హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు.
చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్
రీసెంట్‌గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్‌కు షాకిచ్చింది. సిద్ధార్థ్‌కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ఎయిర్‌పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ ఫొటోని అదితి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్‌పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్‌పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్‌కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment