లక్నో: దేశంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. పలు విమానాలు రద్దు అవుతున్నాయి. పొగమంచుతో ముందుగా వెళ్తున్న వ్యక్తులు, వాహనాలు, దారులు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.
తాజాగా అలాంటి ఘోర ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించలేని వాహనాదారులు.. వేగంగా వెళ్లడంతో అతడి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం జాతీయ రహదారి 9పై కార్మికులు శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరభాగాలు కనిపించాయి. దీంతో కార్మికులు షాక్‌కు గురయ్యారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అయితే మరణించింది అబ్బాయా? అమ్మాయా అని గుర్తుపట్టలేనంతగా మృదేహాం తయారైంది. శరీర భాగాలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. కొన్ని విడిపోయిన శరీర భాగాలు మాత్రమే పోలీసులకు లభించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత వరుసగా వాహనాలు అతడిపై నుంచి వెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమై ఉండవచ్చని అంచనా వేశారు. పొగమంచు వల్ల మొదట ఢీకొన్న వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు.
చదవండి: Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
Comments
Please login to add a commentAdd a comment