Saina Nehwal Husband Parupalli Kashyap Strong Reply to Hero Siddharth - Sakshi
Sakshi News home page

Siddharth-Saina Nehwal: సైనాపై సిద్ధార్థ్‌ అభ్యంతరక వ్యాఖ్యలు, హీరోకు భర్త కశ్యప్‌ చురకలు

Published Tue, Jan 11 2022 7:32 PM | Last Updated on Tue, Jan 11 2022 7:59 PM

Saina Nehwal Husband Parupalli Kashyap Strong Reply To Hero Siddharth - Sakshi

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనాను ఉద్దేశిస్తూ సిద్దార్థ్‌ చేసిన ట్వీట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా సిద్ధార్థ్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డగించడాన్ని  సైనా నెహ్వాల్ ఖండిస్తూ ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ఈ ఘటనను తాను ఖండిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.

చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్‌, మహిళా కమిషన్‌ ఎంట్రీ

ఆమె ట్వీట్‌పై సిద్ధార్థ్‌ స్పందిస్తూ.. ‘సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #Rihanna’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్‌ రచ్చకు దారి తీసింది. ఇప్పటికే సిద్ధార్థ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, వెంటనే అతడి ట్వీట్‌ తొలిగించాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. సైనా తండ్రి కూడా సిద్ధార్థ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. తాజాగా సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సోమవారం ట్విట్టర్‌లో సిద్ధార్థ్‌ ట్వీట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

చదవండి: Salmana Khan-Samantha Lockwood: సల్మాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌పై నటి సమంత క్లారిటీ

సిద్ధార్థ్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ కాస్తా మంచి పదాలు ఎంచుకోండి. ఈ రితీలో మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా హర్టింగ్‌గా అనిపించింది. మీరు ఇవి కూల్‌ వర్డ్స్‌ అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు’ అంటూ సిద్ధార్థ్‌కు కశ్యప్‌ చురకలు అంటించాడు. అలాగే సైనా నెహ్వాల్ కూడా సిద్ధార్థ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా ఇంటర్య్వూలో స్పందిస్తూ..  ‘అతడు ఏం చెప్పాడో ఖచ్చితంగా నాకు తెలియదు. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరుస్తాడని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement