అనంతపురం క్రైం: ‘ఈబిడ్’ కేసులో కీలక నిందితుడు సునీల్ చౌదరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అతన్ని అనంతపురం కోర్టులో హాజరుపర్చనున్నారు. రూ.లక్షకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేశారు. వారి చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్ నాయుడు, అనుచరులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కాంలో పాలు పంచుకున్నట్లు తేల్చారు. కాగా.. సునీల్‌చౌదరి ఐదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. చివరకు సీఐడీ పోలీసులు అతన్ని నాగపూర్‌లో అరెస్టు చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం విదితమే.
ఇవీ చదవండి:
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ..
Comments
Please login to add a commentAdd a comment