RGV Counter To KA Paul Over Comments On RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్.. దేశవ్యాప్తంగా ఈ మూవీ హావానే నడుస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. బి-టౌన్ రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మొత్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. సాధారణ ప్రేక్షకులు నుంచి సినీ ప్రముఖుల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మూవీ డైరెక్టర్ జక్కన్న, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను అయితే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఆర్‌ఆర్ఆర్‌ను తనదైన శైలిలో ప్రశంసించాడు. అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
చదవండి: సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
దీనికి ఆర్జీవీ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల లైవ్‌లోకి వచ్చిన కేఏ పాల్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి ప్రస్తావించాడు. ‘అసలు నాకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తెలియదు, రాజమౌళి ఎవరూ.. అసలు ఆ హీరోలు ఎవరూ.. ఈ సినిమా చూడకండి.. టైం వేస్ట్. దేశానికి ఉపయోగపడే పనులు చేయండి’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమకు తోచిన థంబ్ నేల్స్‌తో షేర్ చేశాయి. అందులో యూట్యూబ్ థంబ్ నేల్ స్క్రీన్ షాట్ షేర్ చేశాడు వర్మ. దీనికి ‘నీ మొహం రా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
చదవండి: కేజీఎఫ్ 2 ట్రైలర్: ‘వైలెన్స్.. వైలెన్స్..’ ఈ డైలాగ్ రాసింది ఆ స్టార్ హీరోనే
ఇక వర్మ ఈ రీతిలో కేఏ పాల్‌పై కామెంట్స్ చేయడంతో ఆయన పోస్ట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వర్మకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రతిష్టాత్మక సినిమా, దర్శక ధీరుడు రాజమౌళిపై కేఏ పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ప్రశంసిస్తూ ఆర్జీవీ ఇటీవల ఆసక్తికర ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలితో ఆర్‌ఆర్‌ఆర్‌ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్‌ఆర్‌ఆర్ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అలాగే దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి... బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థంలో ఆర్జీవీ కామెంట్ చేశాడు.
Nee Moham raa ! pic.twitter.com/KGrAzqwuXG
— Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2022
Comments
Please login to add a commentAdd a comment