సాక్షి, హైదరాబాద్ : లోన్ పేరుతో ఆర్మీ జవాన్కు సైబర్ కేటుగాళ్ళు టోపీ పెట్టారు. రుణం ఇస్తామంటూ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మోసగాళ్లు ఫోన్ చేసి డబ్బులు దోచుకున్నారు. నేరగాళ్ల మాయమాటులు నమ్మిన ఆశ్విన్ అనే ఆర్మీ జవాన్.. లోన్ ఓకే ప్రాసెసింగ్ ఛార్జి, డాక్యుమెంట్ ఛార్జ్ , జీఎస్టీ పలు పేర్లతో 4.31 లక్షల రూపాయల నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లో జమ చేశాడు. లోన్ ఎప్పటి వరకు వస్తుందని పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. మోసపోయానని తెలుసుకున్న జవాన్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment