డ్రైవర్‌ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | district sp released notification for home guard | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Jun 24 2017 4:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

డ్రైవర్‌ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డ్రైవర్‌ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు సిటీ : జిల్లా హోంగార్డు విభాగంలో ఉన్న 33 డ్రైవర్‌ హోంగార్డు ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్‌గున్నీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నెల్లూరులోని హోంగార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు.

డ్రైవింగ్‌ అనుభవం కలిగి ఎల్‌ఎంవీ, హెడ్‌ఎంవీ లైసెన్స్‌ ఉండాలన్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు వయస్సున్న వారు అర్హులన్నారు. దరఖాస్తును సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, నెల్లూరు వారి పేరుతో రూ.25 డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా చెల్లించి రసీదు తీసుకురావాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement