NCW Writes to DGP Maharashtra to Take Action Against Actor Siddharth: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్‌ను డిమాండ్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండించింది.
చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ప్రధానిపైనే దాడి యత్నం జరిగితే ఆ దేశం భద్రంగా ఉన్నట్టు ఎలా భావించగలం’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి. సిద్ధార్థ్ ట్వీట్ సైనాను అవమానించే రీతిలో ఉందంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సిద్ధార్థ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని పేర్కొంది. నటుడు సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కమిషన్ వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల సిద్ధార్థ్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది.
చదవండి: ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్‌పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
చైర్మన్ రేఖా శర్మ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి కూడా లేఖ రాసినట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ను నిలిపివేయాలని, అంతేగాక అతడి ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సింది ఆమె కోరినట్టు కమిషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలను వేరే అర్థంలో తీసుకుని తప్పుగా భావిస్తున్నారంటూ సిద్ధార్థ్ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చాడు. 'కాక్ అండ్ బుల్' అని కూడా పేర్కొంటుంటామని, అయితే దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం అని తెలిపాడు. ఎవరినీ అవమానపర్చాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు.
Subtle cock champion of the world... Thank God we have protectors of India. 🙏🏽
— Siddharth (@Actor_Siddharth) January 6, 2022
Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz
Comments
Please login to add a commentAdd a comment