‘పప్పులాంటి అబ్బాయి..’ పాట ట్రెండింగ్‌! | Ram Gopal Varma comments on Kamma Rajyam Lo Kadapa Reddlu | Sakshi
Sakshi News home page

ఎవరినీ టార్గెట్‌ చేయలేదు

Published Sun, Nov 24 2019 12:26 AM | Last Updated on Sun, Nov 24 2019 8:05 AM

Ram Gopal Varma comments on Kamma Rajyam Lo Kadapa Reddlu - Sakshi

రాంగోపాల్‌ వర్మ

ఇటీవల కాలంలో ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా నిలిచిన చిత్రాల్లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఒకటి. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సిద్దార్థ తాతోలు దర్శకత్వంలో రాంగోపాల్‌ వర్మ అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘800 థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

‘పప్పు లాంటి అబ్బాయి..’ పాట మంచి ఆదరణతో ట్రెండింగ్‌ అయ్యింది. మొత్తం ఏడు పాటల్లో ఏ పాటకు ఆ పాట హైలైట్‌గా ఉంటుంది. ఏ వర్గాలను టార్గెట్‌ చేసి ఈ చిత్రం తీయలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యాలలో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమైన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్‌ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement