Hyderabad Cyber Crime Police
-
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
సైబర్ క్రైం పోలీసుల ఆపరేషన్.. భారీగా అరెస్ట్‌లు
హైదరాబాద్, సాక్షి: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. ఏడు బృందాలతో గుజరాత్‌తో కీలక ఆపరేషన్ చేశారు.ఈ ఆపరేషన్‌లో 36 మంది నిందితులు అరెస్టు చేశారు. అందులో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్‌తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ కూడా ఉన్నారు. ఇన్వెస్ట్మెట్ ఫ్రాడ్‌లో 11, ట్రేడింగ్ ఫ్రాడ్‌లో నలుగురు, కేవైసీ ఫ్రాడ్‌లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై హైదరాబాద్‌లో 20 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి.. 60 మంది యువతులను మభ్యపెట్టి..
సాక్షి, హైదరాబాద్ : అందమైన అమ్మాయిగా, ఆగర్భ శ్రీమంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ సోషల్‌మీడియా ద్వారా యువతులు, మహిళలను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న జోగాడ వంశీకృష్ణను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఇతడి వలలో పడిన నగర యువతి రూ.25 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన వంశీకృష్ణను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణ పూర్తి కావడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. ఇతగాడు ఇప్పటి వరకు దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు దండుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేసి 2014లో నగరానికి వలసవచ్చి రెండేళ్ల పాటు కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో, ట్రావెల్స్ కన్సల్టెన్సీలోనూ పని చేశాడు. క్రికెట్ బెట్టింగ్స్‌తో పాటు రేసులకు అలవాటు పడిన ఇతగాడు అందుకు కావాల్సిన డబ్బు కోసం మోసాలు చేయడం మొదలెట్టాడు. 2017లో తన గర్ల్‌ఫ్రెండ్ సుస్మితతో కలిసి పథక రచన చేసిన ఇతగాడు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దాదాపు 40 మంది యువతుల నుంచి రూ.1.8 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై రాచకొండ కమిషనరేట్‌తో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు, రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. పంథా మార్చుకుని.. ♦ గడిచిన కొన్నాళ్లుగా వంశీకృష్ణ తన పంథా మార్చుకున్నాడు. యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచాడు. వీటి ద్వారానే అనేక మంది యువతులు, మహిళలను పరిచయం చేసుకున్నాడు. వారితో కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత హర్షవర్ధన్ అనే సంపన్నుడు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నాడంటూ సమయం చూసుకుని చెప్పేవాడు. అతడి ఫోన్ నంబర్ అంటూ తనదే పంపేవాడు. దానికి కాల్ చేసిన వారితో హర్షవర్ధన్ మాదిరిగా సంభాంచేవాడు. ♦ తన వలలో పడిన సంపన్న వర్గాలకు చెందిన యువతుల నుంచి సేవా కార్యక్రమాలు, పేదలకు ఉపాధి కలి్పంచే అంశాల పేరుతో డబ్బు దండుకునే వాడు. ఇలా దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు కాజేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఓ నగర యువతి ఇతడికి రూ.25 లక్షలు ఇచ్చి మోసపోయింది. ఆమె ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. 2016 నుంచి ఇతగాడు దాదాపు వెయ్యి మందికి పైగా మోసం చేసి ఉంటాడని అధికారులు చెబుతున్నారు. -
చైనా లోన్‌యాప్స్ ఆగడాలు.. భాష రాకపోయినా ‘డింగ్‌టాక్’ తో
సాక్షి, హైదరాబాద్: చైనా తప్ప మరో భాష సరిగ్గా రాని అక్కడి సూత్రధారులు.. హిందీ, ఇంగ్లిషు మినహా మరొకటి తెలియని ఇక్కడి పాత్రధారులు.. అయినా చైనా నుంచి వస్తున్న ఆదేశాలను పక్కాగా ఎలా అమలు చేస్తున్నారు? లోన్ యాప్స్ కేసుల్లో రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసులను ఇప్పటి వరకు వేధించిన ప్రశ్న ఇది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సమాధానం తెలుసుకున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య సంప్రదింపుల కోసం డింగ్‌టాక్ యాప్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇందులో సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మాట్లాడితే ఏ భాషనైనా, ఏ భాషలోకైనా తర్జుమా చేసి అవతలి వారికి వినిపిస్తుంది. దాదాపు 60 లోన్‌యాప్స్ నిర్వహిస్తూ రుణగ్రస్తుల్ని వేధించిన ఢిల్లీ ముఠాను పట్టుకున్న అధికారులు వారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితుల కస్టడీ గడువు శనివారంతో ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 60 లోన్‌యాప్స్‌తో చైనీయుడి ఆగడాలు.. చైనాకు చెందిన విక్టర్ మొబైల్ క్యాష్, క్యాష్ అడ్వాన్స్, హ్యాండీ క్యాష్, రుపీ బాక్స్, ఫాస్ట్ రుపీ సహా మొత్తం 60 లోన్‌యాప్స్ ఏర్పాటు చేశాడు. వీటిని నిర్వహించడం కోసం బిహార్‌కు చెందిన రాంబాబును నియమించుకున్నాడు. ఈ క్రమంలో యాప్స్ నుంచి రుణం తీసుకుని కట్టలేకపోయిన వారిని వేధించి, బెదిరించి డబ్బు వసూలు చేయడానికి కాల్ సెంటర్ కావాలని విక్టర్.. రాంబాబును కోరాడు. దీంతో అతను గతంలో తనతో కాల్ సెంటర్లో పని చేసిన ఢిల్లీ వాసులు ఆకాశ్ మిశ్రా, సుల„Š్యసింగ్లను సంప్రదించి వారిని టీమ్ లీడర్, రికవరీ మేనేజర్లుగా నియమించాడు. అనంతరం వీరిద్దరు ఆగ్రాకు చెందిన రాహుల్ వర్మ, ప్రజాపతి అనిల్ తదితరుల ద్వారా కొందరు టెలికాలర్లను నియమించుకున్నారు. ఢిల్లీకి చెందిన టెలికాలర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తూ రుణగ్రస్తులకు ఫోన్లు చేసి వే«ధిస్తున్నారు. ఎవరు ఎంత రుణం తీసుకున్నారు? ఎంత చెల్లించారు? ఏ మేరకు బాకీ ఉంది? తదితరాల డేటాకోసం వీళ్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించుకున్నారు. దీనిని ఉపయోగించి టెలీకాలర్లు తమ వద్ద ఉన్న జాబితాలోని రుణగ్రస్తుడి ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఈ వివరాలన్నీ తెలుస్తాయి. ఒక్కో టెలికాలర్‌కు గరిష్టంగా 700 మంది కస్టమర్లతో మాట్లాడే బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌లో మూడు కేసులు ఈ డేటా మొత్తాన్ని విక్టర్ చైనా నుంచి రాంబాబు ద్వారా వీరికి చేరుస్తున్నాడు. ఈ యాప్స్ వేధిం పులకు సంబంధించి హైదరాబాద్‌లో మూడు కేసు లు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలను బట్టి ఆకాశ్ మిశ్రా, సుల„Š్యసింగ్, రాహుల్ వర్మ, ప్రజాపతి అనిల్ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది. ఈ నెల 4న అక్కడ దాడి చేసిన అధికారులు నలుగురినీ అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించారు. ఇందులో భాగంగా ఇన్స్పెక్టర్ జి. వెంకట్రామిరెడ్డి విక్టర్–రాంబాబు మధ్య ఎలా సంప్రదింపులు జరుగుతున్నాయనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ కోణంలోనే నిందితులను విచారించారు. డింగ్‌టాక్ సంగతి ఇలా బయటపడింది.. రాంబాబు ఓ సందర్భంలో ప్రస్తుతం అరెస్టయిన నిందితుల ఎదురుగానే డింగ్ టాక్ యాప్ ద్వారా విక్టర్‌తో మాట్లాడాడు. అందులో సెట్టింగ్స్ మార్చడం ద్వారా ఇతడు హిందీలో మాట్లాడే అంశాలు విక్టర్‌కు చైనా భాషలో, అతడు చైనీస్‌లో మాట్లాడేవి రాంబాబుకు హిందీలో వినిపించేలా ఏర్పాటు చేసుకున్నారు. నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టారు. వీరి మధ్య నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగేవి. ప్రస్తుతం పరారీలో ఉన్న రాంబాబు కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. అతను చిక్కితేనే విక్టర్‌తో ఉన్న పరిచయాలు, ఇతర కాల్ సెంటర్ల వివరాలు తెలుస్తాయని పోలీసులు చెపుతున్నారు. మొత్తానికి ఈ కేసు ద్వారా హైదరాబాద్ పోలీసులు రెండేళ్లుగా మిస్టరీగా ఉన్న లోన్‌యాప్స్‌లో సూత్రధారులైన చైనీయులు, పాత్రధారులైన భారతీయుల మధ్య జరుగుతున్న సమాచారమార్పిడి విధానాన్ని కనిపెట్టగలిగారు. -
ఐసిస్ స్లీపర్ సెల్ యువకుడి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆన్లైన్ ద్వారా ఆకర్షితుడై, విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఆదేశాల మేరకు అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులకు సిద్ధమైన ఓ స్లీపర్ సెల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం..సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ సులేమాన్ (19) తండ్రి చాలాకాలం యూఏఈలో ఉద్యోగం చేశారు. అక్కడే పుట్టిన సులేమాన్ కుటుంబంతో పాటు నగరానికి తిరిగి వచ్చి పహాడీషరీఫ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. 2020లో ఇంటర్ చదువుతున్నప్పుడే ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులిచ్చిన ఫోన్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోని వచ్చిన వీడియోల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆన్లైన్లో ప్రసంగాలు విని.. ఆన్లైన్లో పరిచయమైన ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల ప్రకారం తన ఫోన్లో ఇన్స్ట్రా గామ్, టెలిగ్రామ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్స్‌లోని గ్రూపుల్లో ఉన్న ఉగ్రవాద సంబంధిత వీడియోల ద్వారా ప్రసంగాలు, చర్చల్లో సైతం పాల్గొన్నాడు. హ్యాండ్లర్ సూచనల మేరకు ఉగ్రదా డులు చేయడానికి సిద్ధమై, అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చే వరకు స్లీపర్ సెల్ మాదిరిగా నగరంలోనే ఉంటున్నాడు. హ్యాండ్లర్ పంపిన లింకు వీడియోల ద్వారా బాంబుల తయారీ, ఉగ్రవాద దాడులు చేయడం వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. దీంతోపాటుగా నగరానికి చెందిన మరికొందరు యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశాడు. నిఘాపెట్టిన కేంద్ర వర్గాలు.. ఇతడి వ్యవహారాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు కొన్నాళ్లుగా సాంకేతిక నిఘా ఉంచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, అమెరికా, ఇజ్రాయెల్ రా యబార కార్యాలయాలపై దాడులు చేస్తానంటూ ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రాం గ్రూపుల్లో పోస్టులు పెట్టా డు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు పహాడీషరీఫ్ లోని సులేమాన్ ఇంటిని కనిపెట్టి అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీలో ని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యూడీషి యల్ రిమాండ్‌కు తరలించారు. సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ చేయనున్నట్లు సీసీఎస్ అధికారి వివరించారు. -
ట్వీట్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో సిద్ధార్ధ్
-
హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు..
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్‌పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ రాసిన బహిరంగ లేఖలో 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్ నాకు ఎప్పుడూ ఛాంపియన్‌గా ఉంటావు సైనా' అని రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, దూమరం రేపుతోన్న సిద్ధార్థ్ ట్వీట్ -
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై నగర సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన దీని టీజర్‌ను పరిశీలించిన అధికారులు ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసే సన్నివేశం ఉన్నట్లు గుర్తించారు. కథానాయకుడు, నాయికలకు సంబంధించిన సన్నివేశంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా ఓ భక్తి గీతాన్ని వినిపించారు. ఇది తీవ్ర అభ్యంతరకరమనే వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వెలువడ్డాయి. దీంతో ఆ ట్రైలర్‌ను వీక్షించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చిత్ర యూనిట్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఆ యూనిట్‌కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు
హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతులను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకొని అనంతరం వారిని నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని వేధిస్తుండడంతో విసుగు చెందిన ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ రామన్నగూడెం ప్రాంతానికి చెందిన సంతోశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంతోశ్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
హైదరాబాద్ పోలీసుల సాహసం..
సాక్షి, హైదరాబాద్: అది రాజస్తాన్ సరిహద్దుల్లోని మేవాట్ ప్రాంతం.. భరత్పూర్ జిల్లాలో ఉన్న మూడు పక్కపక్క గ్రామాలు.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు అక్కడి అధికారులతో కూడిన బృందం.. ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల’కోసం గ్రామాల్లో వేట మొదలెట్టింది.. ప్రతిఘటించిన నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఎదురుదాడి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి 18 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా ‘ఖాకీ’సినిమాను తలపించింది. వీరిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ విభాగం డీసీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. ఈ నెల 9న కూడా మరో 8 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. అమ్ముతామంటూ.. కొంటామంటూ.. భరత్పూర్ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ.. ఓఎల్ఎక్స్ వంటి ఈ–యాడ్స్ వెబ్సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పేర్కొంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు.. రెండేళ్లుగా భరత్పూర్ జిల్లాలోని గ్రామాలపై దాడి చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేచి చూస్తున్నారు. ఇటీవల తమ వద్ద ఉన్న కేసుల రికార్డులు సిద్ధం చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్.. ఆపరేషన్ కోసం ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్, ఎస్సై రమేశ్‌ల నేతృత్వంలో 10 మంది పోలీసులు ఈ నెల మొదటి వారంలో అక్కడకు పంపించారు. తొలుత పాడ్లా ప్రాంతంలో దాడి చేసి 8 మంది దుండగులను అరెస్టు చేశారు. ఆ తర్వాత చుల్హేరా, కల్యాణ్‌పూర్, ఖరీక గ్రామాల్లో అసలు నేరగాళ్లు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో భరత్పూర్ ఎస్పీ అమరీందర్ సింగ్‌ను సంప్రదించిన ఇక్కడి అధికారులు.. ప్రత్యేక బలగాలను సమీకరించుకున్నారు. 100 మంది పోలీసులు 30 వాహనాల్లో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ మూడు గ్రామాలను దిగ్బంధం చేశారు. తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న నేరగాళ్లు, వారి కుటుంబీకులు చుట్టుపక్కల వారితో కలసి పోలీసులపై దాడికి దిగారు. కర్రలు, కారం పొడితో అధికారులపై దాడి చేశారు. మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు కొందరు పోలీసులను గాయపరిచారు. దీంతో భాష్పవాయు గోళాలు ప్రయోగించి 10 మంది నేరగాళ్లను గుర్తించి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. రెండు దశల్లో అరెస్టయింది వీరే.. ఆరిఫ్ ఖాన్, ధీను ఖాన్, ఇలియాస్ ఖాన్, పుష్పేంద్ర సింగ్, రాధేశ్యాం, మోహన్ సింగ్, హకీం ఖాన్, విజిబ్ ఖాన్, సాహిల్, షహీద్, ఉమర్ ఖాన్, సత్యవీర్ సింగ్, ఇర్ఫాన్, తరీఫ్, ఆరిఫ్ ఖాన్, మోహన్ సింగ్, అజారుద్దీన్, రాహుల్. పోలీసుల జోలికే రావడంతో.. హైదరాబాద్‌లో ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ ఓఎల్ఎక్స్ క్రైమ్దే ప్రథమ స్థానం. రోజుకు దాదాపు ఐదారుగురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేరగాళ్ల అడ్డా.. భరత్పూర్ జిల్లా అని రెండేళ్ల కిందటే పోలీసులు గుర్తించారు. రెండుసార్లు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి దాడులు చేశారు. అయితే స్థానిక పోలీసుల నుంచి సహకారం లేకపోవడంతో మన పోలీసులు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్లు’పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది అధికారుల పేర్లతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, వారి స్నేహితులలో చాటింగ్ చేస్తూ డబ్బు గుంజారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసుల నుంచి భరత్పూర్ అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అక్కడి అధికారుల వైఖరిలో మార్పు వచ్చింది. -
ఆర్మీ జవాన్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్ : లోన్ పేరుతో ఆర్మీ జవాన్‌కు సైబర్ కేటుగాళ్ళు టోపీ పెట్టారు. రుణం ఇస్తామంటూ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మోసగాళ్లు ఫోన్ చేసి డబ్బులు దోచుకున్నారు. నేరగాళ్ల మాయమాటులు నమ్మిన ఆశ్విన్ అనే ఆర్మీ జవాన్.. లోన్ ఓకే ప్రాసెసింగ్ ఛార్జి, డాక్యుమెంట్ ఛార్జ్ , జీఎస్టీ పలు పేర్లతో 4.31 లక్షల రూపాయల నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లో జమ చేశాడు. లోన్ ఎప్పటి వరకు వస్తుందని పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. మోసపోయానని తెలుసుకున్న జవాన్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
మీరు మద్యం ప్రియులా.. తాగాలని ఉందా..?
సాక్షి, సిటీబ్యూరో: మీరు మద్యం ప్రియులా...మద్యం తాగాలని ఉబలాట పడుతున్నారా... లాక్డౌన్ వేళ మీకు ఎక్కడా లభించని మద్యాన్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వగానే మీ ఇంటికొచ్చి మరీ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశను క్యాష్‌గా మలచుకొని వారి ఖాతాల్లో డబ్బులను గుల్ల చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలులో మద్యం దుకాణాలు మూసివేసి ఉండటంతో అదే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేస్తున్నారు. ఆధునిక సాంకేతికతపై మంచి అవగాహన ఉన్న వీరు గూగుల్ సెర్చ్ ఆప్షన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాప్‌ల పేరుతో తమ నంబర్లను ఆన్లైన్లో ఉంచుతున్నారు. గూగుల్‌లోని వైన్‌షాప్ నియర్ మీ అని కొడితే గూగుల్‌లో వచ్చేలా చిరునామాలు అందుబాటులో ఉంచారు. (శానిటైజర్లు తాగేస్తున్నారు) అయితే సామాజిక మాధ్యమాల ద్వారా ఇది నిజమేననుకొని కొంతమంది ఆ లింక్ కిక్ చేసి మరీ వారు అడిగిన రెండింతల రేటుకు డబ్బులను బ్యాంక్ ఖాతాల నుంచి ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆయా నంబర్లను సంప్రదిస్తే ఎటువంటి స్పందన ఉండటం లేదు. ఇటువంటి రెండు కేసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. అందుకే ఆన్లైన్ల ద్వారా ఆర్డరిస్తే ఇంటికే మందు అనే లింక్‌లను నమ్మవద్దని, లాక్డౌన్ వేళ అసలు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ రకంగా ప్రజలను మోసం చేసే నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
హైదరాబాద్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సునిశిత్ పలు యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లావణ్యపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. యూట్యూబ్ చానెల్స్‌లో సునిశిత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని తెలిపారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిశిత్ ఇతర సెలబ్రిటీలపైన కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని వెల్లడించారు. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళ్లో అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయి పాత్రలో లావణ్య కనిపించనున్నారు. -
హాయ్.. నేను విజయ్ దేవరకొండ!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో ఓ నకిలీ పేజీ ఏర్పాటైంది. దీని ద్వారా యువతులకు వల వేస్తున్న మోసగాడు విజయ్ మాదిరిగా చాటింగ్స్ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన విజయ్ దేవరకొండ తన సహాయకుడినే మహిళగా రంగంలోకి దింపి చాటింగ్ చేయించారు. విషయం రూఢీ కావడంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు తన మేనేజర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. ఫేస్బుక్లో విజయ్ దేవరకొండ పేరుతో కొన్నాళ్ల క్రితం ఓ నకిలీ పేజ్ ఏర్పాటైంది. దీన్ని చూసిన అనేక మంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. ఇలాంటి రిక్వెస్ట్ల్లో యువతులకు సంబంధించినవి గుర్తిస్తున్న మోసగాడు వారితో మెసెంజర్ ద్వారా చాటింగ్‌కు దిగుతున్నాడు. (చదవండి : ‘క్లబ్ రౌడీ..మేం రెడీ... ’) కొన్ని రోజుల తర్వాత తొలుత తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్ చేయాలని, పూర్వాపరాలు పరిశీలించిన అతడు చేసే సిఫార్సు ఆధారంగా నేను చాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండ మాదిరిగా సదరు మోసగాడు చెప్తున్నాడు. ఆపై తన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ ఓ ఫోన్ నంబర్ ఇస్తున్నాడు. దీంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న యువతులతో అతగాడు ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ ఎర వేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. సదరు మోసగాడికి చెందిన వాట్సాప్ నంబర్ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన ఆయన తన వద్ద సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయమని సూచించారు. తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్ ఆ మోసగాడితో చాటింగ్ చేయగా... తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్న అతగాడు ప్రేమ, పెళ్లి కథలే మొదలెట్టాడు. దీంతో పాటు ఆ మోసగాడు దాదాపు పది మంది యువతులను ఇలానే మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
యాంకర్ అనసూయకు వేధింపులు
-
యాంకర్ అనసూయకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు. Dear @TwitterSupport .. I urge you to reassess "your rules" .. if this is not violating then what else does.. I won't shy away to blame you guys as major influence by not contemplating the cyber abuse.. @cybercrimecyb1 Sir I request you to help tag the right authorities 🙏 pic.twitter.com/G4I3KRwFQ9 — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020 -
నేడు పోలీసుల ముందు హాజరుకానున్న వర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వివాదస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు రావడంతో.. మరికాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు వర్మ హాజరుకానున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ.. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి సినిమాలో వాడారని కేఏ పాల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!) -
రామ్ గోపాల్ వర్మకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ.. కేఏ పాల్ ఫోటో మార్పింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!) దీనిపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వర్మకు నోటీసులు అందించారు. సోమవారం ఉదయం వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. -
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్‌కౌర్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్‌కౌర్ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్‌తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్‌క్రైమ్ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్‌క్రైమ్ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి) ప్రముఖులకు దగ్గరై... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్‌మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్‌ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కోటిని అదే విధంగా పూనమ్‌కౌర్ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్‌క్రైమ్ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు. చదవండి: సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ -
వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం; సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబ్ చానల్ ‘వాక్డ్ అవుట్ అండ్ మ్యాంగో’ గ్రూప్ ఎండీ వీరపనేని రామకృష్ణను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్, టాలీవుడ్ నగర్, చాలెంజ్ మంత్ర వెబ్సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో ఉన్న ఎన్బీకే బిల్డింగ్‌లో ఉంది. ఎన్బీకే భవనం నందమూరి బాలకృష్ణకు చెందినది. వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం. -
వైఎస్ షర్మిల కేసులో మరో వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రకాశం జిల్లా వేములకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్‌ది తొలి అరెస్టు కాగా... ఆదివారం తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన నవీన్‌ను అరెస్టు చేశారు. మరికొందరు బాధ్యుల్ని గుర్తించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు యూట్యూబ్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యమిస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. షర్మిల తన ఫిర్యాదుతో పాటు దాదాపు 60 యూట్యూబ్ లింకుల్ని పోలీసులకు సమర్పించారు. వీటిని పరిశీలించిన అధికారులు ఆ అభ్యంతరకరమైన కామెంట్లపై దృష్టి పెట్టారు. ఏడుసార్లు కామెంట్లు పెట్టిన వెంకటేష్‌ను శనివారం గుంటూరులో అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆదివారం మంచిర్యాలలోని రామ్‌నగర్‌కు చెందిన అద్దూరి నవీన్‌ను కటకటాల్లోకి పంపారు. నవీన్ నాలుగు వీడియోల కింది భాగంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేష్‌ను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నవీన్‌ను సైతం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు. వృత్తిరీత్యా క్షురకుడైన ఇతను ఎందుకు అభ్యంతరకర కామెంట్లు చేశాడనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూ–ట్యూబ్‌లోకి అప్లోడ్ చేసి వివరాలు, పదేపదే కామెంట్లు పెట్టిన వారి మూలాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏదో ఒక ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్నెట్ను యాక్సిస్ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ కేసులో వీడియోలు పోస్ట్ చేసిన వారితో పాటు కామెంట్లు చేసిన వారూ నిందితులుగా మారతారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 18 మందికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. -
వైఎస్ షర్మిల కేసులో మరో వ్యక్తి అరెస్ట్
-
షర్మిల కేసులో దర్యాప్తు ముమ్మరం
-
షర్మిల కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో శనివారం అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 509, 67(ఎ) ఐటీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరికాసెట్లో నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అసలు సూత్రదారుల పాత్రపై విచారించేందుకు నిందితుడిని కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి. నిందితుడు గుంటూరులోని ఆర్వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. సొంతూరైన వేములలో తమ కుటుంబానికి రెండెకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మంచిర్యాలలో.. వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్లు చేసిన మరొకరిని మంచిర్యాలలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మరికాసెట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. అలాగే షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన మరో ఐదుగురి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
దర్యాప్తు ముమ్మరం.. ఒకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో శనివారం అరెస్టు చేశారు. అతడు గుంటూరులోని ఆర్వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. సొంతూరైన వేములలో తమ కుటుంబానికి రెండెకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన వెంకటేశ్వరరావును పోలీసులు ఆదివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. ఐపీ అడ్రస్‌తో గుర్తించాం: తనపై ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల హైదరాబాద్ సీపీకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘‘షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన వెంకటేశ్వరరావును గూగుల్ ఇచ్చిన ఇంటర్నెట్ ప్రోటోకాల్(ఐపీ) అడ్రస్ ఆధారాలతో గుర్తించాం. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబ్, వెబ్సైట్లలో పోస్టులు పెట్టిన 18 మందికి సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాం. అందరినీ విచారించాం. చాలా వీడియోలు, పోస్టులకు ఇతడు అసభ్యకర కామెంట్లు పెట్టినట్లు గుర్తించాం’’ అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులు తెలిపారు. మంచిర్యాల, అదిలాబాద్‌లో.. వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్లు చేసిన ఇద్దరిని మంచిర్యాల, అదిలాబాద్‌లో సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన మూడు వెబ్సైట్లలోని పోస్ట్‌ల ఆధారంగా వీరంతా అసభ్యకర కామెంట్లు పెట్టారని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.