంట్స్ ఉంటాయని ఏబీవీపీ కార్యకర్తలు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జార్జిరెడ్డిపై దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించాలంటూ వారు డిమాండ్ చేశారు. సినిమాలో ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఎట్టకేలకు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మా(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) అలాగే సినిమా వివాదాలతో ఈ ఏడాది మరో వివాదం తెరమీదకు వచ్చింది. అదే మా అసోసియేషన్. ఇది రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో మా ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మా లో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ ఎన్నికల్లో పోటీ చేయగా అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించడంతో కమిటీపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఒకే ప్యానల్ నుంచి పోటీ చేసిన నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య వివాదం రాజుకుంది. అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, సెక్రటరీ జీవితలు జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. ఇక అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నరేష్, జీవిత రాజశేఖర్ల మధ్య వివాదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నరేష్‌కు రాజశేఖర్ తన వర్గంతో కలిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పంచాయితీ కాస్తా మెగాస్టార్ చిరంజీవి దాకా చేరడంతో ఆయన నరేష్వైపే ఉన్నట్లు సమాచారం ఇక ఇవేనండి ఈ ఏడాది కాంట్రవర్సీలాగా మారిన టాలీవుడ్ సినిమాలు. పలు సినిమాలపై వివాదాలు అయితే వచ్చాయి గానీ.. ఇలాంటి వివాదాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ మూవీ అయినా హిట్ కొడుతుందని ప్రేక్షకులు వాదిస్తున్నారు. -
నేడు పోలీసుల ముందు హాజరుకానున్న వర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వివాదస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు రావడంతో.. మరికాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు వర్మ హాజరుకానున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ.. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి సినిమాలో వాడారని కేఏ పాల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!) -
మరికొన్ని సెటైరికల్ చిత్రాలు తీస్తాను
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మా సినిమా కుల ద్వేషాలను రెచ్చగొడుతుందనే కారణాలు చూపి రిలీజ్‌ను అడ్డుకోవడానికి ప్రయ త్నించి, రిలీజ్ వాయిదా పడేలా చేశారు. రిలీజ్ ఆలస్యం కావడం వల్ల మాకు నష్టం జరిగింది. దీనికి కారణం అయిన వాళ్లందరి మీద నష్టపరిహారం దావా వేయబోతున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన టైగర్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’. సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అజయ్ మైసూర్, టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ–నిర్మాతలు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో వర్మ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెటైరికల్ చిత్రం. జరగబోయే దాన్ని ఊహించి తీసిన చిత్రం. చాలామందికి అర్థం కాలేదేమో. మెల్లిగ్గా అర్థం చేసుకుంటారు. బయట రాజకీయ నాయకులు ఒకరినొకరు నిజంగానే తిట్టుకుంటుంటారు. వాళ్లను పట్టించుకోకుండా సరదాగా సినిమా తీసిన మా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బయట జరిగే వాటితో పోలిస్తే మేం చాలా తక్కువ చూపించినట్లు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కామెడీగా తీసుకొని ప్రతికూలంగా ఉన్నప్పుడు సీరియస్‌గా తీసుకుంటే ఎట్లా? సెన్సార్ బోర్డ్, ఇంద్రసేన్ చౌదరి, ది గ్రేట్ కేఏ పాల్ మరికొందరు సృష్టించిన ఇబ్బందుల వల్ల రెండు వారాలు ఆలస్యంగా మా సినిమా విడుదలయింది. ఏ కారణాలు చెప్పి ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలనుకున్నారో, హైకోర్ట్ ఆ ఆరోపణలన్నీ కొట్టిపారేసి రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు కూడా వాళ్ల ఆరోపణలను ఆపలేదు. ‘మేం కోర్ట్ని మోసం చేశాం’ అని ఇంద్రసేన్ చౌదరి అనే వ్యక్తి ఆరోపించారు. అంటే.. వాళ్లు కోర్ట్ని అవమానించినట్టే. ఆయనకి కోర్ట్ మీద సరైన అవగాహన లేదనుకుంటాను. రిలీజ్ ఆలస్యం వల్ల మాకు నష్టం జరిగింది. దీని వెనుక ఉన్నవాళ్ల అందరి వివరాలు సేకరిస్తున్నాం. వాళ్ల మీద నష్టపరిహారం దావా వేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఇంద్రసేన్ చౌదరి, కేఏ పాల్, జ్యోతి ఉన్నారు. వాళ్లు నా మీద మార్ఫింగ్ కేసు కూడా పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడదాం అని అనుకున్నవాళ్లను వదిలే సమస్యే లేదు. త్వరలో మరిన్ని సెటైరికల్ చిత్రాలు తీస్తాను. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేను చనిపోయినట్టు పోస్ట్‌లు పెట్టడం తప్ప వేరే కళ లేనట్టుంది. సెటైర్ స్టయిల్లోనే మరిన్ని సినిమాలు తీస్తా. నా తదుపరి చిత్రం ‘ఎంటర్ ది గాళ్ డ్రాగన్’’అన్నారు. ఈ కార్యక్రమంలో టి. అంజయ్య, నట్టి కుమార్ పాల్గొన్నారు. -
రామ్ గోపాల్ వర్మకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ.. కేఏ పాల్ ఫోటో మార్పింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!) దీనిపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వర్మకు నోటీసులు అందించారు. సోమవారం ఉదయం వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. -
బెజవాడలో ‘అమ్మరాజ్యంలో.. ’ చిత్ర బృందం సందడి
మధురానగర్(విజయవాడ సెంట్రల్) : నగరంలోని రాజ్ యువరాజ్ థియేటర్లో శనివారం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర నటీనటులు సందడి చేశారు. నటీనటులతో అభిమానులు సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా సీఎం జగన్మహన్రెడ్డి పాత్రధారుడు అజ్మల్, పవన్ కల్యాణ్ పాత్రధారుడు చైతులతో కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు యువత ఆసఇ్త కనబర్చారు. చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రమని, ఇందులో రాజకీయం లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను మాత్రమే ఇందులో చూపించడం జరిగిందన్నారు. ఈ చిత్రం చూసిన వారికి మంచి వినోదం లభిస్తుందన్నారు. వీకెండ్లో ప్రతీ ఒక్కరూ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన చిత్రం అన్నారు. ప్రమోషన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాత్రధారుడు ధనుంజయ, డైరెక్టర్ సిద్ధార్ధ, కె ఎ పాల్, రోజా పాత్రలు పోషించిన నటీనటులు పాల్గొన్నారు. -
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పై కేఏ పాల్ స్పందన
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిచారు. అమెరికా నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వర్మ చిత్రాన్ని రూపొందించాడని మండిపడ్డారు. తన పేరును కూడా వాడుకోలేని దుస్థితి రామ్ గోపాల్ వర్మది అని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య గొడవలు రేకెత్తించేలా సినిమా ఉందన్నారు. వర్మ నోరు విప్పితే అబద్దాలేనని దుయ్యబట్టారు. (చదవండి : నన్ను చూసి'నారా'!) ఇకపోతే సెన్సార్ బోర్డు ఆదేశాలతో సినిమాలోని కొన్ని సీన్లను కత్తిరించి.. ఆపై చిత్రాన్ని విడుదల చేశారని పాల్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా విషయంలో మాత్రం తుది గెలుపు తమదే అయ్యిందన్నారు. వర్మ ఇప్పటికైనా తనను క్షమాపణ కోరితే మంచిదని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్.. ప్రపంచశాంతి కోసం తిరుగుతున్నానన్నారు. ట్రంప్‌ను కలిసేందుకే అమెరికాకు వెళ్లానని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో మాట్లాడాడని చెప్పకొచ్చారు. తనకు పబ్లిసిటీ అవసరమే లేదని.. తాను ఎన్నికలను మార్చిలోనే బహిష్కరించానని తెలిపారు. -
నన్ను చూసి'నారా'!
ఆ హావభావాలు.. ఆ కంటిచూపు.. కనుముక్కు తీరు.. శరీర కదలికలు.. నడక.. ఒడ్డూ పొడుగూ అచ్చం చంద్రబాబు నాయుడు పోలికలే. ఆయన పాత్రలో ఒదిగిపోయి మెప్పించారు. నటనలో ఏమాత్రం అనుభవం లేని ఓ సాధారణ వ్యక్తి పాత్ర పోషణలో ఔరా అనిపించారు. ఆయనే ధనుంజయ్ ప్రభు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిగా నటించారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ధనుంజయ్ ప్రభు (55) బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. శ్రీనగర్ కాలనీలోని విన్‌ఫ్లోరా హోటల్లో దిగారు. గురువారం ఉదయం సినిమా చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని చట్నీస్ హోటల్లో అల్పాహారం తీసుకుని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చిత్రాన్ని చూశారు. ఈ సినిమాలో నటించేందుకు తనకు వచ్చిన అవకాశం, ఆదరణ తదితర అంశాలపై ఆయన ఇలా ముచ్చటించారు. బంజారాహిల్స్: మాది ముంబై. ఆటో రిక్షా యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశాను. అక్కడ బతుకుభారం కావడంతో థానే సమీపంలోని త్రయంబకేశ్వర్‌లో మహాలక్ష్మి భవన్ పేరుతో రెస్టారెంట్‌ను నడుపుతున్నాను. ఒకరోజు హోటల్ సప్లయర్ రాకపోవడంతో నేనే కస్టమర్లకు భోజనం సరఫరా చేయాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే ఓ కస్టమర్ నేను భోజనం వడ్డిస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. తాను మాజీ సీఎం చంద్రబాబు నాయుడులా ఉంటానంటూ ఫేస్బుక్లో పెట్టడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నన్ను పలకరించడానికి చాలా మంది వచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రామ్‌గోపాల్‌వర్మ నా ఆచూకీ తెలుసుకోవడానికి రెండునెలలు కష్టపడి ఎట్టకేలకు మా హోటల్‌కే వచ్చారు. నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నేను అచ్చంగా చంద్రబాబునాయుడులా ఉంటానని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత ఫోన్ కాల్.. వర్మ వెళ్లిపోయిన తర్వాత కొద్దిరోజులకు నాకు ఫోన్ కాల్వచ్చింది. వారం రోజుల పాటు హైదరాబాద్ రావాలనిచెప్పడంతో ఇక్కడికి వచ్చాను. అప్పుడే నన్ను సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వర్మ పేరున్న దర్శకుడు కావడం నన్ను నటించమని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కథ మొదట్లో తెలియదు. నాకు ఆ పాత్రలో నటించడం వరకే చెప్పారు. నాలో నటుడు ఉన్నాడన్న విషయాన్ని వర్మనే బయటకు తీశారు. ఆయనకు కృతజ్ఞతలు. మూడు వారాలు బాబు వీడియోలు చూశా.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించేందుకు నన్ను ఒప్పించారు. బాబు ఆహార్యం, అలవాట్లు, డ్రెస్ సెన్స్, పద్ధతులు, హావభావాలు అన్నీ అచ్చు గుద్దినట్లుగా ఉండాలని వర్మ చెప్పడంతో ఇక్కడే ఉండి చంద్రబాబుకు సంబంధించిన పలు వీడియోలు, ప్రసంగాలు, అసెంబ్లీలో ఆయన హావభావాలు గమనించాను. సినిమా బాగా వచ్చింది.. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రకు బాగా రెస్పాన్స్ వచ్చింది. బాబులో పరకాయ ప్రవేశం చేశావంటూ మెచ్చుకున్నారు. జబర్దస్త్ ఫర్మామెన్స్ చేశావని కొనియాడారు. ఇప్పుడు నేను సెలబ్రిటీనయ్యాను. సినిమా చూసి బయటకురాగానే వందలాది మంది ప్రేక్షకులు నా వద్దకు వచ్చి ఫొటోలు దిగారు. చంద్రబాబులా నటించడం చాలా కష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమా మంచి కాలక్షేపం. ఫన్నీగా ఉంటుంది. సినీ అవకాశాల్ని వదులుకోను.. ఈ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు పాత్ర కావడంతో బాగా పేరొచ్చింది.నా నటన కూడా అందరికీ నచ్చింది. వర్మసినిమాలో నటించడంతో మరింత పేరొచ్చింది. మంచి అవకాశాలు వస్తే నటిస్తాను. -
వారి పేర్లు బయటపెడతా: వర్మ
‘‘మా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. ఎవరెవరు ఆపడానికి ప్రయత్నించారో వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతా. సినిమా ఆపడానికి ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాం. 2019 మే నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. ఇదంతా ఫన్నీగా ఉంటుంది’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమా పనుల నిమిత్తం చైనాలో ఉన్నారు వర్మ. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆన్లైన్ ద్వారా ఆయన పై విధంగా మాట్లాడారు. రామ్‌గోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ నిర్మాతలు. వర్మ ఆన్లైన్ ప్రసంగం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, అంజయ్య మాట్లాడుతూ – ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కోసం 15 రోజులుగా యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయం సాధించాం. సినిమాని ఆపడానికి ఎవరు ప్రయత్నించారో గురువారం మధ్యాహ్నానానికల్లా ప్రతి ప్రేక్షకుడి ఊహకు తెలుస్తుంది. ఆపాలని ప్రయత్నించినవారిపై వర్మ చెప్పినట్లుగానే పరువు నష్టం దావా వేస్తాం. ఈ సినిమాకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది’’ అన్నారు. -
వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్
ముంబై: ఏం చేసినా వివాదంతో ప్రారంభమై.. వివాదంతో ముగిసి..సెన్సేషన్ కావడం ఒక్క రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. తాజాగా ఆయన నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు ముందే ఎంత వివాదాస్పదం అవుతున్నదో తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు రాజకీయ నాయకుల నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పేరుతో వర్మ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ.. సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే తాజాగా.. ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలో వర్మ మార్క్ మార్ఫింగ్ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో మూవీ టైటిల్‌ను కూడా మార్చిన సంగతి తెలిసిందే. కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌ను కాస్త... అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇటీవలే వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. చదవండి: వర్మ మూవీకి లైన్ క్లియర్.. ఆ రోజే రిలీజ్..! -
డేట్ ఫిక్స్
రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రానున్న తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్‌వర్మతో కలిసి సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. రివైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఏ వర్గాన్నీ టార్గెట్ చేసిన చిత్రం కాదు ఇది. ఫ్యాక్షనిజమ్, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చిత్రబృందం వెల్లడించింది. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రానికి సహనిర్మాతలు. -
వర్మ మూవీకి లైన్ క్లియర్.. ఆ రోజే రిలీజ్..!
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ కాగా.. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ను నిర్ణయించారు. సినిమా కథనంతోపాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఆదేశాలమేరకు సెన్సార్ బోర్డు సినిమాను చూసి పరిశీలనాంశాలను తెలపాలని కోరిన విషయం తెలిసిందే. -
‘ఈ టెక్నిక్ ఫాలో అయ్యుంటే సినిమా రిలీజయ్యేది’
సాక్షి, చెన్నై : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంపై సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. వివాదాస్పద టైటిల్ వలన సినిమా రిలీజవదని, పబ్లిసిటీ హైప్ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు. కులాల పేరుతో టైటిల్స్ ఉంటే పర్మిషన్ ఇవ్వరని అందుకు ఇటీవల వచ్చిన వాల్మీకి చిత్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ సినిమాలాగా రిలీజ్‌కి ఒక్కరోజు ముందు టైటిల్ మారిస్తే సరిపోయేదని సూచించారు. సెన్సార్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం సినిమాపై కోర్టులో కేసు ఉంటే సర్టిఫికెట్ ఇవ్వరని వెల్లడించారు. ఈ నిబంధనను చిరంజీవి సైరా నుంచి అధికారులు ఖచ్చితంగా పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కాకుండా, సినిమాలో కేఏ పాల్ పాత్రలేదని వర్మ కోర్టులో ఒక్క డిక్లరేషన్ ఇచ్చి ఉంటే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం, సైరా సినిమాలకు తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేదాకా ఆగి ఉంటే ఆ తర్వాత సినిమా విడుదలను ఆపే అధికారం భద్రత పేరుతో ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు. సినిమా రిలీజయ్యాక అందులోని సన్నివేశాలు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే కేసు పెడతారని, లేదంటే పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు. ఇప్పుడు కేఏపాల్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తుదితీర్పు వచ్చేదాక, సెన్సార్ వాళ్లు సినిమా చూసినా కూడా సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెడతారని వివరించారు. ఇలా కాకుండా సినిమా విడుదలకు ముందే నాలుగు రోజులు టీవీ డిబేట్లలో సందడి చేయడం అనేది వాళ్లకు టీఆర్పీ రేటు పెంచడానికే ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు ఈ సినిమా విడుదల కాకూడదని సినీ రంగంలోని కొందరు పెద్దలు పనిచేస్తున్నారని ఆరోపించారు. వీటి ముందు కేఏపాల్ సమస్య చాలా చిన్నదని పేర్కొన్నారు. -
అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు
‘‘సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్ అనేది అవుట్ డేటెడ్’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్ 14న సెన్సార్‌కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్ మైసూర్. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ. -
తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!
‘‘బయట, సోషల్ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించుకోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ పతాకాలపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో నేను తీసిన తొలి సందేశాత్మక చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితుల నుంచి ఈ సినిమా ఆలోచన వచ్చింది. 2019 మే 22 నుంచి సెప్టెంబరు 2020 కాలపరిమితిలో సినిమా ఉంటుంది. అంటే జరిగినవి, జరుగుతున్నవి తీయడంతో పాటు జరగబోయేవి కూడా ఊహించి తీసిన చిత్రం. రాజకీయ వ్యంగ్యంగా ఈ సినిమా ఉంటుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను కంటిన్యూ చేయవచ్చేమో! ► ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి పాత్ర వేయడానికి ఒకరు అవసరం అయ్యారు. ఆ పాత్ర కోసం ఆర్టిస్టును వెతుకుతున్నప్పుడు ఓ వ్యక్తిని నేను సోషల్ మీడియాలో చూశాను. నాసిక్‌లో వెయిటర్‌గా చేస్తున్నాడని తెలిసింది. అతన్ని పిలిపించి నటనలో శిక్షణ ఇప్పించాం. ► ఈ సినిమాలో ఏ వర్గం వారినీ హైలైట్ చేయలేదు. టార్గెట్ చేయలేదు. కొన్ని రియల్æలైఫ్ క్యారెక్టర్స్‌ను పోలి ఉన్న ఆర్టిస్టులను సినిమాలో తీసుకోవడం జరిగింది. దీంతో ఆడియన్స్ వారి ఆలోచనకు తగ్గట్లు ఊహించుకుంటున్నారు. అంతే కానీ నేను ఎవర్నీ టార్గెట్ చేయలేదు. ► ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అంకితం ఇచ్చాం. ‘కమ్మ రాజ్యంలో...’ని ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు తండ్రీకొడుకులకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా ఐడియా మాత్రమే నాది. టీమ్ అంతా కలిసి తీశాం. సెన్సార్ నుంచి టైటిల్‌పై అభ్యంతరం ఎదురైతే ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్ అనుకుంటున్నాం. ► ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, క్రిమినల్ కథల కన్నా పొలిటికల్ క్రిమినల్ స్టోరీసే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మా కంపెనీ నుంచి రానున్న మరో చిత్రం ‘బ్యూటీఫుల్’ వచ్చే నెల 6న విడుదలవుతుంది. ఓ చైనీస్ కో–ప్రొడక్షన్ కంపెనీతో ఢలేడీ బ్రూస్లీ’ సినిమా తీస్తున్నాం. నేను భక్తి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకోరేమో!. ► ట్రైలర్లో పప్పు వడ్డించే సీన్ ఉంది? అభ్యంతరం తెలుపుతూ కాల్స్ వచ్చాయా? నేను విన్నది ఏంటంటే ఈ సీన్ తెలుగు దేశంవారికి బాగా నచ్చిందట. అంటే తెలుగుదేశం వారు బయటకు చెప్పలేని విషయాన్ని నేను చెప్పినందుకు వారికి నచ్చిందేమో. ఆ సీన్ నచ్చిందని కొన్ని ఫోన్లు వచ్చాయి. అయినా ఓ తండ్రి తన కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తాడు. ఈ సీన్‌ను ఏదోలా భావిస్తే నా తప్పు కాదు. ► ఈ టీజర్లో ‘బుడ్డోడు’ అనే డైలాగ్ ఉంది? ఇది ఒక యాక్టర్ గురించి అంటారా? అది మీరు సినిమాలో చూడండి. ► కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరు? అని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వ్యాఖ్యలను అలాగే పెట్టారు..? మనుషులు అన్నప్పుడు చూశారు. మరి ఇప్పుడు సినిమాలోని యాక్టర్ అంటే ప్రాబ్లమ్ ఏంటి? అల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నదే కదా! ► ఈ సినిమా జగన్మోహన్రెడ్డిగారికి ఫేవరబుల్‌గా ఉంటుందని కొందరి అభిప్రాయం? ► అది కరెక్ట్ కాదు. జరగనిది ఊహించి ఒక భవిష్యత్‌ను తెరకెక్కించినప్పుడు ఎవరికీ ఫేవర్‌గా చూపించలేం. జరిగిన సంఘటనలు అయితే ఎవరు కరెక్ట్? ఎవరు కాదు? అని ఓ అంచనాతో ఉండొచ్చు. మరి జరగని దాని గురించి ఎలా ఫేవర్‌గా తీస్తారు? ► జనసేన ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది? సినిమాలో పవన్‌కల్యాణ్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతారు. ఈ ‘మనసేన’ పార్టీకి, జనసేనకు ఏ సంబంధం లేదు. ► ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? మరో ‘సర్కార్’ తీయాలని ఉంది. ► ట్రైలర్లో స్పీకర్ నిద్రపోతున్నట్లు చూపించారు నిజంగా జరిగి, పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి కామెంట్ చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుందని నా అభిప్రాయం. అందరికీ తెలిసిన దాన్నే నేను సినిమాలో చూపించాను. -
‘పప్పులాంటి అబ్బాయి..’ పాట ట్రెండింగ్!
ఇటీవల కాలంలో ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్’గా నిలిచిన చిత్రాల్లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఒకటి. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్దార్థ తాతోలు దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘800 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘పప్పు లాంటి అబ్బాయి..’ పాట మంచి ఆదరణతో ట్రెండింగ్ అయ్యింది. మొత్తం ఏడు పాటల్లో ఏ పాటకు ఆ పాట హైలైట్‌గా ఉంటుంది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమైన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్. -
పప్పులాంటి అబ్బాయి...
ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తీయడంలో దర్శక–నిర్మాత రాంగోపాల్ వర్మకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన అందిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ‘‘ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రాజకీయ నేపథ్యాల్లో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. ఆదివారం విడుదల చేసిన ‘పప్పులాంటి అబ్బాయి..’ పాట మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ. -
ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఘనవిజయం సాధించిన వర్మ మరోసారి రాజకీయ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ సమయంలోనే తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ప్రకటించిన వర్మ సైలెంట్‌గా షూటింగ్ పనులు కూడా కానిచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోతో పాటు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఈ కొత్త నటుడు ఏ నిజ జీవిత పాత్రలో కనిపిస్తున్నాడో చెప్పగలా?’ అంటూ కామెంట్ చేశాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను టైగర్, ప్రొడక్షన్ కంపెనీ, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Here is the first look logo poster of KAMMA RAJYAMLO KADAPA REDDLU .. #KRKR is a very non controversial film filled with controversial characters https://t.co/KrLctMDCh2 — Ram Gopal Varma (@RGVzoomin) September 7, 2019