సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబ్ చానల్ ‘వాక్‌డ్ అవుట్ అండ్ మ్యాంగో’ గ్రూప్ ఎండీ వీరపనేని రామకృష్ణను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు.
టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్, టాలీవుడ్ నగర్, చాలెంజ్ మంత్ర వెబ్‌సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో ఉన్న ఎన్‌బీకే బిల్డింగ్‌లో ఉంది. ఎన్‌బీకే భవనం నందమూరి బాలకృష్ణకు చెందినది. వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment