Aditi Rao Hydari Shocking Comments on Dating With Siddharth - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: మీకు మంచి కంటెంట్‌ అందించడమే మాకు ముఖ్యం: అదితి షాకింగ్‌ కామెంట్స్‌

Published Thu, Mar 23 2023 3:32 PM | Last Updated on Thu, Mar 23 2023 4:09 PM

Aditi Rao Hydari Shocking Comments on Dating With Siddharth in Latest Interview - Sakshi

హీరో సిద్దార్థ్‌తో డేటింగ్‌ వార్తలపై హీరోయిన్‌ అదితి రావు హైదరి మరోసారి స్పందించింది. గతంలో డేటింగ్‌ రూమర్స్‌ను ఖండించిన అదితికి తాజాగా ఇంటర్య్వూలో  అదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన తాజ్‌ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్‌ నేపథ్యంలో ఆమె ఓ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలేషన్‌షిప్‌పై స్పందించాలని యాంకర్‌ ఆమెను కోరగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను అంది.

చదవండి: ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్‌పై హీరోయిన్‌ ఆగ్రహం 

తన రిలేషన్‌ స్టేటస్‌పై మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్‌పై చూడటమంటనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్‌ను అందించగలం. అదే మాకు ముఖ్యం’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అనంతరం సిద్దార్థ్‌తో రిలేషన్‌పై మాట్లాడుతూ అసహనం చూపించింది.

చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు..

‘ఈ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా నేనేమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని వాఖ్యానించింది. దీంతో యాంకర్‌ ఇది ఆడియన్స్‌ ప్రశ్న అనగానే వారెప్పుడు తనని ఇలాంటి ప్రశ్న అడగలేదని, మీరు అడుగుతున్నారంటూ నవ్వుతూ చెప్పింది. కాగా అదితి-సిద్ధార్థ్‌లు మాత్రం తమపై వచ్చే రూమర్స్‌ పట్టించుకోకుండా కలిసి పార్టీలు, విందులకు హాజరవుతున్నారు. అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, రీల్స్‌ను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement