ఈమధ్య కాలంలో చిత్ర పరిశ్రలో పాన్ ఇండియా అన్న పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పాన్ ఇండియా పదంతో అటు నార్త్ వర్సెస్ సౌత్ హీరోలకు మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై హీరో సిద్దార్థ్ స్పందించాడు.
పాన్ ఇండియా అన్నది అగౌరవకరమైనది, అదో నాన్సెన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు? 15ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. రీసెంట్‌గా నా స్నేహితులు కేజీఎఫ్ సినిమా తీశారు. వాళ్లను చూసి గర్వపడుతున్నాను.
సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందుకే పాన్ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలి. లేదా ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలవాలి. ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా,ఏ భాషలో అయినా హిట్ అవుతుంది.దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు' అంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment