bomb blasts
-
పాక్ క్రికెట్ స్టేడియం వద్ద పేలుళ్లు.. ఇండియన్స్‌పై నోరు పారేసుకున్న పాకిస్తానీలు
పాకిస్తాన్లో ఏ మూలన ఏం జరిగినా ఇండియాపై, ఇండియన్స్‌పై నోరు పారేసుకోవడం పాకిస్తానీలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటనను సంబంధించి కూడా పాకీలు ఇలాగే భారతీయులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ సన్నాహకాల్లో భాగంగా క్వెట్టా స్టేడియం (భుగ్తీ) వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 5) పెషావర్ జల్మీ - క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంకు అతి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. There is no bomb blast in bughti cricket stadium quetta this is the reason please see this carefully especially for indians #bugticricketstadiu #quettavspz #psl pic.twitter.com/IqHTTOYVzR — Sardar Hamid Ghaffar Thaheem (@SardarHamidGha1) February 5, 2023 ఈ పేలుళ్లలో పదలు సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు తెలియరానప్పటికీ.. అక్కడికి అతి సమీపంతో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నందున అధికారులు మ్యాచ్‌ను రద్దు చేసి హుటాహుటిన ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ్యాచ్ జరుగుతుండగా స్డేడియం మొత్తాన్ని పొగ ఆవహించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. జనాలు స్డేడియం నుంచి బయటకు వెళ్లే క్రమంలో తొక్కసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. Just a clarification No bomb blast near bugti stadium The match is stopped because some persons from outside threw stones and put something on fire They are being identified. Endians are making propaganda, don't give them importance.#PZvsQG #Quetta pic.twitter.com/jmgbU9ODHj — Ali Asghar Wattoo (@Ali1Wattoo) February 5, 2023 అయితే, పేలుళ్లను ఆతర్వాత స్టేడియంలో నెలకొన్న పరిణామాలను పాక్ నెటిజన్లు వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఎక్కడ ఆసియా కప్-2023 నిర్వహణ తమ దేశం నుంచి తరలిపోతుందోనని సీన్‌ను వేరేలా క్రియేట్ చేశారు. అసలు విషయాన్ని దాచే క్రమంలో పాక్ అభిమానులు భారతీయులపై బురదజల్లుతున్నారు. పాక్‌లో ఆసియా కప్ నిర్వహించడం బీసీసీఐకు భారతీయులకు ఇష్టం లేదని, అందుకే పేలుళ్లను బూచిగా చూపి సోషల్‌మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 పేలుళ్లకు మ్యాచ్ రద్దు చేయడానికి అస్సలు సంబంధం లేదని, మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరారని, వారిలో చాలామందికి లోనికి ప్రవేశం లభించలేదని, అలాంటి వారు బయట నుంచి స్టేడియంలోకి రాళ్లు విసరడంతో ఆందోళన జరిగిందని లేని విషయాన్ని కథగా అల్లారు. కొందరు పాకీలు అయితే ఏదో ఫేక్ వీడియోను ట్రోల్ చేస్తూ.. స్టేడియం వద్ద జరిగింది ఇది, అసత్యాలను ప్రచారం చేస్తున్న భారతీయుల కోసమే ఇది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారతీయులు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. విషప్రచారాలు చేయడం పాకీలకే చెల్లుతుంది.. పేలుళ్లు జరిగినా, జరగకపోయినా ఆసియాకప్ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే, క్వెట్టా స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్లో మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్.. అదే దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో 6 వరుస బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. -
అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం
కాబుల్: అఫ్గానిస్తాన్‌లోని ఐబక్ నగరంలోని ఒక మదరసాలో బుధవారం సంభవించిన పేలుళ్లలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని స్థానికంగా వైద్యుడు ఒకరు మీడియాకి వెల్లడించారు. తమ ఆస్పత్రికి చికిత్సకి వచ్చిన వారిలో యువతే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. అల్ జిహాద్ మదరసాలో పేలుళ్లు జరిగినట్టుగా ప్రావిన్షియల్ అధికారి కూడా ధ్రువీకరించారు. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాక యువతీ యువకుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కువ దాడులకు ఇస్లామిక్ స్టేట్ తనదే బాధ్యతని ప్రకటించుకుంది. ఈ సారి దాడుల పని ఎవరిదో ఇంకా తెలియలేదు. -
పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు. -
అఫ్గాన్ గురుద్వారాలో పేలుళ్లు
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని కర్తే పర్వాన్ గురుద్వారా వద్ద శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, మరొకరు భద్రతా సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో గురుద్వారా గేటుపైకి దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక అఫ్గాన్ సిక్కుతోపాటు భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారు. అనంతరం దుండుగులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గురుద్వారా వైపు వస్తుండగా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దాడి ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, అఫ్గాన్‌లోని మైనారిటీలపై తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. అఫ్గాన్‌లోని గురుద్వారాపై దాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. Kabul Update: Sikh Sangat (approx 10-15 in number) stuck in Gurdwara Karte Parwan in Kabul which was attacked by terrorists today morning. One person has been reported dead in this attack.#GurdwaraKarteParwan #Kabul @ANI @PTI_News @TimesNow @punjabkesari @republic pic.twitter.com/XLjSikVPYs — Manjinder Singh Sirsa (@mssirsa) June 18, 2022 ఇది కూడా చదవండి: రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్! -
నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్ తెలిపాడు. ''బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని'' మీడియాకు తెలిపాడు. అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశాడు. కాగా 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు పోయాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతోపాటు బాంబు దాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్
చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్దీప్ది పంజాబ్‌లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్లైన్లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. -
Kabul Airport Blast: అదృష్టమంటే వీళ్లదే!
జంట పేలుళ్లతో కాబూల్ ఎయిర్పోర్ట్ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్‌గా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. I just had a phone call conversation with S Gurnam Singh, president of Kabul Gurdwara committee who apprised me that today’s #Kabulairport explosion has happened at exactly same place where they were standing yesterday We thank Almighty that such thing didn’t happen yesterday pic.twitter.com/sbCiHaMZGP — Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021 ‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్‌లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ గుర్మాన్ సింగ్ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: అఫ్గన్ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు హాట్ న్యూస్: కాబూల్ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు -
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్‌లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
మందెరకలపాడులో బాంబుల మోత
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో మందెరకలపాడు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా బాంబుల మోత మోగింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయా? ల్యాండ్ మైన్స్ పేల్చారా? అనే చర్చ సాగింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... గతంలో తోగ్గూడెం క్వారీలో పోలీసులు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేయాలని ఆదేశించడంతో కొత్తగూడెం నుంచి బాంబు స్క్వాడ్ వచ్చి మందెరకలపాడు అటవీప్రాంతంలో నీటిలో జిలెటిన్‌స్టిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. మరికొన్ని జిలెటిన్ స్టిక్స్‌ను నేడు నిర్వీర్యం చేయనున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జిలెటిన్ స్టిక్స్‌ను వాగులో పేల్చామని పాల్వంచ రూరల్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
ఇరాక్‌లో ఉద్రిక్త పరిస్థితులు, మనోళ్లు భద్రమే..
సాక్షి, నెట్వర్క్:ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన సుమారు పది వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. బాగ్దాద్ పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనచెందుతున్నారు. అయితే, తాము భద్రంగానే ఉన్నామంటూ పలువురు కార్మికులు తమ వారికి ఫోన్‌చేసి సమాచారమిస్తున్నారు. మాచారెడ్డి మండలానికి చెందిన గోపి ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము బాగ్దాద్‌కు కొంత దూరంలో ఉన్నామని, ఇటువైపు ఎలాంటి గొడవలు లేనప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే ఉందని తెలిపాడు. తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పలువురు వలస కార్మికులు వివరించారు. ఇరాక్‌లో నెలకొన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన విదేశాంగ శాఖ కూడా వలస కార్మికుల రక్షణకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్యాంపుల్లోనే ఉండాలని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు కార్మికులు వెల్లడించారు. అకామా(గుర్తింపుకార్డులు) లేని కార్మికులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉండగా.. శాంతియుత వాతావరణం నెలకొన్న తరువాతనే ఇరాక్ విడిచి ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా విదేశాంగ శాఖ సూచించింది. బాంబు దాడులకు తోడువర్షం జోరు... ఇరాక్‌లో బాంబుదాడులు కొనసాగుతుండటమే కాకుండా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కార్మికులు క్యాంపులను విడిచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల నుంచి ఇరాక్‌లో వర్షాలు కురుస్తున్నాయి. వర్క్ వీసా ఉన్నవారు మాత్రమే కష్టపడి తమ కంపెనీలకు వెళ్లి పనులు చేసుకుని క్యాంపులకు చేరుకుంటున్నారు. ఎర్బిల్‌లో మన వారి సంఖ్య ఎక్కువ.. ఇరాక్‌లోని ఎర్బిల్‌లో మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎర్బిల్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇరాక్‌కు ఉపాధి కోసం వెళ్లిన వారు ఈ ప్రాంతంలోని హోటళ్లు, మాల్స్ ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. సుమారు ఐదు వేల మంది తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులుఉంటారని స్వచ్చంద సంస్థల ద్వారా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో మన రాష్ట్రానికి చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇరాక్‌కు వెళ్లడానికిమరోసారి నిషేధం.. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ఇరాక్ కేంద్రబిందువు కావడంతో మన దేశస్తులు అక్కడకు వలస వెళ్లకుండా మన విదేశాంగ శాఖ మరోసారి నిషేధం విధించింది. ఇరాక్‌కు వలస వెళ్లే కార్మికుల ఎమిగ్రేషన్ క్లియరెన్స్‌ను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. 2014లో ఇరాక్‌లోని ఉగ్రమూకలు మన దేశానికి చెందిన 39 మంది వలసదారులను బందీలుగా చేసుకుని హతమార్చారు. దీంతో ఇరాక్‌కు వలస వెళ్లడాన్ని నిషేధిస్తూ 2014 జూలై 17న భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇరాక్‌లో శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు గుర్తించిన మన ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ 2019 సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకుంది. ఇదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఇరాక్‌లోని ఐదు ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాల్లో ఉపాధి కోసం వలస వెళ్లడానికి ఎమిగ్రేషన్ అనుమతి ఇచ్చింది. నిన్వేహ్, సలాహుద్దీన్, దియాల, అంబర్, కిర్కుక్ ప్రాంతాలకు ఎమిగ్రేషన్ అనుమతి లేదు. ఈ ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాలకు వెళ్లేందుకు ఎమిగ్రేషన్ అనుమతి ఉండగా.. ఇప్పుడు మొత్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. జాగ్రత్తగానే ఉంటున్నాం.. ఇరాక్‌లో ఉన్న వలస కార్మికులమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తెలంగాణ గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు తగిన సూచనలు చేశాం. ఇక్కడ కొంత ఉద్రిక్తత ఉన్నా.. ప్రమాదం ఏమీలేదు. వలసదారుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శాంతియుత వాతావరణం నెలకొంటే బాగుంటుంది. బాంబుదాడులు, వర్షం వల్ల అనేక మంది కార్మికులు క్యాంపుల్లోనే ఉంటున్నారు. – రాయల్వర్ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ అమ్మా.. బాగానే ఉన్నాం... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన మెరుగు శ్రీను ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలోఉంటున్నాడు. తాను బాగానే ఉన్నానని, దాడులు తాముఉంటున్న ప్రాంతానికి చాలా దూరంలో జరుగుతున్నాయని, తమకు ఇబ్బంది ఏమీలేదని తన తల్లికి ఫోన్‌చేసి చెప్పాడు. తాను క్షేమంగానే ఉన్నానని, బెంగపెట్టుకోవద్దన్నాడు. బాంబుల శబ్ధం వచ్చింది : కుర్మ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన నేను ఇరాక్‌లోని అంకామ ప్రాంతంలో ఉంటున్నా. రాత్రిపూట ఒక్కసారిగా బాంబుల శబ్దం వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బాంబులు పడ్డట్లు ఇక్కడి వారు తెలిపారు. ఇరాన్ దేశం ఇక్కడి అమెరికా సైన్యంపై దాడులు చేసినట్లు చెబుతున్నారు. బాంబుల శబ్ధం విన్నాక అందరం గదిలోకి వెళ్లాం. భయంతో బయటకు రాలేదు. మాకు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు. -
క్వారీలో బ్లాస్టింగ్..ఇద్దరి మృతి
కీసర: క్రషర్ మిషన్ క్వారీ వద్ద జరిగిన బ్లాస్టింగ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని గుట్టకమాన్ వద్ద గల ఎస్‌ఎల్‌ఎంఐ క్రషర్ మిషన్ సమీపంలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన అన్నారం బాల్‌రాజ్ (36), గువ్వల బాల్‌రాజ్(32)లు ఇరువురు క్రషర్‌మిషన్‌లో సూపర్వైజర్లుగా పనిచేస్తుంటారు. ఈమేరకు వీరు శుక్రవారం సాయంత్రం క్వారీ వద్ద బ్లాస్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బ్లాస్టింగ్ చేసే ముందు క్వారీ వద్ద పరిసరాలను పరిశీలించేందుకు ఇద్దరు క్వారీ సమీపంలోకి వెళ్లారని, ఇంతలోనే ఒక్కసారిగా బ్లాస్టింగ్ కావడంతో ఇద్దరు అక్కడికక్కడే బండరాళ్ల మధ్యలో ఇరుక్కొని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా బ్లాస్టింగ్ జరగడానికి గల కారణాలు పూర్తిగా తెలియరావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా వీరు క్వారీ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి మెరుపులు రావడంతో బ్లాస్టింగ్ కోసం ఏర్పాటు చేసి విద్యుత్ వైర్లకు విద్యుత్‌సరఫరా అయి బ్లాస్టింగ్ జరిగిందని తోటి కార్మికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల్లో అన్నారం బాలరాజ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నట్లు, గువ్వల బాల్‌రాజ్ భార్య గర్బవతి అని పోలీసులు తెలిపారు. -
లంక ఉగ్రవాదులకు కశ్మీర్లో శిక్షణ!
కొలంబో/శ్రీనగర్: శ్రీలంకలోని విలాసవంతమైన హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ 9 మంది బాంబర్లు భారత్‌లోని కశ్మీర్, కేరళ, బెంగళూరును సందర్శించారని శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనానాయకే వ్యాఖ్యానించారు. వీరంతా శిక్షణ కోసం లేదా ఇతర విదేశీ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పర్యటనలు జరిపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సేనానాయకే బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాడి వెనుక విదేశీ హస్తం.. ‘ఆత్మాహుతి బాంబర్లు అందరూ భారత్‌కు వెళ్లారు. కశ్మీర్, బెంగళూరు, కేరళ వెళ్లొచ్చారు. ఆత్మాహుతి దాడులు జరిగిన తీరును జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక బయటివారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది’ అని అన్నారు. భారత నిఘావర్గాల హెచ్చరికల్ని ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఉగ్రవాదుల కదలికలపై మా దగ్గర కొంత సమాచారం ఉంది. అలాగే అప్పటి పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉండటంతో అంత సీరియస్‌గా తీసుకోలేదుæ’ అని స్పష్టం చేశారు. స్వేచ్ఛ ఎక్కువై భద్రతను మరిచారు.. ‘గత పదేళ్లుగా దేశం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు చాలా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా 30 ఏళ్లు దేశం ఎలా అట్టుడికిందో వాళ్లు మర్చిపోయారు. ప్రశాంతతకు అలవాటుపడి జాతీయభద్రతను నిర్లక్ష్యం చేశారు’ అని అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈకి, ప్రభుత్వానికి మధ్య 30 ఏళ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు లక్షమంది సమిధలయ్యారు. 2009లో శ్రీలంక బలగాలు ప్రభాకరన్‌ను హతమార్చడంతో అంతర్యుద్ధానికి తెరపడింది. ఎన్టీజే ఉగ్రవాదులు కశ్మీర్‌ను సందర్శించారన్న శ్రీలంక ఆర్మీ చీఫ్ సేనానాయకే వ్యాఖ్యలను భారత ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. -
మానవబాంబు అంటూ వైరల్‌గా మారిన న్యాయవాది వీడియో
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల కాలంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఐసిస్ తీవ్రవాదుల కదలికలతో కలకలంగా మారింది. శ్రీలంక బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండగా చెన్నైలో మంగళవారం అర్ధరాత్రి జరిపిన సోదాల్లో ముగ్గురు శ్రీలంక వాసులు సహా నలుగురు యువకులు పట్టుబడ్డారు. శ్రీలంకలో గత నెల 21న చర్చిలో మానవబాంబు సృష్టించిన విధ్వంసం 253 మందిని బలితీసుకుంది. ఆ తరువాత మరికొన్ని బాంబు పేలుళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైతం ఇదేరకమైన ఘాతుకాలకు పాల్పడేందుకు ‘స్లీపర్ సెల్’ గా వ్యవహరిస్తున్న కొందరితో తీవ్రవాదులు సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమానిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మహిళలు సహా 21 మందితో కూడిన తీవ్రవాదులను గుర్తించగా వీరిలో 15 మంది అఫ్ఘనిస్తాన్, సిరియాకు తప్పించుకుని వెళ్లినట్లు కనుగొన్నారు. ఈ దశలో చెన్నై, కోయంబత్తూరు, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ తనిఖీలను నిర్వహిస్తోంది. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక బృందంగా ఏర్పడి చెన్నైలో తీవ్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఒక్క చెన్నైలోనే మంగళవారం ముగ్గురు శ్రీలంకవాసులు పట్టుబడ్డారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల సంఘటనలకు ముందు ఐసీస్ అగ్రనేత జాక్రాన్ హసీంతో మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీలంక పేలుళ్లతో వీరికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు రహస్యమార్గంలో, మరో ఇద్దరు విమానం ద్వారా చెన్నైకి వచ్చారు. ఇదిలా ఉండగా, పదిమందితో కూడిన ఎన్ఐఏ అధికారులు బుధవారం తంజావూరు, అదిరామపట్టినం, కుడందై పరిసర సముద్రతీర ప్రాంతాల్లో స్థానికపోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. రామనాధపురంలో 19 మంది తీవ్రవాదులు సంచరిస్తున్నట్లు సామాజిక మా«ధ్యమాలు అసత్యప్రచారం జరిగిందని నిర్దారించుకున్నారు. అయినా ఆయా ప్రాంతాలపై నిఘా, భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఓం ప్రకాష్ తెలిపారు. చెన్నైలో నలుగురు శ్రీలంక యవకులు అరెస్ ్ట: శ్రీలంక పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారంతో మంగళవారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చెన్నై మన్నాడికి చెందిన ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో చెన్నై పూందమల్లి బెంగళూరు జాతీయ రహదారిలోని గోల్డన్ ఒబులన్స్ అనే అపార్టుమెంటులో కొందరు శ్రీలంక వాసులు నివసిస్తున్నట్లు కనుగొన్నారు. అర్ధరాత్రి వారు నివసిస్తున్న పోర్షన్‌ను చుట్టుముట్టి శ్రీలంకకు చెందిన తానూకా రోషన్, అతని అనుచరులైన మహమ్మద్ రబ్దూన్, లబేర్ మహమ్మద్ అనే యువకులను అరెస్ట్ చేశారు. శ్రీలంకలో ఒక హత్యకేసులో నిందితుడైన రోషన్ 8 నెలల క్రితం సముద్ర రహస్యమార్గంలో చెన్నైకి చేరుకున్నాడు. సుదర్శన్ అనే పేరు, కున్రత్తూరు, మెహతానగర్ చిరునామాతో ఆధార్‌కార్డు, గుర్తింపు కార్డులను పొంది ఉన్నాడు. అంతేగాక ఐసిస్ అగ్రనేత జాక్రాన్ హసీమన్కు సన్నిహితుడని తెలుసుకున్నారు. రోషన్ నివాసం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా చెన్నైలో నివసిస్తున్న నేరంపై పూందమల్లి పోలీసులు సైతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆగస్టు్ట 15న చెన్నైలో మానవబాంబు దాడి: ఆగస్టు 15న రానున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సమయంలో చెన్నైలో మానవబాంబు దాడి చోటుచేసుకోనుందని సామాజిక మాధ్యమాల ద్వారా ఒక న్యాయవాది వీడియో అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. రామనాథపురం జిల్లాకు చెందిన స్వామి మదురైలో ఒక రూము తీసుకుని నివసిస్తూ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. గంజాయి ముఠాకు పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాక జిల్లా కోర్టు, కలెక్టర్ కార్యాలయ ప్రాంతాల్లో అర్ధనగ్నంగా పరుగులు పెట్టి కలకలం రేపారు. శ్రీలంక పేలుళ్లకు మదురై జిల్లా అధికారి ఒకరు కారణమని, అతని నడవడికలపై అనుమానం వ్యక్తం చేస్తూ 2016 ఏప్రిల్ లోనే ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. అంతేగాక, మరో మూడు నెలల్లో తమిళనాడులో తీవ్రవాదదాడులు చోటుచేసుకోనున్నాయి, నేను అబద్దం చెబుతున్నట్లు భావిస్తే అరెస్ట్ చేసి శిక్షించడంని ఆ విడియోలో సవాల్ విసిరాడు. ఆగష్టు 15వ తేదీన చెన్నైలో మానవబాంబు విధ్వంసాల కో ఐసం ‘అడ్ప్లాన్’ అనే పథకం రూపకల్పన జరిగి ఉందని, ఆ మానవబాంబులు ఉన్న ప్రాంతం తనకు తెలుసని చెప్పాడు. విద్యార్థులు, యువకుల ద్వారా రామనాథపురం, కీళ్కరైకి చెందిన ముగ్గురు యువతులతో ఈ దాడులు జరుగుతాయని తెలిపాడు. ఈ దాడుల పథకం గురించి నా వద్ద ఆధారాలున్నాయి, నేను కూడా వారితో కొన్నాళ్లు సంచరించి బైటకు వచ్చేశానని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ మారడంతో మదురై పోలీసులు న్యాయవాది స్వామి కోసం గాలిస్తున్నారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ
కొలంబో/కల్మునయ్: శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి కల్మునయ్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. షాంగ్రీలా హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్ అహ్మద్‌ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్ టీచర్(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సదరు టీచర్ నుంచి 50 సిమ్‌కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్‌లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్ హషీమ్ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్ తౌహీద్ జమాత్ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం శ్రీలంకలోని కల్మునయ్ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్ హషీమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మళ్లీ నెత్తురోడింది
కొలంబో/వాషింగ్టన్: ద్వీప దేశమైన శ్రీలంక మరోసారి నెత్తురోడింది. నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే. ఎన్టీజే స్థావరంలో తనిఖీలు.. ఉగ్రవాదుల విషయమై నిఘావర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త బలగాలు శుక్రవారం రాత్రి కల్మునయ్ పట్టణంలోని సైంతమురుతు ప్రాంతంలో ఎన్టీజే స్థావరంగా భావిస్తున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి. సైన్యం కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇరువర్గాల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. ఓవైపు ఇరువర్గాల మధ్య కాల్పులు భీకరంగా కొనసాగుతుండగానే, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాబలగాలకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)కు స్థావరంగా ఉన్న ఈ ఇంటిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఆత్మాహుతి కిట్లు, ఐసిస్ జెండాలు, ఆర్మీ దుస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఉగ్రదాడులపై విచారణలో శ్రీలంక అధికారులకు సహకరించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ అధికారులతో ఓ బృందాన్ని కొలంబో పంపినట్లు ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే తెలిపారు. తమ పౌరులకు భారత్, అమెరికా సూచన అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ శ్రీలంకకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సివస్తే కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం, జాఫ్నా, హంబన్తోటలోని కాన్సులేట్లు, కండిలోని అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని చెప్పింది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అగ్రరాజ్యం కోరింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ శనివారం లెవల్–3 ప్రయాణ సూచికను జారీచేసింది. వారందరినీ చంపాలి శ్రీలంకలో వరుసబాంబు పేలుళ్లు జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జహ్రన్ హషీమ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఇందులో శ్రీలంక యాసతో తమిళంలో హషీమ్ మాట్లాడుతూ.. ‘మతవిశ్వాసాలు, నమ్మకం ఆధారంగా మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరిలో ఒకరు ముస్లింలు. మరొకరు ముస్లింల అభిప్రాయాలను అంగీకరించేవారు. ఇక మూడోవర్గం ఉంది చూశారా.. వీళ్లందరిని చంపేయాలి. ఈ మాట చెప్పేందుకు చాలామంది భయపడతారు. ఈ వ్యాఖ్యలను ఉగ్రవాదంగా ముద్రవేస్తారు. ఇస్లాం సిద్ధాంతాలతో అంగీకరించని వాళ్లందరినీ చంపేయాలి’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిని ఐసిస్ తమ పత్రికలో ‘ప్రత్యేక కథనం’గా ప్రచురించింది. కాగా, హషీమ్ విద్వేష ప్రసంగాలపై తాము ప్రభుత్వానికి 2015, 2018లో ఫిర్యాదు చేశామనీ, అయినా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ తెలిపారు. ఖురాన్ తరగతుల పేరుతో యువతకు విద్వేషం నూరిపోసిన హషీమ్, గౌతమబుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసేలా యువతను ప్రేరేపించాడని విమర్శించారు. తమిళనాడులోనే ఉగ్ర శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా తమిళనాడులో శిక్షణ పొందినట్లు ఆ దేశానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీజేకు అధ్యక్షుడిగా ఉన్న జహ్రన్ హషీమ్ వీరందరికీ శిక్షణ ఇచ్చాడన్నారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీమ్సహా 9 మంది బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారని వెల్లడించారు. హషీమ్ రూపొందించిన ఆత్మాహుతి దళంలో మహిళా బాంబర్ కూడా ఉందని పేర్కొన్నారు. హషీమ్ తొలుత శ్రీలంకలోని మట్టకళప్పు ప్రాంతం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపేవాడనీ, కానీ ఇతని వ్యవహారశైలిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. ఘటనాస్థలిలో లభ్యమైన బాంబులు, బ్యానర్లు -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదుల మారణకాండను నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు శ్రీలంక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర శుక్రవారం రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల నేపథ్యంలో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ కమాండ్ ఏర్పాటు.. ‘ఈ ఉగ్రవాది చోటుచేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలీ కారణమే. దేశంలో జర్నలిస్టుల హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన కొందరు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులను ఇటీవల అరెస్ట్ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటుచేస్తాం. ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తాం’ అని సిరిసేన తెలిపారు. సూత్రధారి.. జహ్రాన్ హషీమ్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు ఎన్టీజే విధేయత ప్రకటించిందని వెల్లడించారు. ‘ఈస్టర్ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు జహ్రాన్ ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో వీరిద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు’ అని సిరిసేన పేర్కొన్నారు. ముస్లింలపై ఉగ్రముద్ర వద్దు.. ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని అధ్యక్షుడు సిరిసేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)ను నిషేధించే అంశాన్ని మేం పరిశీలించాం. కానీ ఇప్పుడున్న చట్టాల ద్వారా అది సాధ్యం కాదు. ఇందుకోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తాం’ అని సిరిసేన చెప్పారు. -
లంకకు ఉగ్ర ముప్పు!
కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే. మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది. మరో 16 మంది అరెస్టు.. పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న, ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్‌కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు. -
పేలుళ్లపై ముందే హెచ్చరించాం
న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నేత జహ్రాన్ హషీమ్ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్ హషీమ్ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది. ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. -
షాక్‌లో ఉన్నా
బాంబ్ బ్లాస్టులతో శ్రీలంక వణికిపోయింది. చర్చిలు, హోటల్స్‌లో ఆదివారం బాంబ్ బ్లాస్టులు జరగడంతో సుమారు 185 మందికిపైగా చనిపోయారు. ఈ భారీ పేలుళ్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు నటి రాధికా శరత్‌కుమార్. బాంబు పేలుళ్లకు కొద్ది గంటల ముందు వరకూ ఆ హోటల్లోనే బస చేశారట రాధిక. ఈ విషయాన్ని ట్వీటర్లో ఆమె తెలుపుతూ – ‘‘ఓ మై గాడ్.. శ్రీలంకలో వరుస బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. నేను హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు సంభవించింది. ఇంకా నమ్మలేకపోతున్నాను. షాక్‌లో ఉన్నాను’’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన ఈ విషాదానికి అన్ని సినీ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. -
మూర్ఖపు హింసకు తావులేదు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Shocked at the malicious terrorist attacks in Srilanka. Strongly condemn this heinous act, & stand in solidarity with Srilanka at this distressing time. My prayers for the bereaved families and those injured in the blasts. — YS Jagan Mohan Reddy (@ysjagan) 21 April 2019 కాగా కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లలో 207మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు శ్రీలంకలో పేలుళ్ల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఘటనపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ నేత శశిథరూర్ సహా పలువురు పేలుళ్లను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. శ్రీలంకలో ఉగ్రఘాతుకాన్ని తీవ్రస్థాయిలో ఖండించిన ప్రధాని మోదీ.. మృతులకు సంతాపం ప్రకటించారు. లంకకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ఆ దాడులు అనాగరికం : మోదీ
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 166 మందికి పైగా మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబో చర్చి, మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శ్రీలంక ప్రజలకు భారత్ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసకు తెగబడటం అనాగరిక చర్యని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ బాంబు పేలుళ్ల ఘటనను ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని అన్నారు. -
కశ్మీర్‌కు పెరిగిన ‘ఐఈడీ’ ముప్పు
న్యూఢిల్లీ: ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్) విధ్వంసాలు, బాంబు పేలుళ్ల సంఖ్య పెరిగిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఒక్క 2018లోనే ఇలాంటి ఘటనలు 57 శాతం పెరిగినట్లు పేర్కొంది. మావోయిస్టు ప్రాబల్య ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి తరహా దాడులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ఇటీవల ఢిల్లీలో ముగిసిన సదస్సులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ)కి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) ఈ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. జమ్మూ కశ్మీర్లో 2014లో ఐఈడీ దాడుల సంఖ్య 37 కాగా..2015లో 46, 2016లో 69, 2017లో 70, 2018లో 117గా నమోదయ్యాయి. కశ్మీర్ మినహా దేశమంతటా బాంబు పేలుళ్ల ఘటనలు తగ్గుముఖం పట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018కి ఐఈడీ పేలుళ్లు 98 నుంచి 77కు తగ్గగా, కశ్మీర్లో మాత్రం 57 శాతం పెరిగాయి. అయితే, 2017తో పోలిస్తే గతేడాది కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో ఎదురుదెబ్బలు తిన్న ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు భద్రతా బలగాలను ఎదుర్కోలేక ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. 2018లో నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్ల కారణంగా 55 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మొత్తం ఐఈడీ మృతుల సంఖ్య కన్నా ఈ సంఖ్య సగం కన్నా ఎక్కువ. ఈశాన్య ప్రాంతాలతో పోలిస్తే మరణాలు నమోదుకాని దాడుల సంఖ్య కూడా కశ్మీర్లో పెరిగింది. -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
నెత్తురోడిన పాక్
పెషావర్/కరాచీ: పాకిస్తాన్లో శుక్రవారం రెండు ఎన్నికల ర్యాలీలు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఓ జాతీయ స్థాయి నాయకుడు సహా మొత్తం 133 మంది మరణించారు. దాదాపు 162 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ప్రచారంలో బిజీగా ఉండగా, ఆ పార్టీల నాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మస్తుంగ్‌లో బలూచిస్తాన్ ఆవామీ పార్టీ నేత సిరాజ్ రైసాని నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిరాజ్ సహా మొత్తం 128 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోగా, 125 మందికిపైగా గాయపడ్డారని డాన్ పత్రిక తెలిపింది. ఈ దాడి తామే చేశామని ఐసిస్ ప్రకటించింది. 16 నుంచి 20 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాంబ్ స్క్వాడ్ తెలిపింది. అంతకు కొన్ని గంటల ముందే ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్సులోని బన్నూ ప్రాంతంలోనూ ముతహిద మజ్లిస్ అమల్ పార్టీ నేత అక్రం ఖాన్ దురానీ ర్యాలీ వద్ద కూడా ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 37 మందికిపైగా గాయపడ్డారు. దురానీ క్షేమంగా బయటపడ్డారు. దురానీ పాకిస్తాన్ తెహ్రీక్ –ఇ–ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల దాడులను పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్, ప్రధాని ముల్క్ ఖండించారు. గత మంగళవారం ఆవామీ నేషనల్ పార్టీ ర్యాలీలో తాలిబాన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడగా 20 మంది మరణించారు. -
దక్షిణ సిరియాపై ముప్పేట దాడి
దరా: తిరుగుబాటుదారుల అధీనంలోని దక్షిణ సిరియా వైమానిక దాడులతో దద్దరిల్లింది. రెండు వారాలుగా కొనసాగుతున్న దాడులను ప్రభుత్వ అనుకూల బలగాలు గురువారం తీవ్రతరం చేశాయి. రష్యా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు బుధవారం విఫలమయ్యాయి. ఫలితంగా జరిగిన తాజా దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని, వేల మంది స్వస్థలాలు విడిచి వెళ్తున్నారని వార్తలు వెలువడ్డాయి. సాయిదా పట్టణంలో మహిళ, నలుగురు పిల్లలు సహా ఆరుగురు మృతిచెందినట్లు తెలి సింది. సిరియా, రష్యా బలగాలు ఉమ్మడిగా ఈ ఆప రేషన్‌ను నిర్వహిస్తున్నాయి. దరా ప్రావిన్స్‌లోని టఫా స్, జోర్డాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో బుధ వారం రాత్రి నుంచి శక్తిమంతమైన క్షిపణులు, క్రూడ్ బ్యారె ల్ బాంబులతో దాడులు చేస్తున్నారని సిరియా లో సేవలందిస్తున్న మానవ హక్కుల సంస్థ పేర్కొంది. -
వీరి సాహసానికి గుర్తింపేదీ?
సాక్షి, సిటీబ్యూరో: ఆ ముగ్గురూ నగర పోలీసు విభాగంలో పని చేసిన/చేస్తున్న అధికారులు... 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిందని తెలిసిన మరుక్షణం అక్కడికి చేరుకున్నారు... మసీదు ప్రాంగణంలో ఉన్న మరో బాంబును గుర్తించి, రక్షణ సాధనాలు లేకపోయినా ధైర్యంగా నిర్వీర్యం చేశారు... నగర పోలీసు ఉన్నతాధికారులు వీరిని పొగడ్తలతో ముంచెత్తడమేగాక పదోన్నతులు ఖాయమనీ ప్రకటించారు. అంతే... కథ అక్కడితో ఆగిపోయింది... ఇది జరిగి పదకొండేళ్లు అయినా... కేసు విచారణ పూర్తై వీగిపోయినా... వీరి పదోన్నతుల ఫైలు మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మక్కా మసీదులో ఉగ్రవాదులు అత్యంత శక్తిమంతమైన సెల్‌ఫోన్ బాంబులను అమర్చారు. ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమంతో కూడిన ఈ బాంబులతో ఉన్న ఓ బ్యాగ్‌ను మసీదు ప్రాంగణంలోని ఆరంగుళాల మందమున్న రాతి బల్ల కింద పెట్టారు. ఈ పేలుడు ధాటికి బండ తునాతునకలైంది. నిపుణుల అంచనా ప్రకారం పేలుడు తీవ్రతలో బయటకు వచ్చింది కేవలం 30 శాతం మాత్రమే. అయినా ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతే శక్తివంతమైన మరో బాంబును మసీదు పరిపాలనా కార్యాలయం సమీపంలో గ్రిల్స్‌కు వేలాడదీశారు. ఇది పేలి ఉంటే ప్రాణనష్టం అపారంగా ఉండేది. మసీదులో తొలి బాంబు పేలిన వెంటనే అప్రమత్తమైన నగర పోలీసులు సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్ల్యూ)లోని బాంబు నిర్వీర్య బృందాలతో పాటు... క్లూస్ టీమ్‌ను ఘటనా స్థలికి పిలిపించారు. అప్పట్లో సిటీ క్లూస్ టీమ్ అధికారిగా ఉన్న తరువు సురేష్, సీఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.ఎన్.ఎస్.వి.రమణ, కానిస్టేబుల్ హెచ్.అనిల్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మసీదు ప్రాంగణంలో అనుమానాస్పదంగా ఉన్న మరో బ్యాగును గుర్తించిన మసీదు సిబ్బంది వీరి దృష్టికి తెచ్చారు. అయితే బాంబ్సూట్, మరే ఇతర రక్షణ సాధనాలు లేకపోయినా వేగంగా స్పందించారు. బాంబును మసీదు సమీపంలోని కిల్వత్ గ్రౌండ్లోకి తరలించి అందుబాటులో ఉన్న సాధారణ పరికరాలతోనే నిర్వీర్యం చేశారు. ఆ సందర్భంగా వీరి సాహసాన్ని అందరూ కొనియాడారు. పోలీసు ఉన్నతాధికారులు హామీల వర్షం కురిపించారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అప్పట్లో ప్రతి నెలా ఇచ్చే రివార్డులను ఇచ్చి సరిపుచ్చారు. రమణ, అనిల్‌లకు పదోన్నతికి సిఫారసు చేస్తూ అదే ఏడాది జూన్‌లో అప్పటి కమిషనర్ బల్వీందర్‌సింగ్ ప్రభుత్వానికి లేఖ (నెం. ఎల్ అండ్ ఓ ఎం 7ఆర్ఆర్255907) రాశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఆ లేఖలో క్లూస్ అధికారి సురేష్ ప్రస్తావన సైతం లేకపోవడం గమనార్హం. ఈ ఫైల్‌కు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దర్యాప్తులో ఎన్ఐఏ విఫలం చాదర్‌ఘాట్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎన్ఐఏ విఫలమైనందున దర్యాప్తు బాధ్యతలు మరో సంస్థకు అప్పగించాలని ఎంబీటీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ అన్నారు. సోమవారం చంచల్‌గూడ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని నిర్ధోషులుగా విడుదల చేసిన నేపథ్యంలో కేసుపై హైకోర్ట్‌లో అప్పీల్ వేయాలన్నారు. ఈ పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా వంద మంది మైనారిటీ యువకులను నెలలు జైళ్లల్లో నిర్భందించారన్నారు. అసలు నిందితులను పట్టుకోవటంలో ఎన్ఐఏ విఫలమైందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కూడా కారణమని ఆరోపించారు. తమను అన్యాయంగా జైల్లో ఉంచి తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితుడు సయ్యద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘మక్కా’ నుంచే మారాడు..
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్‌లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు. ‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం.. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్‌ను రెండుసార్లు టార్గెట్‌గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్చార్జ్గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్ఐఏకే చేరింది. -
డిటో పేలుళ్లు!
మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లను ఒకే మాడ్యుల్ చేసిందన్నది దర్యాప్తు సంస్థల మాట. నిందితులు సైతం దాదాపు ఒకరే. ఈ రెండు పేలుళ్ల మధ్యా అనేక సారూప్యతలు ఉన్నాయి. మక్కా మసీదులో సెల్‌ఫోన్ అలారంతో పేల్చిన షేప్డ్ బాంబు పేలుడు ధాటికి తొమ్మిది మంది మరణించారు. ఇదిజరిగిన దాదాపు అయిదు నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో పేలుడు జరిగింది. అక్కడ వినియోగించిన బాంబులు, ‘మక్కా’లో వాడిన బాంబుల మధ్య సారూప్యత ఉంది. మక్కా పేలుళ్లపై సోమవారం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ‘డిటో పేలుళ్ల’ అంశం చర్చనీయాంశమైంది. ఇక మక్కా కేసులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. అజ్మీర్ దర్గా కేసులో మాత్రం పలువురు నిందితులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. కొందర్ని నిర్దోషులుగా ప్రకటించింది. సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో 2007 మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాకపోతే మక్కా కేసు సోమవారం ఎన్ఐఏ కోర్టులో వీగిపోగా...అజ్మీర్ దర్గా కేసులో మాత్రం నిందితులు కొందరికి శిక్ష పడింది. 2017, మార్చి 22న అజ్మీర్ దర్గాలో పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దేవేందర్‌గుప్తా (మక్కా మసీదు కేసులో కూడా ఉన్నాడు), భూపేష్‌కుమార్, తీర్పు నాటికే హత్యకు గురైన సుశీల్ జోషి (మక్కా కేసులోనూ నిందితుడు)లను దోషులుగా తేల్చింది. సుశీల్ కాకుండా మిగతా ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అసిమానందతో పాటు మరికొందర్ని నిర్దోషులుగా అక్కడి కోర్టు పేర్కొంది. ఎన్నో పోలికలు... కాగా ఈ రెండు పేలుళ్లకు పాల్పడింది ఒకరే అన్న అనుమానాలను బలపరిచేందుకు చాలా పోలికలు ఉన్నాయి. రెండు చోట్లా బాంబు సర్క్యూట్ పూర్తి కావడానికి ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డులను ఒకే ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన ఉగ్రవాదులు నోయిడాలోని కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పని చేసే తారఖ్ నాథ్ ప్రమాణిక్ ఫొటోను వినియోగించి బాబూలాల్ యాదవ్ పేరుతో జార్ఖండ్ నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డులు పొందారు. వీటి సాయంతో రాంచీలో సిమ్‌కార్డులు, ఫరీదాబాద్‌లో నోకియా 6030 సెల్ఫోన్లు కొనుగోలు చేశారు. వీటినే ఇటు ‘మక్కా’, అటు ‘అజ్మీర్’ పేలుళ్లలో వినియోగించారు. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు వినియోగించిన బాంబులను సాంకేతికంగా షేప్డ్ బాంబ్స్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన అచ్చుల్లో ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమం నింపి సెల్‌ఫోన్ అలారం ద్వారా సర్క్యూట్ ఏర్పాటు చేశారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప పెట్టెల్లో పెట్టారు. వీటిపై సీరియల్ నెంబర్లు సైతం వేశారు. మక్కా మసీదులో దొరికిన పేలని బాంబు పెట్టెపై 2, అజ్మీర్ దర్గాలో దొరికిన పేలని బాంబు ఉన్న పెట్టెపై 3 అంకెలు ఉన్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు ఈ రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే సంస్థకు చెందిన వారని, వారు తయారు చేసిన బాంబుల్లో 1,4 నెంబర్లున్నవి పేలగా... 2,3 నెంబర్లవి దొరికాయని నిర్థారించారు. -
పేలుళ్ల మిస్టరీ వీడింది, కానీ...
ఆస్టిన్ : మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్ర పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పేలుళ్ల మిస్టరీ వీడింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. కానీ, ఈ క్రమంలో తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో వరుసగా పార్సిళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటిదాకా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి గాయలయ్యాయి. బోస్టర్ మారథాన్ పేలుళ్ల (2013) తర్వాత వరుసగా ఇవి చోటు చేసుకుండటంతో స్వాట్ విభాగం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో నిందితుడి కోసం కీలక ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బుధవారం మార్క్ కండిట్ట్ అనే యువకుడు తానే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులకు వీడియో సందేశం పంపాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో తాను ఉన్న ఎస్యూవీ వాహనాన్ని పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పేలుళ్లకు అతను ఎందుకు పాల్పడ్డడన్న విషయాన్ని మాత్రం అతను వెల్లడించకపోవటంతో.. కారణాలు వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మొత్తం ఏడు బాంబులతో తాను ప్రణాళిక రచించానని, కానీ, అవి విఫలం కావటంతో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు నిందితుడు వీడియోలో వెల్లడించాడని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదు పేలుళ్లు సంభవించగా. మరొక దానిని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఇక చివరిది కండిట్ట్ వాహనంలో పేలిపోయిందని అధికారులు తెలిపారు. AUSTIN BOMBING SUSPECT IS DEAD. Great job by law enforcement and all concerned! — Donald J. Trump (@realDonaldTrump) 21 March 2018 -
టెక్సస్‌లో సీరియల్ బాంబర్!
హూస్టన్: అమెరికాలోని టెక్సస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్ బాంబర్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్లను ఆస్టిన్‌కు పంపింది. -
మిలిటరీ అకాడమీపై బాంబు దాడి.. కాల్పులు
కాబూల్ : ఉగ్రదాడితో అప్ఘనిస్థాన్ మరోసారి వణికిపోయింది. కాబూల్‌లోని మిలిటరీ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో అకాడమీ దద్దరిల్లి పోయింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మార్షల్ ఫాహిమ్ నేషనల్ ఢిపెన్స్ యూనివర్సిటీ అకాడమీపై ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, పది రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కాబూల్ నగరంపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంటర్కాంటినెంటల్ హోటల్‌పై జరిపిన దాడిలో 22 మంది ప్రాణాలు బలితీసుకున్న తాలిబన్లు.. రెండు రోజుల క్రితం అంబులెన్స్‌తో భారీ ఎత్తున్న బాంబు దాడి నిర్వహించి 100 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. అఫ్ఘన్ మిలిటరీ అకాడమీలే లక్ష్యంగా ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు దాడులకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్షల్ ఫాహిమ్ వద్దే బాంబు దాడి చోటు చేసుకోగా.. 11 మంది సైనికులను మృతి చెందారు. -
పాపం.. లూలు జాబ్ పోయింది!
వాషింగ్టన్ : లూలును సీఐఏ విధుల నుంచి తప్పించింది. లూలు అంటే బాంబు స్క్వాడ్ బృందంలో పనిచేసే ఓ శునకం. లూలును ఎందుకు జాబ్ నుంచి తీసేశారో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు తనిఖీల కోసం కొన్ని ప్రత్యేక జాతి శునకాలకు శిక్షణ ఇస్తాయి. ఇందులో భాగంగానే ఇటీవల లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన లూలును ఎంపిక చేసింది సీఐఏ. బాంబులుగానీ, లేదా ఇతర పేలుడు, అనుమానిత వస్తువులను పసిగట్టేలా అధికారులు లూలుకు శిక్షణ ఇప్పించారు. అయితే గతకొన్ని రోజులుగా లూలు విధులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించారు. ఆ వివరాలను సీఐఏ ఓ బ్లాగులో పేర్కొంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని శునకాలు తమ విధులు సక్రమంగా నిర్వర్తించవు. అందుకు లక్ష కారణాలుండొచ్చు. కొన్నిసార్లు కొన్నిరోజులకే అవి మళ్లీ పూర్తిస్థాయిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. లూలు విషయంలో అలా జరగదని తేలిపోయింది. మళ్లీ శిక్షణ ఇవ్వాలని చూసినప్పటికీ, ఆ శునకం ఆసక్తి చూపించడం లేదట. ఒకవేళ బలవంతంగా లూలుతో పని చేయిస్తే అది బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించకపోతే ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాంతో పాటు లూలు సాధారణ శునకాల్లాగ జీవించాలని చూస్తుందని, అందుకే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలుసుకున్న అధికారులు ఈ స్పెషల్ డాగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఉద్యోగం పోగొట్టుకున్న లూలు ప్రస్తుతం హ్యార్రీ అనే మరో శునకంతో ఫ్రెండ్షిప్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతోందని అధికారులు ఆ బ్లాగ్‌లో వెల్లడించారు. -
భారత్‌పై విధ్వంసానికి ముష్కరుల భారీ కుట్ర
-
'పెట్స్'తో స్కెచ్!
పెంపుడు జంతువులకు బాంబులు అమర్చి పేలుళ్లకు పథకం ► గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి ముష్కరుల కుట్ర ► పారిస్ తరహాలో వాహనంతో విరుచుకుపడొచ్చు ► పెద్దనోట్ల రద్దుతో నిధులందక ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి ► తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించేందుకు ప్లాన్ ► అన్ని సంస్థలు ఒక్కటై ఏకకాలంలో పేలుళ్లకు పాల్పడొచ్చు ► రాష్ట్రాలన్నింటిని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు సాక్షి, హైదరాబాద్ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్ర మూకలు కుట్రపన్నాయా? పెద్దనోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముష్కర సంస్థలు తక్కువ ఖర్చుతో భారీ విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్నాయా? గతానికి భిన్నంగా ఎవరికీ అనుమానం రాకుండా పెంపుడు జంతువుల(పెట్స్)కు బాంబులు అమర్చి పేలుళ్లకు పథక రచన చేస్తున్నాయా? కేంద్ర నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో పాటు ఐసిస్, ఏక్యూఐఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలూ విధ్వంసాలకు కుట్ర పన్నే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ నెల 27 వరకు అప్రమత్తంగా ఉండాలంటూ శనివారం రాష్ట్రాలకు స్పష్టంచేశాయి. ఉగ్రవాదుల కుట్ర అమలుకు ఆర్థిక వనరులే అత్యంత కీలకం. అయితే పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశంలోని నిద్రాణ దళాలు (స్లీపర్ సెల్స్), సానుభూతిపరులకు నిధుల రాక ఆగిపోయింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన నిధులను హవాలా మార్గంలో అందించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే రూ.2000, రూ.500 కొత్త నోట్లతోపాటు రూ.100 నోట్లను పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధుల్ని దేశంలోకి పంపడం కష్ట సాధ్యం కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపే దాడులకు కుట్ర చేస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. పెంపుడు జంతువులతో విధ్వంసం.. మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులకు ఇటీవల ఓ కీలక సమాచారం అందింది. సాంకేతిక ఆధారాలతోపాటు గడిచిన రెండేళ్లలో అరెస్టు చేసిన ముష్కరుల విచారణలో ఇది బయటపడింది. దీని ప్రకారం ఈసారి ఉగ్రవాదులు పెంపుడు జంతువుల (పెట్స్) ద్వారా విధ్వంసానికి కుట్ర పన్నే ప్రమాదం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పెంపుడు జంతువులకు బాంబుల్ని అమర్చి ఎంపిక చేసుకున్న బహిరంగ ప్రదేశాల్లో ముష్కరులు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. దీంతో బహిరంగ ప్రదేశాలతో పాటు కీలక ప్రాంతాల్లో సంచరించే పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ప్రధానంగా శీతాకాలం నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేక వస్త్రాలతో, అసహజ/అనుమానాస్పద కదలికలతో ఉన్న పెంపుడు జంతువులతోపాటు వాటి యజమానుల పైనే కన్నేసి ఉంచాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాల్సిందిగా ఏటీఎస్ కేంద్ర నిఘా వర్గాలను కోరింది. గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాలతోపాటు నగరాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా సూచించాయి. ఒంటరిగా వెళ్లి పెను విధ్వంసం.. ఉగ్రవాదులు, సానుభూతిపరులతో మాడ్యుల్ ఏర్పాటు, పేలుడు పదార్థాల సమీకరణ, బాంబుల తయారీ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ముష్కర మూకలు ‘నైస్æ ఎటాక్స్’గా పిలిచే ‘లోన్ ఉల్ఫ్’దాడులకు కుట్ర పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పారిస్ తరహాలో జనసమ్మర్థ ప్రాంతంలో భారీ వాహనంతో దూసుకుపోయి, వీలైనంత ఎక్కువ ప్రాణనష్టం కలిగించడాన్నే ‘నైస్ ఎటాక్’గా పిలుస్తారు. ఆ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించే ముష్కరుడు తప్ప మరో వ్యక్తితో అవసరం లేదు. ఇలా ఒకే వ్యక్తితో పూర్తి చేయించే దాడుల్ని ‘లోన్ ఉల్ఫ్’దాడులు అంటారు. ఎదుటి వ్యక్తి తేరుకునే లోపే ఒంటరిగా వెళ్లి ‘పని’పూర్తి చేసుకురావడం ఈ దాడుల ప్రత్యేకత. బుధ, గురువారాల్లో గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాల సమీపంలో భారీ వాహనాల రాకపోకల్ని రాష్ట్రాలు నిషేధిస్తే ఉత్తమమని నిఘా వర్గాలు సూచించాయి. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు కీలక సందర్భాల్లో హెచ్చరికలు వెలుడుతుంటాయి. ఈసారి స్పష్టమైన సూచనలు ఉండటంతో ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశాం. దక్షిణాదిలో హైదరాబాద్ అత్యంత కీలకమైన ప్రాంతం’’అని అన్నారు. మూకుమ్మడి దాడులకు ప్లాన్! సాధారణంగా ఉగ్రవాద సంస్థలు వేటికవే విడివిడిగా ఆపరేషన్స్ చేపడతాయి. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఉగ్రకుట్రలు భగ్నమయ్యాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహా మరికొన్ని సంస్థలకు చెందిన ఉగ్రవాదులకు శిక్షలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగా ఐదు సంస్థలు ఏకకాలంలో దాడులు చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తోపాటు భారత్‌లో ఆపరేషన్స్ కోసం ఏర్పడిన అల్‌కాయిదా అనుబంధ సంస్థ అల్‌కాయిదా ఇండియన్ సబ్–కాంటినెంట్ (ఏక్యూఐఎస్), పాక్ ప్రేరేపిత హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌యూఎం), ఐఎం, లష్కరేతొయిబా (ఎల్ఈటీ)లు ఏకకాలంలో దాడులకు పథక రచన చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని, ఒక్కో తరహాలో ఏకకాలంలో విరుచుకుపడాలని భావిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. దీంతో గణతంత్ర దినోత్సవం ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి. -
పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్గాన్
56 మంది మృతి, వంద మందికిపైగా గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు. కాబూల్‌లోని పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో జరిగిన రెండు పేలుళ్లలో 38 మంది బలి కాగా, ఒక ఎంపీ సహా 72 మంది గాయపడ్డారు. మొదట ఆత్మాహుతి దాడి, తర్వాత కారు బాంబు దాడి జరిగాయి. మృతుల్లో పలువురు పౌరులు, జవాన్లు ఉన్నారు. తామే దాడులు చేశామని తాలిబాన్ ప్రకటించింది. మరోపక్క.. హెల్మాంద్ రాష్ట్ర రాజధాని లష్కర్ ఘాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చనిపోయారు. కాందహార్ రాష్ట్ర గవర్నర్ భవన ప్రాంగణంలో జరిగిన మరో పేలుడులో 9 మంది చనిపోగా, యూఏఈ రాయబారి అబ్దుల్లా కాబీ సహా 16 మంది గాయపడ్డారు. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయ్‌లాండ్
బ్యాంకాక్ : థాయ్‌లాండ్‌లోని పట్టని ప్రావిన్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్‌కు అతి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
ఆ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతులు!
బ్రస్సెల్స్: ఇటీవల బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘటన నుంచి బయటపడ్డారు. రొమేనియాకు చెందిన రొక్సానా స్టేఫాంకా, ఆమె రెండేళ్ల కూతురు ఇద్దరు మెట్రో స్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. రొక్సానా ముఖంపై కాలిన గాయలయ్యాయని, అయితే చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్టు వారి కుటుంబసభ్యులు కూడా వెల్లడించారు. మెట్రో రైలులో బాంబులు పేలిన ఘటనలో మొత్తంగా 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. రొక్సానా, తన భర్తతో కలిసి గత ఐదేళ్ల నుంచి బ్రస్సెల్స్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఆమె భర్త కంట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగవారం స్కూలుకు వెళ్లిన తన పెద్ద కూతురు(5)ను ఇంటికి తీసుకురావడానికి మెట్రో రైలులో ఆమె వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు వివరించింది. చివరగా తాను ప్రయాణిస్తోన్న ప్రదేశం చుట్టుపక్కల రక్తం ప్రవాహంలా కనిపించిందని, తన చిన్న కూతురు ఏడుస్తుండగా తాను స్పృహ కోల్పోయినట్లు రొక్సానా స్టేఫాంకా గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఆ తల్లీకూతురు ఇద్దరు చికిత్స పొందుతున్నారు. -
బాంబులు పేలుతున్నా వెనక్కి తగ్గలేదు
బ్రెస్సెల్స్: ఉగ్రవాదులు బాంబులు పేల్చుతున్నా లెక్కచేయకుండా ఎయిర్ పోర్ట్ ఉద్యోగి 7 మందిని కాపాడాడు. ఎయిర్ పోర్ట్ ఉద్యోగి అల్ఫాన్సో యౌలా ఒక్కసారిగా బ్రస్సెల్స్ హీరోగా మారిపోయాడు. బ్రస్సెల్స్‌లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. సెక్యూరిటీ గార్డుగా, లగేజీ గార్డుగా అల్ఫాన్సో పనిచేస్తుంటాడు. బాంబులు పేలుతున్న సమయంలో ఎయిర్ పోర్టు చెక్ ఇన్ డెస్క్ వద్ద ఉన్నాడు. బాంబు పేలుడు శబ్ధం విన్న వెంటనే అక్కడికి వెళ్లి ఏడుగురు ప్రయాణికుల్ని ఆ దాడుల నుంచి రక్షించాడు. డిపార్చర్ విభాగం వద్ద రెండు బాంబులు పేలిన వెంటనే స్పందించిన ఆ ఉద్యోగి స్వల్ప గాయాలపాలైన ఏడుగురిని అక్కడి నుంచి సురక్షిత ప్రారంతానికి తీసుకెళ్లి వారి ప్రాణాలను నిలబెట్టాడు. కొద్ది క్షణాల్లోనే ఎయిర్ పోర్టు రక్తసిక్తమైందని, తనకు దగ్గర్లో ఉన్న ఓ వ్యక్తి తన రెండు కాళ్లను కోల్పోయాడని, ఓ పోలీస్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని ఇంటర్వ్యూలో తెలిపాడు. చనిపోయిన 5 మంది వ్యక్తుల మృతదేహాలను బయటకు తీశానని ఆ దుర్ఘటన గురించి వివరించాడు. -
ఇండోనేసియాపై ఐఎస్ పంజా
అధ్యక్ష భవనానికి సమీపంలో విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు ఆధునిక ఆయుధాలు, గ్రెనేడ్లతో విధ్వంసం ఐదుగురు ఉగ్రవాదులు సహా ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు జకార్తా: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో పారిస్ తరహా దాడులకు తెగబడ్డారు. జకార్తా నడిబొడ్డున అధ్యక్ష భవనానికి దగ్గర్లో, అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు, ఐరాస సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతానికి గురువారం ఉదయం అత్యాధునిక ఆయుధాలు, గ్రెనేడ్లతో మోటార్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్టార్‌బక్స్ కేఫేలోకి చొచ్చుకువెళ్లారు. గ్రెనేడ్ దాడులతో ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. కేఫెలో ఒక కెనడియన్‌ను, అల్జీరియన్ను బందీలుగా పట్టుకున్నారు. వారిలో అల్జీరియన్ గాయాలతో తప్పించుకోగా, కెనడియన్‌ను కాల్చి చంపారు. బందీలను తప్పించేందుకు ప్రయత్నించిన ఒక ఇండోనేసియా దేశస్తుడిని కూడా చంపేశారు. ఇద్దరు ఉగ్రవాదులు అక్కడే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఒక ఉగ్రవాది కెఫేలో నుంచి బయటకు వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. రోడ్లు మృతులు, క్షతగాత్రుల దేహాలతో భీతావహంగా మారాయి. అదేసమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్‌లోనికి దూసుకెళ్లి తమను తాము పేల్చేసుకున్నారు. ఆ ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంమీద ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు సహా ఏడుగురు చనిపోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులందరూ హతమయ్యారని జకార్తా పోలీసులు ప్రకటించారు. జకార్తాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అమెరికాను ఉద్దేశిస్తూ.. మతయుద్ధం చేస్తున్న సంకీర్ణ దేశాల పౌరుల సముదాయం లక్ష్యంగా తమ కాలిఫేట్ సైనికులు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. ముస్లిం మెజారిటీ దేశమైనఇండోనేసియాలో బలంగా ఉన్న ఐఎస్ అనుబంధ సంస్థ ‘ఐఎస్ఐఎస్ నెట్వర్క్’ టైస్టులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ఇండోనేసియా పోలీస్ విభాగ అధికార ప్రతినిధి ఆంటన్ చార్లియన్ పేర్కొన్నారు. ఈ తరహా సమన్వయంతో దాడులు చేయగల సామర్ధ్యం ఐఎస్కే ఉందన్నారు. ఉగ్రవాదులెవరూ ఆత్మాహుతి దాడికి పాల్పడలేదని, పోలీసుల ప్రతికాల్పులలోనే హతమయ్యారని చార్లియన్ చెప్పారు. దాడి నేపథ్యంలో జకార్తా సహా దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఈ తరహా ఉగ్ర దాడులకు భయపడబోమని ఇండోనేసియా అధ్యక్షుడు జాకొ జొకోవి విడొడో స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేసియాలో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఐఎస్ తన వినాశనాన్ని తానే ఆహ్వానిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. రహస్య సంకేతం ఈ దాడుల గురించి నవంబర్లోనే ఉగ్రవాదులు ఒక రహస్య సంకేత భాషలో హెచ్చరికలు జారీ చేశారని చార్లియన్ వెల్లడించారు. ‘త్వరలో ఇండోనేసియాలో ఒక సంగీత కార్యక్రమం జరగబోతోంది. అది అంతర్జాతీయ వార్తగా మారుతుంది’ అన్న సందేశాన్ని పంపించారన్నారు. 2000- 2009 మధ్య ఇండోనేసియా పలు ఉగ్రదాడుల బాధిత దేశంగా నిలిచింది. 2002లో బాలిలో జరిగిన దాడిలో 202 మంది చనిపోయారు. అయితే, 2009 తరువాత దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై భద్రతాదళాలు ఉక్కుపాదం మోపడంతో ఉగ్రదాడులు తాత్కాలికంగా ఆగాయి. ఇండోనేసియాను తమ కీలక స్థావరంగా చేసుకునేందుకు ఐఎస్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇండోనేషియా
-
శాంతి ర్యాలీపై ఉగ్ర పంజా!
86 మంది బలి ♦ టర్కీ రాజధాని అంకారాలో పేలుళ్లు ♦ 186 మందికి గాయాలు ♦ ఆత్మాహుతి దాడి అని అనుమానం అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు శనివారం పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో 86 మంది మృతిచెందగా మరో 186 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 24 మంది కన్నుమూసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యూజినోగ్లు తెలిపారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. పేలుళ్లను ఉగ్రవాదుల ఘాతుకంగా అనుమానిస్తున్నామని...ఇందులో ఆత్మాహుతి దళ సభ్యుడి ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. తొలుత ఓ భారీ పేలుడు సంభవించిన కాసేపటికే మరో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ల అనంతరం ఘటనాస్థలి వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. చేయిచేయి కలిపి నవ్వుతూ నృత్యాలు చేస్తున్న నిరసనకారులంతా తొలి పేలుడు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలను స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు వందలాది మంది రక్తదానానికి ఆస్పత్రులకు తరలి వెళ్లారు. అంకారా నగర చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడిని దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఖండించారు. దేశ ప్రజల ఐక్యత, శాంతిని దెబ్బతీసే లక్ష్యంతో పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సైతం ఈ దాడిని ఖండించారు. నాటో సభ్య దేశమైన టర్కీలో నెలకొన్న అనిశ్చితిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదంపై పోరులో టర్కీ ఏకతాటిపై నిలబడాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) విదేశాంగ విధానం చీఫ్ ఫెడెరికా మోఘెరినీ సూచించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ పేలుళ్లు ఇప్పటికే కుర్దు మిలిటెంట్లపై ప్రభుత్వ అణచివేతతో పెరుగుతున్న ఉద్రిక్తతలను మరింత రాజేశాయి. కాగా, అంకారాలో జంట పేలుళ్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్లు ట్వీట్ చేశారు. -
బాంబుల మోత : గ్రామస్తుల ఆందోళన
అవుకు (కర్నూలు) : కాల్వ నిర్మించేందుకు బాంబులు ఉపయోగించడంతో వాటి ధాటికి సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భాగంగా మంగళవారం బాంబులతో పనులు చేస్తున్నారు. కాగా బాంబుల మోతతోపాటు పేలుడు సంభవించినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు గ్రామంలోకి ఎగిరిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ రాయి తగులుతుందోనని గ్రామస్తులు ఆందోళన ఉన్నారు. -
గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు
అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. -
వెంటాడే పీడకల
గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్లకు ఎనిమిదేళ్లు సుల్తాన్‌బజార్: కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు.. కానీ ఎనిమిదేళ్లు గడిచినా ‘జంట పేలుళ్ల’ ఘటనను మాత్రం ప్రజలు మరిచిపోలేక పోతున్నారు. నిద్దురలోనూ ఉలికిపడుతున్నారు. 2007లో ఆగష్టు 25న సాయంత్రం 7.45 గంటలకు కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు లేజర్ షో చూస్తున్నవారిపై ఐఎస్ఐ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు విసిరిన పంజా విసిరారు. ఈ ఘటనలో 44 మంది అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు. ఇన్నేళ్లు గడిచినా స్థానికుల్లో ఇంకా భయం వీడలేదు. జంట బాంబు పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించారు. ైవె ఎస్ అకాల మరణంతో కొంతమంది బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. నాయకులు ఏటా ఈ ప్రాంతాలకు వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు గాని బాధితులకు సాయం మాత్రం చేయడంలేదు. ప్రతి సంవత్సరం కోఠిలోని గోకుల్ చాట్‌కు బాధితులు వచ్చి వైఎస్సార్ బతికుంటే తమకు న్యాయం జరిగేదని కన్నీరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. నేటి పాలకులైనా జంట పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. జంట పేలుళ్లలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని గత ఏడేళ్లుగా గోకుల్‌చాట్ యాజమాని ప్రేంచంద్ విజయవర్గి దుకాణాన్ని బంద్ చేస్తున్నారు. మంగళవారం సైతం గోకుల్‌చాట్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ శబ్దం నేటికీ ప్రతిధ్వనిస్తోంది ఆనాడు గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుడు శబ్దం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అ సమయంలో నేను వెనుక వైపు ఉండడంతో బతికి బయటపడ్డాను. ఎక్కడ ఏ శబ్దం విన్నా ఆ బాంబు పేలుళ్ల శబ్దాలే గుర్తుకువచ్చి గుండె జల్లుమంటుంది. ఇలాంటి ఘటనతో మేము ప్రైవేటు సెక్యూరిటీతో పాటు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి భయం మాత్రం పోవడంలేదు. - ప్రేంచంద్, గోకుల్‌చాట్ యాజమాని ఆ రోడ్డున వెళ్లాలంటే భయం.. ఇప్పటికీ గోకుల్‌చాట్ భండార్‌కు వెళ్లాలంటే ఆనాటి ఘటన గుర్తుకు వచ్చి భయంగా ఉంటుంది. ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారిని నా చేతులతో ఆటోలు, కార్లు, బస్సుల్లో తరలించా. కొందరు అవయవాలు తెగిపడి గిలగిలా కొట్టుకుంటూ నా చేతుల్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. - సునీల్ బిడ్లాన్, కుత్బిగూడ -
అమెరికాలో శిక్షణకు విశాల్ గున్నీ
హైదరాబాద్ సిటీ: విశాఖపట్నం జిల్లా ఓఎస్డీ (ఆపరేషన్స్)గా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అమెరికాలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి వర్జీనియా రాష్ట్రంలో ‘ఏటీఏ-11238’ పేరుతో జరిగే ‘పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. బాంబు పేలుళ్లు వంటివి చోటు చేసుకున్న సందర్భాల్లో పేలుడు తరువాత దర్యాప్తులో అనుసరించాల్సిన ఆధునిక విధివిధానాలను బోధించనున్నారు. -
రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన భర్త లొంగిపోయిన కారణంగా ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ యాకూబ్ భార్య రహీన్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో యాకూబ్ ఉరిశిక్ష అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న అతడికి ఉరిశిక్ష వేయాలని కోర్టు గతంలోనే తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. -
ముంబై.. ‘నో ఫ్లయింగ్ జోన్’
- ‘లోకల్ రైళ్ల పేలుళ్ల’కు 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పోలీసు శాఖ నిర్ణయం - బీఏఆర్సీ ఘటనతో నగరవ్యాప్తంగా అప్రమత్తం - ఆగస్టు 4 వరకు ఆంక్షలు కొనసాగింపు సాక్షి, ముంబై: తాజాగా బీఏఆర్సీలో డ్రోన్ ఘటన, 2006 జూలై 6 వరస బాంబు పేలుళ్లకు 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉగ్రదాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (కేంద్ర నిఘా సంస్థ) హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. నెల రోజులపాటు ముంబైని ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లు, పారా గ్లైడింగ్ తదితరాలపై నిషేధం విధించింది. రెండు రోజుల కిందట ముంబై (ట్రాంబే) లోని బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ (బీఏఆర్సీ) పరిసరాల్లో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు డ్రోన్ ప్రయోగించి బీఏఆర్సీ ఫొటోలు తీసుకుని కారులో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన బీఏఆర్సీ అధికారులు కారు నంబరుతోసహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. డ్రోన్, పారా గ్లైడింగ్ ద్వారా ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందన్న నిఘా సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీ వరకు ముంబైని నో ఫ్లయింగ్ జోన్ పోలీసు శాఖ ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ అత్యవసరమైతే పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని డ్రోన్, పారా గ్లైడింగ్ ప్రయోగించవచ్చని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ బార్కుండ్ తెలిపారు. 11/7 దుర్ఘటనకు తొమ్మిదేళ్లు 2006 జూలై 11న (11/7) కేవలం ఎనిమిది నిమిషాల్లో ఏడు లోకల్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 188 మంది ప్రయాణికులు చనిపోగా, 847 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పరాగ్ సావంత్ ఒకరు. తొమ్మిది ఏళ్లుగా కోమాలో ఉండి వృుత్యువుతో పోరాడిన పరాగ్, ఈ నెల ఏడో తేదీన తుది శ్వాస విడిచాడు. వరుస బాంబు పేలుళ్లకు శనివారంతో తొమ్మిది ఏళ్లు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరే ప్రమాదం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసు శాఖ ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమైంది. -
మావోయిస్టుల దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రత దళాలను లక్ష్యంగా చేసుకుని వేర్వేరు ప్రాంతాలలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా ఫండ్రీ గ్రామ సమీపంలో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ జవాన్లు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయాని గమనించిన మావోయిస్టులు అప్పటికే ఆ ప్రాంతంలో అమర్చిన బాంబులు పేల్చారు. అలాగే ఫండ్రీ హీల్స్ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రత దళాలే లక్ష్యంగా బాంబు పేల్చేరు. ఈ రెండు ఘటనలో 199వ బెటాలియన్‌కు చెందిన ఎస్ఐ బి.బి.ఆయ్, కానిస్టేబుల్ రవి హరి పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. సహచరులు వెంటనే వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని హెలికాప్టర్లో రాయ్‌పూర్ తరలించారు. అయితే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు బీజాపూర్ ఏఎస్పీ ఇంద్ర కల్యాణ్ వెల్లడించారు. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు, ఉగ్ర కార్యకలాపాల్లో కీలకుడిగా వ్యవహరిస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అఫక్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు పేలుళ్లతో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాంబులను కూడా తానే తయారు చేసినట్లు అఫక్ ఒప్పుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతోనూ అఫక్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. కాగా అఫక్‌ను హైదరాబాద్ పోలీసులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు అఫక్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు రానున్నారు. కాగా డిసెంబర్ 27న బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
అది ఉగ్రవాదుల దాడే: కిరెన్ రిజ్జూ
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆదివారం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని హోంశాఖ స్పష్టం చేసింది. సోమవారం మీడియాతో మాట్లాడిన హోంశాఖ సహోయమంత్రి కిరణ్ రిజ్జూ.. ఆ దాడి ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిందేనని తెలిపారు. అయితే ఆ బాంబు దాడి ప్రభావం తక్కువ ఉండటంతో పెద్దగా ప్రాణం నష్టం జరగలేదన్నారు. ఆ దాడి వెనుక సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మరణించిగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. -
బెంగళూరులో బాంబు పేలుళ్లు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడుతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో వారాంతాల్లో జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో చర్చి స్ట్రీట్ ఒకటి. ఈ ప్రాంతంలోని కోకోనట్ క్రో రెస్టారెంట్ వద్ద ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలింది. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు భవానీ దేవి(38), కార్తిక్ (23) గాయపడ్డారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరితో పాటు సందీప్, మరో వ్యక్తి సైతం గాయపడ్డారు. భవానీదేవికి తలకు తీవ్ర గాయమైంది. సందీప్ వెన్నెముకకు, కార్తీక్ కాలికి గాయాలయ్యాయి. వీరిలో భవానీ దేవి, కార్తీక్‌లను మాల్యా ఆస్పత్రిలో, సందీప్ హోస్తాత్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో భవానీదేవి మరణించారు. నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్‌రెడ్డి మాట్లాడుతూ పేలుడుకు ఐఈడీని వాడి ఉండొచ్చన్నారు. తక్కువ తీవ్రత ఉన్న బాంబ్ కావడం వల్ల విస్ఫోటన తీవ్రత తక్కువగా ఉందన్నారు. పేలుడు వెనక సిమి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నామన్నారు. ప్రజలు ఏటా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ఈ ప్రాంతంలో పేలుడు జరగడం గమనార్హం. -
బెంగళూరులో బాంబు పేలుళ్లు
-
బాంబుల
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి కూత వేటు దూరంలోని ఇడిందకరై ఉదయాన్నే నాటు బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. అణువ్యతిరేకులు, అణు మద్దతుదారులు నువ్వా..నేనా అన్నట్టుగా ఢీ కొనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం నాటు బాంబుల్ని రువ్వుకోవడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 30 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నాయి. సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం మూడేళ్లుగా సాగుతూ వస్తోంది. ఈ ఉద్యమానికి ఉదయకుమార్, పుష్పరాయన్, జేసురాజ్ నేతృత్వం వహిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఉద్యమం గత ఏడాది రెండుగా చీలింది. ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, అణు విద్యుత్ కేంద్రానికి మద్దతుగా ఆ ప్రాంతానికి చెందిన స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా ఓ గ్రూపు బయలు దేరింది. ఇడిందకరై వేదికగా అణు వ్యతిరేక ఉద్యమం, ఆ సమీపంలోని కూత్తంకులిలో అణు విద్యుత్‌కు మద్దతుగా తరచూ సభలు జరుగుతూ వస్తున్నాయి. వివాదం: కూత్తంకులికి చెందిన కొన్ని కుటుంబాలు ఇటీవల ఇడిందకరై పరిధిలోని సునామీ కాలనీలో చేరాయి. దీంతో ఆ కాలనీలోని అణు వ్యతిరేక గ్రూపునకు, అణు మద్దతుదారులుగా చెప్పుకుంటున్న గ్రూపునకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు గ్రూపులతో అణు కేంద్రానికి భద్రత ప్రశ్నార్థకం అవుతోంది. ఈ సమయంలో కొన్ని నెలల క్రితం కూత్తంకులికి చెందిన వారు నాటు బాంబులు తయారు చేస్తుండగా జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించడం పెను కలకలాన్ని సృష్టించింది. దీంతో ఆ పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. అయినా, తరచూ నాటు బాంబుల మోత వినిపించడం, పేలని బాంబులు లభించడం పరిపాటిగా మారింది. బాంబుల మోత: ఇన్నాళ్లు సునామీ కాలనీలో పేలుతూ వచ్చిన నాటు బాంబులు సోమవారం ఉదయాన్నే ఇడిందకరైను దద్దరిల్లేలా చేశాయి. అణు మద్దతు గ్రూపు, అణు వ్యతిరేక గ్రూపులు అక్కడి మాతా ఆలయం వద్ద ఢీ కొట్టాయి. ఆలయం వెనుక వైపు నుంచి అణు మద్దతుదారులు, ముందు వైపు నుంచి వ్యతిరేకులు తొలుత రాళ్లు రువ్వుకున్నారు. కాసేపటికి వివాదం ముదరడంతో నాటు బాంబుల మోతతో ఆ పరిసరాలు దద్దరిల్లాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు మాత్రం కాలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు. వరుస బాంబుల మోత సమాచారం తిరునల్వేలి జిల్లా ఎస్పీ రాజేంద్రనాయర్కు చేరింది. దీంతో హుటాహుటిన బలగాలు ఇడిందకరైకు ఉరకలు తీశాయి. వళ్లియూరు డీఎస్పీ బాలాజీ నేతృత్వంలో కొన్ని బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులను చూసిన ఇరువర్గాలు పలాయనం చిత్తగించాయి. క్షణాల వ్యవధిలో ఆ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. పేలకుండా పడి ఉన్న 30 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలగాల మోహరింపు : వెళ్తూ వెళ్తూ ఓ గ్రూపు మరో గ్రూపు ఇంటిపై బాంబులు విసరడంతో ఆ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. అదృష్ట వశాత్తు ఆ ఇంట్లో ఉన్న వాళ్లెవ్వరికీ ఏమీ కాలేదు. వరుస బాంబుల మోతను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ, ఆర్టీవో తదితర అధికారులు కూడంకుళం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బలగాల్ని రంగంలోకి దించి, అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కూడంకుళం వైపుగా వెళ్లే ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయితే, ఈ గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అణు ఉద్యమ నేతలు ప్రకటించడం గమనార్హం. -
రెడ్ అలర్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈనెల ఒకటో తేదీన జంట పేలుళ్లు చోటుచేసుకోవడం, అదే సమయంలో రాష్ట్రంలో పలువురు తీవ్రవాదులు పట్టుబడటం అధికారులను ఆందోళనలో పడేశాయి. పేలుళ్ల నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తలమునకలై ఉండగా విమానాశ్రయాలు, సెంట్రల్ స్టేషన్లోనూ, రాణీపేట పారిశ్రామికవాడలోనూ బాంబుల ప్రచారం కలకలం రేపింది. దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, మంగళూరు, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కారుబాంబు ద్వారా పేలుళ్లకు పాల్పడనున్నట్లు సమాచారం వచ్చినందున అప్రమత్తంగా ఉండాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దక్షిణ మండల సహాయ కమిషనర్ శరత్ శ్రీనివాస్ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు ఆయన అధికారిక ఆదేశాలతో ఉత్తరాలు రాశారు. ఈ ఆదేశాలతో చెన్నై విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో వేళ్లేందుకు ఉన్న రెండు మార్గాలను ఒకటిగా చేశారు. లోనికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పార్కింగ్లోని వాహనాలను సైతం తనిఖీ చేసి ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నాలుగు మూలలా ఎత్తై ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని బైనాక్యులర్స్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ సాగిస్తున్నారు. సివిల్ పోలీసులను నియమించి ఐదంచల బందోబస్తును ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ పోలీసు కంట్రోల్ రూముకు ఉదయం 9.30 గంటలకు ఒక ఆగంతకుడు ఫోన్ చేశాడు. ప్లాట్‌ఫాం టిక్కెట్ బుకింగ్ కౌంటర్ సమీపంలోని టాయిలెట్ల వద్ద బాంబులు అమర్చామని, వాటిని పేల్చివేసేందుకు ఇద్దరు తీవ్రవాదులు రైల్వే స్టేషన్లోనే ఉన్నారని చెప్పి ఫోన్ కట్‌చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకుల పరుగులతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా బాంబు డిటెక్షన్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. సుమారు మూడు గంటల పాటు సెంట్రల్ అంతా వెతికారు. ప్రయాణికులను తీవ్రంగా తనిఖీ చేసి ఏమీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆగంతకుల ఫోన్లన్నీ తాంబరం నుండి రావడంతో ఆ ప్రాంతాల్లో అనుమానితులను వెతుకుతున్నారు. వేలూరు జిల్లా రాణిపేట సిప్కాట్ పారిశ్రామిక వాడ బాంబు భయంతో వణికిపోయింది. సెల్‌ఫోన్ బాంబుగా అమర్చిన ఒక వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని నిర్వీర్యం చేసి పరిశోధనకు పంపారు. -
పేలుళ్ల అనుమానితుడి వీడియో విడుదల
* రైలు దిగి పరిగెత్తిన అనుమానితుడు * తమిళనాడు సీబీసీఐడీ వెల్లడి * బాంబులను బెంగళూరులో అమర్చి ఉండొచ్చని అనుమానం చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం బెంగళూరు- గువాహటి రైల్లో జరిగిన రెండు బాంబుల పేలుళ్లకు సంబంధించి కీలక అనుమానితుడి వీడియో ఫుటేజీని శుక్రవారమ్కిడ విడుదల చేశారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో దర్యాప్తులో తొలి ఆధారం దొరికినట్లు భావిస్తున్నారు. తమిళనాడు సీబీసీఐడీ ఐజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పుటేజీని విడుదల చేశారు. ‘కొన్ని వీడియో దృశ్యాల్లో కనిపించిన వ్యక్తి కదలికలు అసాధారణంగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయాలి’ అని అన్నారు. వీడియో ఫుటేజీలో.. బట్టతలలో ఉన్న మధ్యవయస్కుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. రైలు తొమ్మిదో నంబర్ ఫ్లాట్‌ఫారమ్ చేరుకున్నాక అతడు.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 బోగీల పక్కనున్న ఎస్3 బోగీ నుంచి హడావుడిగా రైలు దిగి పరిగెత్తాడు. అతడు చెన్నైలో రైలు ఎక్కలేదని ఐజీపీ స్పష్టం చేశారు. ఈ అనుమానితుడి సమాచారాన్ని సీబీసీఐడీ కంట్రోల్ రూమ్ నంబర్లు 044-22502510/ 22502500, 77086 54202లకు తెలియజేయాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. పేలుళ్లకు వాడిన బాంబులను చెన్నైలో అమర్చలేదని, వాటిని చెన్నైకి ముందు స్టేషన్లలో పెట్టి ఉండొచ్చని ఐజీపీ తెలిపారు. ముష్కరుల లక్ష్యం కూడా చెన్నై కాదని తెలుస్తోందన్నారు. రైలు ఆలస్యం కాకుండా షెడ్యూలు ప్రకారం నడిచి ఉంటే ఉదయం ఏడింటికి అది ఆంధ్రప్రదేశ్‌లో ఉండేదన్నారు. పేలిన బాంబులకు కొన్ని నెలల కిందటి పాట్నా పేలుళ్లకు వాడిన బాంబులతో పోలికలు ఉన్నాయన్నారు. బాంబుల లక్ష్యం గురువారం ఆంధప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనా అని అడగ్గా, టార్గెట్‌పై నిర్దిష్ట సమాచారమేదీ లేదన్నారు. పేలుళ్ల స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. బెంగళూరులో తమిళనాడు సీబీఐసీఐడీ సాక్షి, చెన్నై/బెంగళూరు: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలిన రెండు బాంబులను బెంగళూరులో అమర్చి ఉంటారని తమిళనాడు సీబీసీఐడీ అనుమానిస్తోంది. తక్కువ తీవ్రత గల టైమర్ బాంబులను రైలు బెంగళూరులో బయల్దేరడానికి ముందు అమర్చి ఉండొచ్చని తమిళనాడు సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దుండగులకు కర్ణాటకలోని నిద్రాణ ఉగ్ర వాద ముఠాలు సహకరించి ఉండొచ్చని సమాచారం అందడంతో తమిళనాడు సీబీసీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం బెంగళూరు చేరుకుంది. సిటీ రైల్వే స్టేషన్లో గురువారం నాటి సీసీటీవీ వీడియోలను పరిశీలించింది. పేలుళ్లు జరిగిన ఎస్-4, ఎస్-5ల బోగీల్లో ప్రయాణించిన 74 మంది పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించింది. ఈ పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోగా, 14 మంది గాయపడడం తెలిసిందే. ఎన్ఎస్జీ బృందం చెన్నైకి చేరుకుని పేలుళ్ల స్థలాన్ని, పేలుళ్లు జరిగిన రెండు బోగీలను పరిశీలించింది. గురు, శుక్రవారాల్లో చెన్నైలో ఓ షాపింగ్ మాల్, విద్యాసంస్థ, సబర్బన్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాయి. విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఫోన్స్ కాల్స్ నకిలీవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో మరిన్ని పేలుళ్లకు కుట్ర: రైల్లో పేలుళ్ల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు రాష్ట్రంలో జరిపిన తనిఖీల్లో 15 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు చెన్నైల్లో మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నారని అనుమానిస్తున్నారు. గత నెల 29న అరె స్టు చేసిన శ్రీలంకకు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పోలీసుల విచారణలో.. చెన్నైలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. శ్రీలంకకు చెందిన శివబాలన్(39)ను టీ నగర్లో, మహమ్మద్ సలీం(37)ను రాయపురంలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని, రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అషఫ్ ్రఆలీని, అతని అనుచరులుగా భావిస్తున్న 12 మందిని కడలూరు జిల్లా పరంగిపేట్టైలోని ఓ ఇంట్లో అరెస్ట్ చేశారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్సుఖ్నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
దిల్సుఖ్నగర్’ కేసులో మరో అరెస్టు
రాజస్థాన్‌లో పట్టుబడిన ఉగ్రవాది వఖాస్ బాంబుల తయారీలో ఇతడు దిట్ట 107 బస్టాప్ వద్ద బాంబు పెట్టిందీ ఇతడే మరిన్ని కుట్రలు భగ్నం చేసిన ఢిల్లీ కాప్స్ సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న జంట బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ విధ్వంసానికి కారణమైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, పాకిస్థానీ వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. వఖాస్‌తో సహా మొత్తం నలుగురిని ఆదివారం ఢిల్లీ తరలించి.. కోర్టు అనుమతితో పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. పాక్ టు భారత్ వయా నేపాల్... పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా చేశాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ద్వారా ఉగ్రవాదం బాటపట్టాడు. ఆ సంస్థలో శిక్షణ పొందాడు. ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు. 2010లో నేపాల్‌లోని ఖాట్మండ్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి, తెహసీన్ అక్తర్‌తో జతకట్టాడు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌ల్లో జరిగిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన వఖాస్ గతేడాది యాసీన్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌లతో కలిసి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాలుపంచుకున్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. ఈ పనిని అసదుల్లా అక్తర్, వఖాస్‌లకు అప్పగించాడు. ముందు షెల్టర్ ఏర్పాటు చేసుకోమని చెప్పి మంగుళూరుకు పంపాడు. పేలుళ్లకు అవసరమైన నగదు, పేలుడు పదార్థాలు అందుకున్నాక ఈ ఇద్దరూ తెహసీన్ అక్తర్‌తో కలిసి రంగంలోకి దిగారు. ముందు రెక్కీ... దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం తెహసీన్ అక్తర్ 16 రోజుల ముందు ఇక్కడికి చేరుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఫిబ్రవరి 10న ఓసారి సిటీకి వచ్చి వెళ్లిన అసదుల్లా అక్తర్.. విధ్వంసం సృష్టించడానికి వారం ముందు వఖాస్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ముగ్గురూ కలిసి మలక్‌పేట, అబిడ్స్, దిల్సుఖ్నగర్ల్లోని అనేక జనసమర్థ ప్రాంతాల్లో రెక్కీ చేశారు. చివరకు దిల్‌సుఖ్‌నగర్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఫిబ్రవరి 20న రెండు పాతసైకిళ్లు కొని మలక్‌పేట్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో దాచారు. టైమ్ చాలక ‘107’లో పెట్టేసి... బాంబుల తయారీలో దిట్ట అయిన వఖాస్ దిల్సుఖ్నగర్ బాంబుల తయారీ బాధ్యతల్ని తీసుకున్నాడు. బి-డే (బ్లాస్డ్ డే) అయిన ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ప్రెషర్‌కుక్కర్ బాంబుల తయారీ పూర్తి చేశాడు. వాటిని అట్ట పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్కింగ్‌లో ఉన్న సైకిళ్ల క్యారేజ్‌పై బాంబులున్న పెట్టెలు కట్టి.. అక్కడి నుంచి దిల్సుఖ్నగర్ బయలురేరారు. నల్లగొండ చౌరస్తా దాటాక ఏడు గంట లకు పేలే విధంగా బాంబుల్లోని టైమర్‌ను సెట్ చేశారు. తెహసీన్ అక్తర్, వఖాస్ చెరోసైకిల్పై దిల్సుఖ్నగర్ చౌరస్తా వైపు బయలుదేర గా... అసదుల్లా అక్తర్ గడ్డిఅన్నారం చౌరస్తా వద్దే ఉండిపోయాడు. తెహసీన్ నేరుగా వెళ్లి ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్‌ను పార్క్ చేశాడు. వెనుక వచ్చిన వఖాస్‌కు మద్యం దుకాణం వ రకు వెళ్లే లోపే బాంబు పేలిపోవచ్చని భావిం చాడు. వెంటనే టార్గెట్‌ను మార్చుకొని 107 బస్టాప్ సైకిల్ పెట్టి వెళ్లిపోయాడు. పేలుళ్ల అనంతరం నేరుగా మంగుళూరు వెళ్లిపోయిన వఖాస్... ఎప్పటికప్పుడు తన స్థావరాలు మా రుస్తూ తలదాచుకున్నాడు. గతేడాది ఆగస్టులో యాసీన్, అసదుల్లాలను నిఘా వర్గాలు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని రక్సల్ వద్ద అరెస్టు చే శాయి. వీరి విచారణలోనే మొత్త ఆపరేషన్ వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు రియాజ్ భత్కల్ను ప్రధాన నిం దితుడిగా (ఏ-1)గా, యాసీన్‌ను ఐదో నింది తుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్లను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఈ మే రకు ఇటీవలే అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆరు రాష్ట్రాల్లో తలదాచుకుని... యాసీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భా రత్‌లోనే ఉన్నాడని కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరు సీరియల్ పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వఖాస్‌ను వారి విచారణ పూర్తయ్యాక పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. -
23 మంది ఉగ్రవాదులపై అభియోగాల నమోదు
ఐదేళ్ల కిందట ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో జరిగిన బాంబు పేలుళ్లకు ముందు వాటికి బాధ్యత వహిస్తూ ఈమెయిల్స్ పంపిన కేసులో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన వారుగా అనుమానిస్తున్న 23 మందిపై ఇక్కడి కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో వీరిపై విచారణకు మార్గం సుగమమైంది. వీరు పేలుళ్లకు ముందే ముంబై నుంచి మీడియా సంస్థలకు, ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపినట్లు ఆరోపణలున్నాయి. ముంబై పోలీసులు అరెస్టు చేసిన వీరితోపాటు, పరారీలో ఉన్న రియాజ్, ఇక్బాల్ భత్కల్ సహా ఐదుగురిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం కోర్టు జడ్జి ‘దేశంపై యుద్ధం’ తదితర 29 నేరాల కింద అభియోగాలు నమోదు చేశారు. -
బాగ్దాద్‌లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న రెండు బాంబులు శుక్రవారం నాడు సఫారర్త్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్‌లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని, పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సున్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ బాంబుదాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇరాక్‌లో హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన సంఘటనలలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు. -
'పేదరికాన్ని తరిమికొట్టేందుకు హిందూ, ముస్లింలు ఏకం కావాలి'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మోడీ పాల్గొనే హుంకార్ ర్యాలీ సభలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా.. ఆయన ఆ సభలో పాల్గొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సభలో నరేంద్రమోడీ ఉద్వేగంగా ప్రసంగించారు. హుంకార్ ర్యాలీకి లక్షలాది మంది హాజరయ్యారు. హుంకార్ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీహార్ కు ప్రత్యేక స్థానం ఉందని, బీహార్ లేకుండా దేశంలో ఎలాంటి మార్పు సాధ్యం కాదని అన్నారు.దేశానికి జయప్రకాశ్ నారాయణ్ లాంటి మహానాయకుడిని బీహార్ అందించిందని చెప్పారు. జయప్రకాశ్ చేయి పట్టుకుని రాజకీయాల్లో నడిచే మహాభాగ్యం తనకు లభించిందని తెలిపారు. తన ప్రసంగం ఆరంభంలో నితీష్ ను టార్గెట్ చేసిన మోడీ.. ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. జయప్రకాశ్ నారాయణ సిద్దాంతాలను తుంగలో తొక్కిన నితీష్ కు బీజేపీని వదిలిపెట్టడం అంత కష్టమేమీ కాదు అని మోడీ అన్నారు. బీజేపీని వ్యతిరేకించి నితీష్ కాంగ్రెస్ తో కుమ్మక్కైనారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జీవితాంతం రాం మనోహర్ లోహియా పోరాటం చేశారని, లోహియాను ఆరాధించిన వాళ్లే ప్రస్తుతం ఆయన సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచారంటూ నితీష్, లాలూను పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ తో కుమక్కైన నితీష్ ను జయప్రకాశ్, రాం మనోహర్ లోహియా ఆత్మలు క్షమించవని అన్నారు. అవకాశం వచ్చినపుడల్లా లాలూ నన్నువిమర్శించడానికి ఎన్నడూ వెనుకాడలేదు.. మోడీని ఎన్నడూ ప్రధాని మంత్రిని కానివ్వనూ అని లాలూ అన్నారు.. తనను విమర్శించిన లాలూ.. ఓసారి ప్రమాదానికి గురైప్పుడూ ఫోన్ లో పరామర్శించాను అని మోడీ తెలిపారు. తాను రైళ్లలో టీ అమ్ముకునే స్థితి నుంచి ఈ హోదాకు చేరుకున్నానని.. రైళ్లలో టీ అమ్ముకునే వారి బాధలు తనకంటే ఏ రైల్వే మంత్రికి కూడా తెలియవు అని అన్నారు. రాజకీయాల్లో హిపోక్రసికి కూడా ఓ హద్దు ఉంటుంది అన్నాడు. మోడీ ఎన్ని రకాల అవమానాలకు గురైనా కాని.. బీహార్ లో మరోసారి ఆటవిక రాజ్యం రాకూడదని కోరుకుంటున్నాని అన్నారు. తన ప్రసంగంలో ఆద్యంతం యాదవ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పా్ర్టీని తరిమి కొట్టేందుకు పాట్నాలోని గాంధీ మైదానం నుంచే సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వ పాలనకు పదేళ్లు పూర్తికానుంది అయితే గత ఎన్నికల్లో వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అని.. కాని తన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇది ర్యాలీ కాదని.. చరిత్రను మార్చే ఓ వేదిక అని వ్యాఖ్యానించారు. పేదరికాన్ని తరిమికొట్టాలంటే హిందూ, ముస్లింలు ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. మోడీ పాల్గొన్న వేదిక సమీపంలోనే ఐదు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పాట్నాలో ఆరు బాంబు పేలుళ్లు సంభవించాయి. -
పేదరికాన్ని తరిమికొట్టేందుకు హిందూ,ముస్లీంలు ఏకం కావాలి: మోడీ
-
బుద్ధగయ పేలుళ్ల కేసులో పూజారి అరెస్టు
బీహార్‌లోని బుద్ధగయ మహాబోధి ఆలయంలో సంభవించిన పేలుళ్ల కేసులో ఓ పూజారిని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అనూప్ బ్రహ్మచారి అనే పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్లు జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మచారిని రాష్ట్ర పోలీసుల సాయంతో ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. అనూప్ బ్రహ్మచారిని ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా గయ పట్టణంలోని రాంపూర్ పోలీసు స్టేషన్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఎన్ఐఏ బృందం విచారించనుంది. జూలై ఏడో తేదీన మహాబోధి ఆలయంలో జరిగిన పేలుళ్లలో మొత్తం పది బాంబులు పేలగా, మరో మూడింటిని ముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బుద్ధగయ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సహా పలువురిని ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా విచారించాయి. వినోద్ మిస్త్రి అనే అనుమానితుడితో సహా ఆరుగురిని ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. తాజాగా పూజారిని అరెస్టు చేసింది.