Woman Married Tree In 2019 Protest: Know Interesting Reasons Inside - Sakshi
Sakshi News home page

Woman Married Tree: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!

Published Tue, Dec 21 2021 5:25 PM | Last Updated on Tue, Dec 21 2021 6:04 PM

Woman Who Married A Tree Says They Are Still Strong - Sakshi

కొంతమంది పర్యావరణం కోసం ఎంతలా పాటుపడతారంటే తమ జీవితం మొత్తం ధారపోసేలా శ్రమిస్తారు. ఆహర్నిసలు మొక్కలు పెంచుతూ ఒక అడవినే తయారు చేసి అవార్డులు పొందిన మహామహుల్ని చూశాం. అంతేకాదు సుందర్‌లాల​ బహుగుణ చిప్‌కో ఉద్యమానికి యావత్తు దేశం ఆకర్షింపబడటమే కాక చాలామంది అదేబాటలో నడిచినవాళ్లు కూడా ఉన్నారు. అచ్చం అలానే మెక్సికన్‌ దేశంలోని మహిళా పర్యావరణ ప్రేమికులను ఆదర్శంగా తీసుకుని యూకేకి చెందిన ఒక మహిళ ఒక విన్నూతమైన పనికి శ్రీకారం చుట్టింది.

(చదవండి:  ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్‌ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!)

అసలు విషయంలోకెళ్లితే...యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ 2019లో చాలా ఏళ్ల నాటి పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన  ఇంటిపేరును ఎల్డర్‌గా మార్చుకుంది. పైగా వారానికి ఐదు సార్లు చెట్టును సందర్శిస్తానని కూడా చెబుతుంది. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులందర్నీ ఇంట్లో వదిలి బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట.

అయితే రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కేట్ ఆ పార్క్‌లోని ఆ మహా వృక్షాన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్‌ కోసం చట్టవిరుద్ధంగా చెట్టను నరకడాన్ని వ్యతిరేకించి చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శం అని కేట్‌ చెప్పింది. పైగా తాను పెళ్లి చేసుకోవాలనుకునే చెట్టుని వెతకడానికే ఆ పార్క్‌ని సందర్శించానని కూడా చెబుతోంది.

అంతేకాదు కేట్ ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్‌ని జరుపుకోనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కేట్ పండుగ కోసం చెట్టును పుష్పగుచ్ఛం, టిన్సెల్, బాబుల్స్‌తో కూడా అలంకరించింది. పైగా కేట్ తన క్రిస్మస్ కార్డులపై 'విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్' అని సంతకాలు కూడా చేసింది. కేట్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె వివాహానికి పూర్తిగా మద్ధతు ఇవ్వడం విశేషం.

(చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్‌ క్యూర్‌ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement