అవుకు (కర్నూలు) : కాల్వ నిర్మించేందుకు బాంబులు ఉపయోగించడంతో వాటి ధాటికి సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భాగంగా మంగళవారం బాంబులతో పనులు చేస్తున్నారు. కాగా బాంబుల మోతతోపాటు పేలుడు సంభవించినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు గ్రామంలోకి ఎగిరిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ రాయి తగులుతుందోనని గ్రామస్తులు ఆందోళన ఉన్నారు.