horrifying
-
ఎంత ఘోరం: పొగమంచు ఎఫెక్ట్.. రోడ్డుపై చెల్లాచెదురుగా శరీర భాగాలు
లక్నో: దేశంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. పలు విమానాలు రద్దు అవుతున్నాయి. పొగమంచుతో ముందుగా వెళ్తున్న వ్యక్తులు, వాహనాలు, దారులు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘోర ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించలేని వాహనాదారులు.. వేగంగా వెళ్లడంతో అతడి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం జాతీయ రహదారి 9పై కార్మికులు శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరభాగాలు కనిపించాయి. దీంతో కార్మికులు షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అయితే మరణించింది అబ్బాయా? అమ్మాయా అని గుర్తుపట్టలేనంతగా మృదేహాం తయారైంది. శరీర భాగాలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. కొన్ని విడిపోయిన శరీర భాగాలు మాత్రమే పోలీసులకు లభించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత వరుసగా వాహనాలు అతడిపై నుంచి వెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమై ఉండవచ్చని అంచనా వేశారు. పొగమంచు వల్ల మొదట ఢీకొన్న వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు. చదవండి: Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని -
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
19 ఆడశిశువుల కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
సాంగ్లి: 19 ఆడశిశువులను అమానుషంగా అంతం చేసిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణంపై విచారణ చేపట్టిన పోలీసులు మరిన్ని భయకంరమైన, కఠిన వాస్తవాలను సేకరించారు. మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో చోటుచేసుకున్న ఆడశిశువుల అబార్షన్లపై వివరాలను పోలీసులు వివరించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఘటనల వివరాలను పరిశీలిస్తే...రెండు రాష్ట్రాల్లో ఎజెంట్లను నియమించుకుని మరీ ఈ దందాను సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానంరాకుండా మహారాష్ట్ర కేసులను, కర్ణాటకకు, కర్ణాటక కేసులను మహారాష్ట్రకు పంపిస్తారు. అంతేకాదు ఈ అబార్షన్లకోసం డా. బారతి ప్రయివేటు ఆసుపత్రిలో ఏకంగా భూగర్భంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్ కు బదులుగా ఒక తాత్కాలిక గుడిసెలో గర్భస్రావాలు నిర్వహిస్తారు. అంతేకాదు కొన్నిసార్లు , కాంపౌండర్లు లేదా నర్సులే ఈ పనిని పూర్తి చేస్తారట. అనంతరం ఆ పిండాలను పాతిపెట్టడం, లేదా టాయిలెట్ లో యాసిడ్ తో కలిసి ప్లష్ చేస్తారు లేదంటే కుక్కలకు ఆహారంగా వేస్తారు. కానీ మొన్నటి ఘటనలో ప్లాస్టిక్‌సంచుల్లో కుక్కి పాతిపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి గాను వారు రూ.25వేలు చార్జ్ చేస్తారు. గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అయితే అబార్షన్ చేస్తారు.. అబ్బాయి అయితే.. ఆ విషయం చెప్పినందుకు ఈ చార్జ్ వసూలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న అబార్షన్లపై పోలీసులు ఆరా తీయగా రాకెట్టు గుట్టురట్టయింది. ఈ కేసులో డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ సహా ఇప్పటికీ12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు. డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ , డాక్టర్ శ్రీహరి గోడ్కే, విజపూర్ నుంచి డాక్టర్ రమేష్ దేవిగర్ (ఎంబీబీఎస్). ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈకేసును పరిశోధిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ దీపాలి కాలే చెప్పారు. అయితే ఆసుపత్రిపై దాడులు నిర్వహించామనీ, తమకు అనుమానాస్పద సమాచారం దొరకలేదనీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హెల్త్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ అర్చనా పాటిల్ తెలిపారు. మరోవైపు గతంలో కూడా ఇదే డాక్టర్ పై కేసులు నమోదయ్యాయి. అపుడు వైద్య అధికారులు ఏమీ లేదని తేల్చిపారేశారు. అయితే ఈ సారి పోలీసుల దర్యాప్తులో మాత్రం అక్రమంగా వాడుతున్న మందులు, అక్రమ థియేటర్ తదితర విషయాలు తేలాయి. అసలు సదరు డాక్టర్‌కు ఆపరేషన్ నిర్వహించే అనుమతి కూడాలేదని పోలీసులు స్పష్టం చేశారు. క్రిమినల్ కోణం ఉంటేనే తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. స్వాతి మరణంపై తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అయితే ఆరోగ్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య అధికారులు కేవలం ఒకసారి రెయిడ్ చేసి ఏమీ దొరకలేదని చెపుతున్నారనీ, ఇందులో మరిన్ని కోణాలుదాగి వున్నాయనే అనుమానాలను దర్యాప్తు అధికారి వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని సాంగ్లి , బీడ్ జిల్లాలు రెండూ అత్యల్ప చైల్డ్ సెక్స్ రేషియో నమోదు చేశాయి. ముఖ్యంగా బీడ్ లో 1991 నుంచి లింగ నిష్పత్తి క్రమంగా పడిపోవడం గమనార్హం. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. -
భయానక క్షణం నుంచీ..
మూడేళ్ళ క్రితం ఆమె... మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇమ్మంటూ కోర్టుకు అర్జీ పెట్టుకుంది. సగం కాలిన గాయాలతో, చూపు, వినికిడి కోల్పోయి బతకడమే కష్టంగా ఉందంటూ కోర్టును వేడుకుంది. అయితే ఇప్పుడామె బతకాలనుకుంటోంది. తనవంటి బాధితులకు జీవితంపై ఆశ కల్పించి, అండగా నిలబడి న్యాయంకోసం పోరాడేందుకు సిద్ధమైంది. పదేళ్ళక్రితం ఝార్ఖండ్ కి చెందిన సోనాలీ ముఖర్జీ.. ముగ్గురు దుండగుల యాసిడ్ దాడినుంచీ కేవలం ప్రాణాలతో బయట పడింది. అది.. 2002 సంవత్సరం. అప్పుడామెకు పదిహేడేళ్ళ వయసు. అందరిలాగే కాలేజీ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. కానీ ఆమెపై కన్నేసిన దుండగులు ఎంత బతిమలాడినా ఆమెను వదల్లేదు. ఆఖరికి ఆమె తండ్రి కూడ వేడుకున్నాడు. తన కూతరి వెంట పడొద్దని. కొన్నాళ్ళు ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే ఆ ప్రశాంతత వెనుక తుఫాను లాంటి భయం ఉందని వారు గమనించలేదు. దుండగులు రహస్యంగా పన్నిన పన్నాగంలో సోనాలీ చిక్కుకుపోయింది. యాసిడ్ దాడిలో కాలిన ముఖంతోపాటు, కళ్ళు చాలా వరకు దెబ్బతిన్నాయి. వినికిడి శక్తి కొంతశాతం కోల్పోయింది. డాక్టర్లు కూడ ఇంతటి దారుణాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతగానో సహకరించారు. గత పదేళ్ళలో ఆమె ముఖాన్నికొంతవరకైనా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనీసం 28 సార్లు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహిచారు. భవిష్యత్తులో కూడ మరెన్నో చికిత్సలు చేయాల్సి ఉంది. అయినా ఆమె సగం కాలిన ముఖంతోనే జీవితం గడపాల్సి ఉంది. కానీ ఆమెపై దాడి చేసిన దుండగులు మాత్రం కేవలం రెండున్నరేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చేశారు. ప్రశాతంగా జీవితం గడుపుతున్నారు. 2012 లో సోనాలీ కోర్టును ఆశ్రయించింది. ఇండియాలో అమలులోలేని.. మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకుంది. ''నాకు న్యాయం జరగడం లేదు, నేనీ బాధ భరించలేను. సగం ముఖంతో మిగిలిన సగం జీవితాన్నిజీవించలేను. నాకు మిగిలిన మార్గం ఒక్కటే. నా ప్రాణం తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి'' అంటూ వేడుకుంది. అయితే 2013 లో జరిగిన ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇండియాలోనే అతిపెద్ద టీవీ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న ఆమెను చూసిన చిత్తరంజన్ తివారి ఫేస్ బుక్ ద్వారా పలకరించాడు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళికూడ చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వారి వివాహం జరిగింది. '' నాకు పెళ్ళవుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. పదేళ్ళుగా నన్ను నేను నిలబెట్టుకునేందుకు ఎంతో ప్రయాస పడ్డాను. కానీ పెళ్ళి జరుగుతుందని మాత్రం కలలో కూడ అనుకోలేదు'' అంటుంది సోనాలి. ఇప్పుడామె ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతోంది. తనవంటి బాధితులకు అండగా నిలబడి, న్యాయ పోరాటం చేసేందుకు కృషి చేస్తోంది. లండన్ కు చెందిన ఓ సేవా సంస్థ, యాసిడ్ సర్వైవర్స్ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం... సంవత్సరంలో సుమారు పదిహేను వందల యాసిడ్ అటాక్స్ జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి . అందులో 80 శాతం బాధితులు మహిళలే ఉంటున్నారు. చాలామంది విషయాన్ని బహిర్గతం చేసేందుకు భయపడతున్నారు. అయతే అటువంటి క్రిమినల్స్ కు తగిన శిక్ష పడటం లేదని, వారు ఎంతో హాయిగా తిరుగుతుంటే బాధితులు నరకం చూస్తున్నారని సోనాలి చెప్తోంది. బాధితులకోసం న్యాయ పోరాటానికి తాను సిద్ధమంటోంది.