బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయ్లాండ్ | One killed, 30 injured in bomb blasts in Thailand | Sakshi
Sakshi News home page

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయ్లాండ్

Published Wed, Aug 24 2016 3:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

One killed, 30 injured in bomb blasts in Thailand

బ్యాంకాక్ : థాయ్లాండ్లోని పట్టని ప్రావిన్స్లో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.  మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్కు అతి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement