Vishal gunni
-
విధి నిర్వహణలో భాగంగా... జత్వానీని విచారించడం తప్పా?
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచి్చన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు? జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. -
టాటా, గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్‌ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2న చేపట్టనుంది.విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దు..జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
స్పా ముసుగులో వ్యభిచారం
విజయవాడ స్పోర్ట్స్: నగరంలోని కొన్ని స్పా, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని శనివారం వెల్లడించారు. విజయవాడలో 200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు. కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆయా సెంటర్లపై వారం రోజులుగా నిఘా పెట్టామన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో శుక్రవారం రాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్నెస్ ఫిట్నెస్ సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారితోపాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. -
ఏపీ యువకులకు డీజీపీ విజ్ఞప్తి.. ఆ తప్పు చేయొద్దు..!!
-
ఏపీలో పలువురు ఎస్పీల బదిలీలు
విజయవాడ: ఏపీలో పలువురు ఎస్పీలు బదిలీ అయ్యారు. కోనసీమ జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్ రెడ్డి, మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్‌గా కెవి సుబ్బారెడ్డి , కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, విజయవాడ డీసీపీగా విశాల్ గున్నీ, కర్నూల్ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్‌లు బదిలీ అయ్యారు. -
అమరావతి సభను ప్రశాంతంగా జరపండి
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చామని గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. సభను అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులే వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. -
పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదు
గుంటూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీసులపై పలు రకాలుగా ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగు పులమడం సరికాదని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంకు చెందిన బాణావత్ యలమంద నాయక్‌ను ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమారుడు ప్రసన్నకుమార్‌కు సీఆర్పీసీ నోటీసును అందజేసిన తర్వాతనే రెవెన్యూ అధికారి సమక్షంలో పోలీసులు అరెస్టు చేశారన్నారు. లిక్కర్ కేసులో నాయక్ ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిన అనంతరం చర్యలు చేపట్టామన్నారు. కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడామని చెప్పడం సరికాదన్నారు. రిమాండ్ కోసం వైద్యుల వద్ద పరీక్షలు జరిపామని, అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచినప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడే చెప్పాల్సి ఉందన్నారు. రిమాండ్ అనంతరం యలమంద నాయక్ తనను కిడ్నాప్ చేసి దుర్భాషలాడి కొట్టారని చెప్పడం ఎంతవరకు వాస్తవమో గుర్తించాలని అన్నారు. గురజాల డీఎస్పీ, సీఐలు ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గుర్తించి వారికి చార్జి మెమోలు జారీ చేశామని, ఆపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు నివేదిక పంపానని, దీని ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారన్నారు. -
అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!
సాక్షి, గుంటూరు: చట్ట ప్రకారమే యలమంద నాయక్‌ను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులపై నిరాధార ఆరోపణలు చేశారని.. యలమంద నాయక్ మద్యం కేసులో అరెస్టయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘‘ నాయక్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారనేది అవాస్తవం. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అరెస్టు చేశాం. నిందితుడిని పోలీసులు వేధిస్తే న్యాయమూర్తికి చెప్పుకునేవారు కదా. ‘50 సీఆర్పీసీ’ కింద కుటుంబ సభ్యులకు ముందుగానే నోటీసులిచ్చాం. రాజకీయ మైలేజీ కోసం మాపై దుష్ప్రచారం చేయొద్దు. (చదవండి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు) ఇలాంటి ఆరోపణలు వల్ల పోలీసులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. సీఆర్పీసీ యాక్టు ప్రకారమే మేము పని చేస్తున్నాం. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని’’ ఎస్పీ స్పష్టం చేశారు. అరెస్టయిన 15 రోజుల తర్వాత నిందితుడు ఆరోపించడం సరికాదన్నారు. పని తీరు సరిగ్గా లేకే గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ చేశామని తెలిపారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో సరైన పురోగతి లేనందునే చర్యలు తీసుకున్నామని, వీరిద్దరి సస్పెన్షన్‌లో వేరే ఎలాంటి కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. (చదవండి: ‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’) -
నిమిషాల్లో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి..
సాక్షి, గుంటూరు : నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం. జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిమిషాల వ్యవధిలో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి చేరింది. ఈ ఫేక్ న్యూస్‌కు కుల, మత, రాజకీయ రంగు పులిమారు. ఫేక్ న్యూస్‌పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్ చేసేటప్పుడు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై పోలీసుల నిఘా ఉంటుంది. రెండేళ్ల క్రితం కళాశాల ఖాళీ చేస్తున్న సమయంలో సామాగ్రి, షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినటంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇద్దరిపై కేసు నమోదు కాగా ఎల్ఐసీ కార్యాలయం పక్కన పాత కృష్ణవేణి జూనియర్ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసి సరస్వతి దేవీ విగ్రహం ధ్వంసం చేశారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశారు. దీనిపై ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడు చేసిన మురళి, మహేష్ రెడ్డి అనే ఇద్దరిపై పిడుగురాళ్ల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివాదాల సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం: ఎస్పీ
-
కరోనా కట్టడే లక్ష్యం
సాక్షి, గుంటూరు: కరోనా (కోవిడ్–19) వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం తన ముందున్న లక్ష్యమని గుంటూరు రూరల్ జిల్లా నూతన ఎస్పీ విశాల్ గున్నీ అంటున్నారు. రూరల్ జిల్లాలో వైరస్ కట్టడికి పోలీస్ శాఖ వైపు నుంచి వేగంగా చర్యలు తీసుకుంటున్నా మంటున్నారు. 68 కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని, కాంటాక్ట్‌లను కనిపెట్టి కోవిద్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని చెబుతున్నారు. రూరల్ జిల్లాలో కోవిడ్–19 కట్టడి, శాంతి భద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై ఎలా ముందుకు వెళ్లబోతున్నారో ఎస్పీ విశాల్ వెల్లడించారు. సాక్షి: పోలీస్ సిబ్బంది, అధికారులు వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.? ఎస్పీ: వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది, అధికారులు వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టబోతున్నాం. ప్రతి పోలీస్‌స్టేషన్ ముందు తాత్కాలికంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తాం. ఈ క్యాబిన్లో పోలీస్ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ ఫిర్యాదులు స్వీకరిస్తారు. అలాగే ప్రతి స్టేషన్లో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయర్లు, ఫెడల్ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతాం. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు అంచనా వేయడానికి థర్మల్ స్క్రీన్ గన్లు, పల్స్ఆక్సి మీటర్లను ఏర్పాటు చేస్తాం. సాక్షి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారు తప్పనిసరిగా స్పందన పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని పాస్ కలిగి ఉండాలి. పాస్ పొందని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ చెక్‌పోస్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ వంటి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాం. సాక్షి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఎన్డీపీఎల్ భారీగా జిల్లాలోకి వస్తోంది. కట్టడికి ఎలాంటి కార్యాచరణ ఎంచుకున్నారు? ఎస్పీ: ఇసుక, మద్యం, గుట్కా అక్రమ రవాణా, నాటు సారా తయారీ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాం. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలపై రెక్కీ నిర్వహిస్తున్నాం. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్)ను తరలిస్తున్నట్టు సమాచారం మేరకు పోలీసులు, ఎస్ఈబీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. రోడ్డు మార్గంలో అక్రమ మద్యం రాకుండా సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)ను బలోపేతం చేస్తాం. సాక్షి: రూరల్ జిల్లాపై మీ మార్క్ ఎలా ఉండబోతోంది? ఎస్పీ: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి. రూరల్ జిల్లాలో సాయంత్రం 4.30 నుంచి 8 గంటల వరకూ అధికారులు, సిబ్బంది రోడ్లపై విధులు నిర్వహిస్తారు. విజిబుల్ పోలీసింగ్ పేరుతో రోడ్డుపై బైక్‌లు, కార్లు నిలిపి లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇతర నిబంధనలు పాటించని వారికి చలానాలు రాస్తారు. గుంటూరు రూరల్ జిల్లాలో జరిగే అక్రమాలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు వాట్సప్, ఎస్సెమ్మెస్, కాల్ చేసి తెలపవచ్చు. వెంటనే చర్యలు తీసుకుంటాం. సాక్షి:బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా సమస్యలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు అని చెప్పారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది. ఎస్పీ: ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ప్రతి కాల్ నేనే మాట్లాడుతున్నా. జిల్లాలో పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువగా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే సిబ్బంది, అధికారులను అలెర్ట్ చేశాను. కొంతమంది ఇతర జిల్లాల నుంచి సైతం ఫోన్లు చేస్తున్నారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
-
‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’
-
‘ఛలో కత్తిపూడి సభకు అనుమతి తీసుకోలేదు’
సాక్షి, కిర్లంపూడి : పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. ఛలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని.. అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. ఛలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఇందులో భాగంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజుల నుండి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు. -
జనజీవన స్రవంతిలోకి రావాలి
కాకినాడ రూరల్: మావోయిస్టులు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇష్టపడుతున్నారని, అటువంటి వారికి ప్రభుత్వపరంగా సాయం చేసి, స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరయ్యే చర్యలను తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. మంగళవారం సాయంత్రం ఏటపాక పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, మరో మావోయిస్టు బుధవారం ఎస్పీ గున్నీ ఎదుట లొంగి పోయాడు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒడిస్సా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా, మోటు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తొగరుకోట గ్రామానికి చెందిన ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని పప్పలూరు ఏరియా కమిటీ దళంలో ఏసీఎంగా పని చేసిన మడకం ఎర్రయ్య అలియాస్ రుషి (33) బుధవారం ఎస్పీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయాడు. ఇతనికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ. 20 వేలు, పునరావాసం కోసం జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ఇతని తలపై ఉన్న రివార్డు మొత్తం కోసం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీకి లేఖ రాస్తున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. అలాగే చింతూరు ఏఎస్డీ, ఎస్డీపీవోల ఆదేశాలపై ఏటపాక పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో డీఏకేఎంఎస్‌కు చెందిన ఒక దళ సభ్యుడు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. చత్తీస్ఘఢ్ సుకుమా జిల్లా పాలోడ్‌కు చెందిన మడివి రామ అనే డీఏకేఎంఎస్ దళానికి చెందిన వ్యక్తి, అతనితో పాటు భద్రాది కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబిల్లి గ్రామానికి చెందిన మోలుమురి శ్రీనివాసరావు, అదే మండలం పెద్ద నల్లబిల్లి గ్రామానికి చెందిన పాయం జోగారావు కొరియర్లను అరెస్టు చేసి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) వై.రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అజిత్ వేజెండ్ల పాల్గొన్నారు. -
ప్రతి పోలీసుపైనా శాంతిభద్రతల బాధ్యత
కాకినాడ రూరల్: జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు పైనా ఉందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని అన్నారు. శుక్రవారం సర్పవరం పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన నెలవారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వస్తే విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ప్రోపర్టీ కేసులలో రికవరీ తక్కువగా ఉందని, రికవరీ విషయంలో శ్రద్ధ వహించి రికవరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకొని ఫలితాలు సాధించాలన్నారు. జైలు నుంచి విడుదలైన ప్రాపర్టీ కేసుల్లో ముద్ధాయిలపై నిఘాపెట్టి వారి సమాచారం సేకరించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులలో సంబంధిత అధికారులను కలసి కేసు పెండింగ్నకు సంబంధించిన విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. ఎన్ఫోర్సుమెంట్ వర్కు కూడా మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నెల 15 నుంచి అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పత్రాల పరిశీలన విషయంలో డిపాజిట్‌దార్లకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీపావళి సందర్భంగా షాపులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏజెన్సీ స్టేషన్లకు సంబంధించి అందరూ అప్రమత్తం ఉండాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారెంట్లను అమలు పరచాలని, కోర్టుకు సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రోడ్డు సేఫ్టీలో భాగంగా హైవేలపై డ్యూటీ నిర్వర్తించేవారు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చాలా పోలీసుస్టేషన్ల శిథిలస్థితిలో ఉన్నందున వాటిని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అడిషినల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏఎస్డీ రవిశంకర్‌రెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
డ్రైవర్ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు సిటీ : జిల్లా హోంగార్డు విభాగంలో ఉన్న 33 డ్రైవర్ హోంగార్డు ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్‌గున్నీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నెల్లూరులోని హోంగార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. డ్రైవింగ్ అనుభవం కలిగి ఎల్ఎంవీ, హెడ్ఎంవీ లైసెన్స్ ఉండాలన్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు వయస్సున్న వారు అర్హులన్నారు. దరఖాస్తును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నెల్లూరు వారి పేరుతో రూ.25 డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి రసీదు తీసుకురావాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
