సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వర్మ.. కేఏ పాల్ ఫోటో మార్పింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!)
దీనిపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వర్మకు నోటీసులు అందించారు. సోమవారం ఉదయం వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment