వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో మరో వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అడ్డురి నవీన్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా రామనగర్‌కు చెందిన నవీన్ సామాజిక మాధ్యమాలలో వైఎస్ షర్మిలను అప్రదిష్ట పాలుచేసేందుకు కుట్ర చేసిన కారణంగా అతనిపై సెక్షన్ 509 ఐపీఎస్, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు నిందితుడిని హైదరాబాద్ తరలించారు.