► 35 దుంగలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్ నెల్లూరు సిటీ : ఎర్రచందనం అక్రమ రవాణాకు కొందరు కొత్త ఎత్తులు వేస్తున్నారని, వారి ఎత్తులను చిత్తు చేస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం అడ్డు కట్ట వేస్తుందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో విశాల్‌గున్నీ మాట్లాడారు. గత ఒకటిన్నర సంవత్సరంగా ఎర్రచందనం అక్రమ రవా ణాను పూర్తిస్థాయిలో అరికట్టగలిగామని తెలిపారు. వెంకటగిరి, డక్కిలిలో బుధ, గురువారాల్లో ఎర్ర చం దనం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ నెల 22న వల్లివేడు చెరువు వద్ద వెళ్తున్న వాటర్ ట్యాంకర్‌ను తనిఖీలు చేయగా అందులో రూ.6.80 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాలో సూత్రధారి పారె మురళీ, గోనుగొడుగు రమేష్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మురళీపై గతంలో అనేక కేసులు ఉన్నాయన్నారు. రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 23న డక్కిలి మండలం చీకిరేనిపల్లి చెరువు వద్ద ఎర్రచందనాన్ని ట్రాక్టర్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రూ.3.10 లక్షలు విలువ చేసే 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, సుధారాసి మునేంద్రను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరికి సహకరించిన వాళ్లు పరారీలో ఉన్నారని, వాళ్లను ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో అతి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న గూడూ రు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసాచారి, వెంకటగిరి సీఐ మద్ది శ్రీనివాసులు, వెంకటగిరి ఎస్సై కొండపనాయుడు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. -
సమస్యలపై ఫిర్యాదు చేస్తే తక్షణ పరిష్కారం
ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేస్తే తక్షణమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15 మంది బాధితులు తమ సమస్యలను ఆయనకు ఫోను ద్వారా తెలియజేశారు. స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకొంటామని వారికి హామీ ఇచ్చారు. నగరంలోని చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతానికి చెందిన వాస్తు రామచంద్రయ్య పోలీసు కార్యాలయం వాస్తు సరిగా లేదనీ, దానిని మార్పులు చేయాలని సూచించారు. అనంతసాగరానికి చెందిన విజయకుమార్ తన గేదెలు పోయి నెలలు గడుస్తున్నా కనీస చర్యలు చేపట్టలేదనీ, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన వెంకటేష్ ఆత్మకూరు బస్టాండు వద్ద ఆటోల వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్థంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. బట్వాడిపాలెంకు చెందిన ప్రతాప్ తమ ఇళ్ల ఎదుట నిలిపి ఉంచిన వాహనాల నుంచి కొందరు ఆకతాయిలు పెట్రోల్‌ను దొంగలిస్తోన్నారని, రంగనాయకులుపేటకు చెందిన షాహీద్ సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల అటువైపు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వెంకటాచలం మండలం ఎగువమిట్టకు చెందిన పెంచలయ్య బెల్టుషాపులను తొలగించాలని, గూడూరుకు చెందిన శ్రీనివాసులు తమ ఇంటివద్దనే టపాసులు గోదాములు ఉన్నాయనీ, ప్రతి ఏడాది వారు తమను దీపావళి పండగ చేసుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని తెలిపారు. వీటితో పాటు పలు సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఎస్పీ సత్వరమే న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు బి.శరత్‌బాబు, అదనపు ఎస్పీ కె.సూరిబాబు, నగర డీఎస్పీ జి.వెంకటరాముడు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సి.మాణిక్యరావు, ఎస్ఐ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని!
ప్రస్తుత ఎస్పీ ఏఎస్ ఖాన్ పదోన్నతిపై బదిలీ ? శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా విశాల్ గున్ని నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎస్ ఖాన్‌కు ఇటీవల డీఐజీగా పదోన్నతి రావడంతో బదిలీ జరిగింది. ఆయన 2014 జూలై 31న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి సమర్థవంతంగా విధులు నిర్వహించి పలు కీలక అంశాలను పరిష్కరించారు. ఆయన్ని విజయవాడ కమిషనరేట్ పరిధిలో నియమించవచ్చునని పోలీస్‌శాఖలో చర్చసాగుతోంది. కాగా శ్రీకాకుళం నూతన ఎస్పీగా నియమితులైనట్టు ప్రచారం జరుగుతున్న విశాల్ గున్ని ప్రస్తుతం విశాఖ రూరల్ ఓఎస్డీగా విధులుగా నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేసిన గున్నిను శ్రీకాకుళం ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సంబంధిత శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనుండడంతో.. ఆ తర్వాత ఖాన్ బదిలీ, గున్ని నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. -
అమెరికాలో శిక్షణకు విశాల్ గున్నీ
హైదరాబాద్ సిటీ: విశాఖపట్నం జిల్లా ఓఎస్డీ (ఆపరేషన్స్)గా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అమెరికాలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి వర్జీనియా రాష్ట్రంలో ‘ఏటీఏ-11238’ పేరుతో జరిగే ‘పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. బాంబు పేలుళ్లు వంటివి చోటు చేసుకున్న సందర్భాల్లో పేలుడు తరువాత దర్యాప్తులో అనుసరించాల్సిన ఆధునిక విధివిధానాలను బోధించనున్నారు.