
మధురానగర్(విజయవాడ సెంట్రల్) : నగరంలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో శనివారం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర నటీనటులు సందడి చేశారు. నటీనటులతో అభిమానులు సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా సీఎం జగన్మహన్‌రెడ్డి పాత్రధారుడు అజ్మల్, పవన్ కల్యాణ్ పాత్రధారుడు చైతులతో కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు యువత ఆసఇ్త కనబర్చారు. చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రమని, ఇందులో రాజకీయం లేదని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను మాత్రమే ఇందులో చూపించడం జరిగిందన్నారు. ఈ చిత్రం చూసిన వారికి మంచి వినోదం లభిస్తుందన్నారు. వీకెండ్‌లో ప్రతీ ఒక్కరూ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన చిత్రం అన్నారు. ప్రమోషన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాత్రధారుడు ధనుంజయ, డైరెక్టర్ సిద్ధార్ధ, కె ఎ పాల్, రోజా పాత్రలు పోషించిన నటీనటులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment