Hero Siddharth With Aditi Rao Hydari Spotted At Mumbai Hotel, Pics Viral - Sakshi
Sakshi News home page

Siddharth-Aditi Rao : హాట్‌టాపిక్‌గా మారిన సిద్ధార్థ్- అదితి ప్రేమాయణం.. ఫోటోలు వైరల్‌

Published Thu, Dec 1 2022 3:09 PM | Last Updated on Thu, Dec 1 2022 3:36 PM

Hero Siddharth With Aditi Rao Hydari Spotted At Mumbai Hotel Pics Viral - Sakshi

హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్‌ కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్‌లో సిద్ధార్థ్‌- అదితిలు జంటగా కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే  తమ డేటింగ్‌ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు.

 కాగా ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా  సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి.

సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ పెళ్లి చేసుకోగా, 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే అతడితో విడిపోయింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement