ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా? | Ram Gopal Varma New Movie Kamma Rajyamlo Kadapa Reddlu First Look | Sakshi
Sakshi News home page

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

Published Sat, Sep 7 2019 10:10 AM | Last Updated on Sat, Sep 7 2019 12:13 PM

Ram Gopal Varma New Movie Kamma Rajyamlo Kadapa Reddlu First Look - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో ఘనవిజయం సాధించిన వర్మ మరోసారి రాజకీయ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రమోషన్‌ సమయంలోనే తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ప్రకటించిన వర్మ సైలెంట్‌గా షూటింగ్‌ పనులు కూడా కానిచ్చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోతో పాటు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఈ కొత్త నటుడు ఏ నిజ జీవిత పాత్రలో కనిపిస్తున్నాడో చెప్పగలా?’ అంటూ కామెంట్ చేశాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగో ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను టైగర్‌, ప్రొడక్షన్‌ కంపెనీ, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement