అమెరికాలో శిక్షణకు విశాల్ గున్నీ | IPS officer Vishal gunni to be attended for US training programe | Sakshi
Sakshi News home page

అమెరికాలో శిక్షణకు విశాల్ గున్నీ

Published Tue, Aug 11 2015 8:26 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

IPS officer Vishal gunni to be attended for US training programe

హైదరాబాద్ సిటీ: విశాఖపట్నం జిల్లా ఓఎస్డీ (ఆపరేషన్స్)గా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అమెరికాలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్కడి వర్జీనియా రాష్ట్రంలో ‘ఏటీఏ-11238’ పేరుతో జరిగే ‘పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. బాంబు పేలుళ్లు వంటివి చోటు చేసుకున్న సందర్భాల్లో పేలుడు తరువాత దర్యాప్తులో అనుసరించాల్సిన ఆధునిక విధివిధానాలను బోధించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement