
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు.
ఈ వీడియోను అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్‌షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment