
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయలేం. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా సంపూర్ణంగా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. నటించడంలో, అభిమానుల మనసులు గెలుచుకోవడంలో ఇద్దరూ పోటీపడి చివరకు గెలిచారు. ఇక ఈ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రేసులో దిగిన విషయం తెలిసిందే! ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో రామ్‌చరణ్ 'టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో' అనే పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాల గురించి చర్చించారు.
పనిలో పనిగా తాను పాటించే అయ్యప్ప మాల విశిష్టత, విధివిధానాలను సైతం వివరించాడు చరణ్. అయితే ఇక్కడ యాంకర్ ఆర్‌ఆర్‌ఆర్ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అన్నాడంటూ ఓ క్లిప్ వైరలవుతోంది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అనడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి హోస్ట్ తారక్‌ను సైడ్ యాక్టర్ అని అనలేదు. ఎలాంగ్‌సైడ్ యాక్టర్(నీతోపాటు కలిసి నటించిన నటుడు) అని పేర్కొన్నాడు. కావాలని కొందరు నెటిజన్లు సగం క్లిప్‌ను కట్ చేసి వైరల్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే పూర్తి పాడ్‌క్యాస్ట్ విన్న జనాలు ఎందుకిలా పనిగట్టుకుని ఫ్యాన్స్ వార్ సృష్టిస్తారు? అని మండిపడుతున్నారు.
Along side, actor @tarak9999 ante eellu side actor ani cut chesaru… 🙏 @AlwaysRamCharan Em Editing Batch Ra cheddys 💦 pic.twitter.com/9Ji4hiJsL2
— TOLLYWOOD THALIVA (@VishnuReddyNTR) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment