key accused
-
అనంతపురం ఎబిడ్ సంస్థ చీటింగ్ కేసులో పురోగతి
-
ఈబిడ్ చీటింగ్ కేసులో పురోగతి: కీలక నిందితుడు అరెస్ట్
అనంతపురం క్రైం: ‘ఈబిడ్’ కేసులో కీలక నిందితుడు సునీల్ చౌదరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అతన్ని అనంతపురం కోర్టులో హాజరుపర్చనున్నారు. రూ.లక్షకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేశారు. వారి చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. బాధితులు ఈ ఏడాది ఏప్రిల్లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్ నాయుడు, అనుచరులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కాంలో పాలు పంచుకున్నట్లు తేల్చారు. కాగా.. సునీల్చౌదరి ఐదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. చివరకు సీఐడీ పోలీసులు అతన్ని నాగపూర్లో అరెస్టు చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం విదితమే. ఇవీ చదవండి: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ.. -
వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం; సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబ్ చానల్ ‘వాక్డ్ అవుట్ అండ్ మ్యాంగో’ గ్రూప్ ఎండీ వీరపనేని రామకృష్ణను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్, టాలీవుడ్ నగర్, చాలెంజ్ మంత్ర వెబ్సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో ఉన్న ఎన్బీకే బిల్డింగ్లో ఉంది. ఎన్బీకే భవనం నందమూరి బాలకృష్ణకు చెందినది. వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం. -
వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకే..
-
క్రికెట్ బుకీ హత్య కేసులో కీలక నిందితుడి అరెస్టు
అమలాపురం(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన ఆక్వా రైతు, క్రికెట్ బుకీ కుచ్చర్లపాటి వెంకట సత్యనారాయణరాజు(సత్తిబాబు రాజు) కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాగిరాజు అప్పల త్రినాథవర్మ(రఘు) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇతడు మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు. వివరాలివీ...అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన సత్యనారాయణ రాజు 2012 ఆగస్టు 23వ తేదీన కిడ్నాపై కొద్దిరోజుల తర్వాత నల్లమల అడవుల్లో హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక నిందితుడైన ఐ.పోలవరానికి చెందిన అప్పల త్రినాథవర్మ మాత్రం పరారీలో ఉన్నాడు. క్రికెట్ బుకీగా వ్యవహరించిన త్రినాథవర్మకు అప్పట్లో హైదరాబాద్లో ఉండే సత్యనారాయణరాజుతో సత్సంబంధాలు ఉండేవి. అయితే, క్రికెట్ బుకీగా తీవ్రంగా నష్టపోయిన సత్యనారాయణ రాజుతో త్రినాథవర్మకు విభేదాలు తలెత్తాయి. అనంతరం సత్యనారాయణ రాజు తన మకాంను హైదరాబాద్ నుంచి అమలాపురానికి మార్చి, ఆక్వా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే త్రినాథవర్మ మాత్రం ఆయనతో విభేదాలను మనసులో ఉంచుకుని తన మనుషుల సాయంతో అతడిని కిడ్నాప్ చేశాడు. కారులో తొలుత నల్లగొండ జిల్లా సూర్యాపేటకు, అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలోనే అతని ఏటీఎం కార్డు నుంచి రూ.5 లక్షలకు పైగా డ్రా చేశారు. కారులోనే సత్యనారాయణరాజుకు మత్తుమందు ఇచ్చి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం నల్లమలలో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న ఐదుగురిని అరెస్టు చేసిన అమలాపురం పోలీసులు...త్రినాథవర్మ కోసం గాలిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక కేసు విషయమై ఇటీవల హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అమలాపురం పోలీసులు పీటీ వారెంట్ను సమర్పించి వర్మను సోమవారం తమ కస్టడీలోకి తీసుకుని, అతని నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సత్యనారాయణరాజు కిడ్నాప్, హత్య కేసు చిక్కుముడి వీడినట్లయింది.