Pest control
-
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
కాఫీ పొడితో ఇలా చేస్తే దోమలు పరార్..!
దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అసలే ఇది వర్షాకాలం. ఈ సీజన్లో మురికిగా ఉన్న ప్రదేశాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమల కాటుS వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. దోమల బెడద నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల మందులు, రసాయనాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతే కాకుండా ఈ రసాయనాలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందువల్ల కొన్ని చిట్కాల ద్వారా దోమలను తరిమి కొట్టేయవచ్చు సులువుగా... ఇంట్లోని దోమలను తరిమికొట్టడంలో కాఫీ పొడి చాలా సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో నిప్పులు తీసుకుని.. అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌ను కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. దాంతో ఇంట్లో దోమలు ఎక్కడున్నా బయటకు పారిపోతాయి. ఎందుకంటే, కాఫీ పొడి వాసన దోమలకు పడదు. ఒక్క దోమలనేæకాదు... ఇంకా ఏవైనా కీటకాలు ఉన్నా కూడా ఈ వాసనకు పరార్ అవుతాయి. నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్లు సాయంత్రం వేళల్లోనూ, తలంటి పోసుకున్న తర్వాత కురులను ఆరబెట్టుకోవడం కోసమూ సాంబ్రాణి ధూపం వేయడం మనకు తెలిసిందే. నిప్పుల మీద వెల్లుల్లి పొట్టు వేసినా... ఎండబెట్టిన వేపాకులు వేసినా కూడా ఆ వాసనకు దోమలతోపాటు ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. తులసి మొక్క.. ప్రతి భారతీయుని ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది దోమల లార్వా, ఇతర కీటకాలను చంపడానికి చాలా సహాయపడుతుంది. తులసి వాసన కీటకాలు, దోమలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. గుల్ మెహందీ మొక్క.. గుల్ మెహందీని మనం రోజ్మేరీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి కాబట్టి దోమలను, కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పుదీనా.. వేసవిలో ఇంట్లో తయారు చేసే దాదాపు ప్రతి వస్తువులో పుదీనాను వాడతారు. పుదీనాలోంచి వచ్చే వాసన కీటకాలను, దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది కాబట్టి ఇంటి పెరటిలో లేదా కనీసం కుండీలలో అయినా పుదీనాను పెంచుకోవడం మంచిది. వాటినుంచి వచ్చే వాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. బంతి మొక్క.. బంతి పువ్వును ప్రతి శుభకార్యంలో అలంకరణకు వాడతారు. దీనిని ఇంగ్లీష్‌లో మేరిగోల్డ్ అంటారు. దీనిని వివిధ దేశాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను దూరం చేస్తుంది. నిమ్మ గడ్డి మొక్క.. నిమ్మ గడ్డి మొక్క గురించి చాలా మందికి తెలుసు. ఈ మొక్క ఘాటైన వాసనతో ఉంటుంది. దీనిని పెంచుకోవడం వల్ల ఇంటి నుంచి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. అసలు దోమలు చేరకుండా ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్త డబ్బాలో ఉన్న చెత్తను క్రమం తప్పకుండా పారేస్తుండాలి. తులసి, బంతి, లావెండర్.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవాలి. ఈ మొక్కలు ఉంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక వేప నూనె, కొబ్బరి నూనె కలిపి.. రోజూ సాయంత్రం శరీరానికి రాసుకోవాలి. దాంతో ఆయా నూనెల వాసనకు దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి. -
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
హోమియోతో చీడపీడలకు చెక్!
మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో ఔషధాలు తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఫలితం వరిలో అగ్గి, కాటుక తెగుళ్లకు.. ఉరకెత్తిన మెట్ట పంటల రక్షణకు హోమియో ఔషధాలు వివిధ పంటలపై గత కొన్నేళ్లుగా హోమియో ఔషధాలు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్న వైనం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచనలు మారిన వాతావరణ పరిస్థితిలో వరి పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కాటుక తెగులు, అగ్గి తెగులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ తెగుళ్లు తీవ్రంగా ఉన్నాయి. తెగుళ్లకు రసాయనిక మందులు పిచికారీ చేసే రైతు సోదరులు మరణించిన దృష్టాంతాలున్నాయి. చేతికొచ్చిన పంట చేజారుతుంటే పంట కాపాడుకోవటానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అయినా, ఫలితం లేక చివరాఖరికి పంటకు అగ్గిపెడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయ విధానం రైతులకు తోడునిలుస్తుంది. అగ్గి తెగులుకు మారేడు తులసి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు కనుమరుగైన పరిస్థితిలో మారేడాకులు శివరాత్రి నాడు శివయ్యకు పెట్టడానికి దొరకవు. ఇక కషాయాలు చేసుకోవడానికేడయితది. ఇగ రైతుకున్న మరో ప్రత్యామ్నాయం హోమియో ఔషధం. అగ్గి తెగులు నివారణకు రైతు సోదరులు ‘బెల్లడోనా 200’, దాని కొనసాగింపుగా ‘కల్కేరియా కార్బ్ 200’ పిచికారీ చేసుకుంటే పంటను నిక్షేపంగా కాపాడుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా అతి స్వల్పమే అవుతుంది. ఇక తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాటుక తెగులుకు ‘తూజా 200’ పిచికారీ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మిర్చి, కూరగాయ పంటలకు.. ఇటీవల కురిసిన వర్షాల ధాటికి రైతు బతుకు అతలాకుతలమైంది. మాగాణి పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. మెట్ట పంటలు, మిర్చి, కూరగాయ పంటలు నీట మునిగి తేలి నీరు చిచ్చు పట్టి (ఉరకెత్తి) వడలిపోతున్నాయి. నీరు చిచ్చుతో దెబ్బతిన్న పంట చేలను కాపాడుకోవచ్చు. ఈ మందులకు ఖర్చు కూడా అతి తక్కువ. రూ. వేలు ఖర్చు చేసినా సాధించలేని ఫలితాన్ని కేవలం రూ. వందల ఖర్చుతో పొందవచ్చు. వరద తాకిడికి గురై నీట మునిగి తేలిన పంటలకు మొదట ‘ఫెర్రమ్ మెటాలికం 30’ పిచికారీ చేయండి. రెండు రోజుల గడువుతో ‘కార్బోవెజ్ 30’ పిచికారీ చేయండి. పంట ఊపిరి పోసుకుంటుంది. కాస్త తేరుకున్న వెంటనే ‘మ్యాగ్ఫాస్ 30’ని పిచికారీ చేసుకుంటే పంట పూర్తిగా శక్తిని సంతరించుకుంటుంది. తదుపరి పంట పోషణకు అవసరమైన పోషకాలు మీ మీ పద్ధతిలో అందించండి. ఈ హోమియో ఔషధాలను ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఫలసాయం అందుకోగలుగుతారు. హోమియో ఔషధాలు వాడే విధానం ద్రవరూపంలో ఉండే హోమియో మదర్ టించర్లను పంటలకు ఉపయోగించాలి. 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల చొప్పున హోమియో ఔషధం కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి. ముందుగా లీటరు సీసాను తీసుకొని.. అందులో సగం వరకు నీటిని తీసుకొని, దానిలో 2.5 ఎం.ఎల్. హోమియో మందు కలుపుకోవాలి. సీసా మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ మందును పూర్తిగా శుభ్రం చేసుకున్న స్రేయర్లో పోసుకోవాలి. ఇప్పుడు స్ప్రేయర్లో దాని సామర్థ్యాన్ని బట్టి మిగతా నీరు నింపుకొని పిచికారీ చేసుకోవాలి. ఏ పంట మీదైనా ఏ హోమియో ఔషధాన్నయినా పిచికారీ చేసుకునేందుకు ఇదే పద్ధతిని అనుసరించాలి. – జిట్టా బాల్‌రెడ్డి (89782 21966), రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు వాడుతున్నా. రసాయనిక పురుగుమందులు వాడటం ఆపేసి.. వాటికి బదులు మూడేళ్లుగా హోమియో మందులను వాడుతున్నా. అగ్గితెగులుకు బెల్లడోనా30 పిచికారీ చేస్తే చాలు. మొగి పురుగు, ఆకుచుట్టు తెగులు, పోషకాల లోపంతో పండాకు సమస్యకు తూజా30 పిచికారీ చేస్తే సరిపోతుంది. కాండం కుళ్లు వస్తే బావిస్టా 30 చల్లితే చాలు. ఇటువంటి మూడు, నాలుగు మందులు ఉంటే చాలు.. వరి పంటను ఏ చీడపీడలూ దెబ్బతీయకుండా కాపాడుకొని మంచి దిగుబడి పొందవచ్చు అని జిట్టా బాల్‌రెడ్డి సూచన మేరకు అమలు పరచి నా అనుభవంలో గ్రహించా. వరికి ఇతర రైతులు వర్షాకాలంలో ఎకరానికి రూ.3,500–4,000 వరకు రసాయనిక పురుగుమందులకే ఖర్చు పెడుతున్నారు. రబీలో అయితే వీళ్లకు రూ. 2,500 నుంచి 3,000 వరకు కేవలం పురుగుమందుల ఖర్చు వస్తుంది. నాకైతే ఏ కాలంలో అయినా ఎకరానికి అవుతున్న హోమియో మందుల ఖర్చు రూ. 200 లోపే! వేపనూనె, ఇతరత్రా కషాయాలు చల్లాల్సిన అవసరమే లేదు. అయితే, రైతు పంటను గమనించుకుంటూ ఉండి.. పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్న తొలి దశలోనే గుర్తించి, పంట మొక్కలు నిలువెల్లా తడిచేలా జాగ్రత్తగా చల్లుకోవాలి. అంతే! హోమియో మందులంత మేలైన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. – గోడదాటి దశరథ్ (93980 49169), రత్నాపురం, సూర్యాపేట మండలం/జిల్లా పంటలకు పదేళ్లుగా హోమియో వాడుతున్నా! ఐదెకరాల్లో వరి (మొలగొలుకులు 3 రకాలు, నెల్లూరు 40054 రకాలు) సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులు వాడకుండా పదేళ్లుగా వరి సాగు చేస్తున్నా. పచ్చిరొట్టను కలియదున్ని దమ్ము చేయటం, పుంగనూరు ఆవుల పేడ ఎరువు వేస్తుంటా. చీడపీడలకు హోమియో మందులు వాడుతున్నా. 22–23 బస్తాల దిగుబడి వస్తుంటుంది. తొలుత విజయవాడ వన్‌టౌన్‌లోని రామకృష్ణ హోమియో స్టోర్‌లో డా. వెలివల రాజేంద్రప్రసాద్ సూచన మేరకు పంటలకు, పశువులకూ హోమియో మందులు వాడటం ప్రారంభించాను. వ్యవసాయంలో హోమియోకు డా. వైకుంఠనాథ్ రచించిన పుస్తకం ప్రామాణికం. దీని ఆధారంగా జిట్టా బాల్‌రెడ్డి సూచనల ప్రకారం హోమియో మందుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిచికారీలను పూర్తి చేసుకుంటున్నాం. రూ. 30ల ఖర్చుతో ‘తూజా’ మందు చల్లి మొలగొలుకుల్లో కాండం తొలిచే పురుగును అరికట్టా. పంట ఎర్రబడినప్పుడు మెగ్నీషియా ఫాస్ వాడుతున్నా. దోమ మా పొలంలో ఎప్పుడూ కనపడలేదు. సరైన కంపెనీ మందును, సరైన సమయం (ఉ.8 గం. లోపు లేదా సా. 4 గం. తర్వాత)లో, సరైన మోతాదులో, సరిగ్గా పంట మొక్కలు పూర్తిగా తడిచేలా హోమియో మందులును చల్లుకోవటం అవసరం. మా పొలంలో కలుపు కూడా తియ్యం. ఎలుకల సమస్య తప్ప మరే సమస్యా లేదు. జీవామృతం పిచికారీకి పిలిస్తే వాసన అని కూలీలు రాని పరిస్థితులున్నాయి. హోమియో మందులు వాసన రావు. కాబట్టి ఆ బాధ కూడా లేదు. వీటి అవశేషాలు కూడా పంట దిగుబడుల్లో ఉండవు. ఖర్చు కూడా బాగా తక్కువ. – పంచకర్ల విష్ణువర్థనరావు (94405 02130), అరిసేపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా -
పేనును నలిపేస్తే చాలు!
వంగ మొక్కలకు పేను సమస్య ఉంటుంది. పేను సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. అంటే, లేతాకులను మినహా మిగతా అన్ని ముదురు ఆకులను తెంపి దూరంలో పారెయ్యాలి. మిగిలిన ఆకులకు ఉన్న పేనును చేతి వేళ్లతో సున్నితంగా నలపాలి. వరుసగా రెండు, మూడు రోజులు అలాగే చెయ్యాలి. పేను లేకుండా అవుతుంది. దీనికి ఏ మందులూ స్ప్రే చెయ్యనవసరం లేదు. మిద్దె తోటల్లో చీడపీడల నివారణలో చేతులను మించిన సాధనాలు లేవు. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు -
ఇక్కట్లు లేని ఇంటిపంటలకు దారిది..!
చీడపీడల నియంత్రణ పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉన్న స్థలంలో సేంద్రియ పంటలను పెంచుకునే మిత్రులు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యమైన విషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం. మొక్కలను చీడపట్టిన, తరువాత తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి. దీనికి ‘జనరల్ పర్పస్ స్ప్రే’ బాగా ఉపయోగపడుతుంది. జనరల్ పర్పస్ స్ప్రే’ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, మిరపకాయ 1 (చెంచాడు కారంపొడి), వెల్లుల్లి గడ్డ 1ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది. సబ్బు నీరు సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. వెల్లుల్లి రసం గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనె మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లి లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి. వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి. వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపు ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది. పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది. పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ విధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది. కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి. దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి. ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, రెండు చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగుల మీద బాగా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పండు ఈగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండు ఈగ హాని తొలగిపోతుంది. -
గట్లపై విత్తు.. ‘శత్రు’ చిత్తు
చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చు. రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయి. ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వరికి తీవ్ర నష్టం కలిగించే అగ్గితెగులు, పొడతెగులు, ఆకుముడత ఎండు తెగుళ్లకు కారణమైన సిద్ద బీజాలు (వ్యాధి కారకాలు) ఒక చోట నుంచి మరోచోటకు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా కంది నిరోధిస్తుంది. చేలగట్ల వెంట కంది నాటడం వల్ల ప్రధాన పంటకు అవసరమైన నీరు, ఎరువుల విషయంలో ఎటువంటి నష్టం ఉండదు. గాలి వానలకు ప్రధాన పంటను కాపాడే కవచంలా కంది మొక్కలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పొలం గట్లపై మొలిచే గడ్ది ద్వారా పంటకు నష్టం కల్గించే కీటకాల నివారణకు కూడా కింది మొక్కలు పనికొస్తాయి. దీంతో పాటు గట్లను పటిష్టంగా ఉంచి ఎలుకలు కన్నాలు పెట్టకుండా వీటి వే రు వ్యవస్థ నివారిస్తుంది. కంది పంట పక్షి స్థావరాలకు ఆవాసంగా ఉండటం వల్ల పంటను పాడు చేసే క్రిములను పక్షులు తినేస్తాయి. దీని వల్ల పంటకు రక్షణ కలుగుతుంది. ఎకరం వరి చేలోని గట్లపై విత్తడానికి 100గ్రాముల కంది విత్తనం సరిపోతుంది. దీనిపై సుమారు 10 నుంచి 15కేజీల వరకు కంది దిగుబడి వస్తుంది. ఇది రైతు కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అమ్ముకుంటే మార్కెట్ ధరను బట్టి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం భూచేతన పథకంలో భాగంగా ఎంపికి చేసిన గ్రామాల్లో ఎకరానికి 100 గ్రాముల చొప్పున కంది విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. 40 శాతం యూరియా ఆదా.. వరి చేలగట్ల వెంబడి కందిని సాగు చేయడం వల్ల 32నుంచి 40శాతం వరకు నత్రజని ఎరువును ఆదాచేయవచ్చు. కందిని ఏక పంటగా వేయడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. భూమిలో కంది వేరు బుడిపెలపై ‘రైజోబియం’అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టిరియా గాలి నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందిస్తుంది. దీనివల్ల భూమిలో న త్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా భూ భౌతిక రసాయన స్థితిగతులు మెరుగుపడతాయి. తద్వారా నత్రజని (యూరియా) వినియోగం తగ్గించుకోవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే 88866 13853 సంప్రదించవచ్చు. అంతర పంటతోనూ లాభాలు.. కందిని తోటలు, ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం పొందవ చ్చు. 1:7 నిష్పత్తిలో కంది, వేరుశెనగ, పెసర, మినుము, సోయా, సాగు చేయవచ్చు.1:2 నిష్పత్తిలో కంది మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేయవచ్చు. ఈ విధంగా అంతరపంటగా కంది వేస్తే భూసారం పెరుగుతుంది.