రామ్‌గోపాల్ వర్మ
రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రానున్న తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్‌వర్మతో కలిసి సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. రివైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఏ వర్గాన్నీ టార్గెట్ చేసిన చిత్రం కాదు ఇది. ఫ్యాక్షనిజమ్, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చిత్రబృందం వెల్లడించింది. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రానికి సహనిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment