Aditi Rao Hydari Respond On Dating Rumours With Siddharth, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: సిద్దార్థ్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్‌? స్పందించిన అదితి!

Published Sat, Mar 4 2023 7:10 PM | Last Updated on Sat, Mar 4 2023 7:27 PM

Aditi Rao Hydari Respond on Dating Rumours with Siddharth - Sakshi

ప్రేమలో పడటం సహజమే.. కానీ ఆ ప్రేమ విషయాన్ని కొందరు మాత్రమే నిర్మొహమాటంగా చెప్తారు. సినీ ఇండస్ట్రీలో అయితే అతికొద్ది మంది మాత్రమే అవునని ఒప్పుకుంటారు, లేదంటే లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ హీరోహీరోయిన్లు సెట్స్‌లో కాకుండా బయట కలిసి కనిపించినా, షికార్లు కొడుతూ కెమెరాలకు చిక్కినా వారిని మాత్రం లవ్‌ బర్డ్స్‌గానే వర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు మాత్రం అది ప్రేమ అనో, స్నేహమనో క్లారిటీ ఇవ్వరు. దీంతో ఇది కచ్చితంగా లవ్వేనని అంతా ఫిక్సైపోతారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి రూమర్స్‌ హీరో సిద్దార్థ్‌, హీరోయిన్‌ అదితిరావుల మధ్య ఎక్కువయ్యాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ పాటకు చిందేసిన డ్యాన్స్‌ సైతం తెగ వైరల్‌ అయింది. తాజాగా తన గురించి వస్తున్న ప్రేమ పుకార్లపై స్పందించిందీ హీరోయిన్‌. 'నేను ఎవరితో ఏ రిలేషన్‌లో ఉన్నాను అనేదానిపై కాకుండా నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. మంచి డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నాను. కెరీర్‌పైనే దృష్టి సారించాను. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నటిస్తూనే ఉంటా. దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండి' అని పేర్కొంది అదితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement