మరోసారి జంటగా లవ్‌ బర్డ్స్‌.. వీడియో వైరల్! | Aditi Rao Hydari Pose With Boyfriend Siddharth Once Again Goes Viral | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari and Siddharth: 'ఆదితి జీ ఏక్ కపుల్‌ ఫోటో దే'.. నెట్టింట వీడియో వైరల్!

Published Sun, Jan 28 2024 3:19 PM | Last Updated on Sun, Jan 28 2024 3:53 PM

Aditi Rao Hydari Pose With Boyfriend Siddharth Once Again Goes Viral - Sakshi

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. 

తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్‌ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్‌ కపుల్‌ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్‌ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. 

సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement