Siddharth-Saina Nehwal Controversy: Police Case Filed Against Siddharth in Hyderabad - Sakshi
Sakshi News home page

Siddharth: హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు..

Published Wed, Jan 12 2022 7:03 PM | Last Updated on Wed, Jan 12 2022 9:08 PM

Siddharth Tweet Controversy: Police Case Filed Against Siddharth - Sakshi

భారత్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్‌ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్‌పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్‌ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 67 సైబర్‌ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్‌ రాసిన బహిరంగ లేఖలో 'డియర్‌ సైనా.. నా ట్వీట్‌ ద్వారా చేసిన రూడ్‌ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్‌ నాకు ఎప్పుడూ ఛాంపియన్‌గా ఉంటావు సైనా' అని రాసుకొచ్చాడు. 

ఇదీ చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు, దూమరం రేపుతోన్న సిద్ధార్థ్‌ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement