Home guard posts
-
డ్రైవర్ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు సిటీ : జిల్లా హోంగార్డు విభాగంలో ఉన్న 33 డ్రైవర్ హోంగార్డు ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్‌గున్నీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నెల్లూరులోని హోంగార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. డ్రైవింగ్ అనుభవం కలిగి ఎల్ఎంవీ, హెడ్ఎంవీ లైసెన్స్ ఉండాలన్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు వయస్సున్న వారు అర్హులన్నారు. దరఖాస్తును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నెల్లూరు వారి పేరుతో రూ.25 డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి రసీదు తీసుకురావాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. -
తండ్రి, కూతురు అరెస్టు
కొత్తచెరువు: హోంగార్డు పోస్టులు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన తండ్రి, కూతురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కేశాపురం గ్రామానికి చెందిన కామాక్షి జిల్లా కేంద్రం అనంతపురంలో ఓ పోలీస్ అధికారి ఇంట్లో పనిచేసేది. ఈక్రమంలో పోలీస్‌శాఖలో హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామని తండ్రి రామసుబ్బయ్య సమక్షంలో గత ఏడాది జాలైలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులతోరూ.7,55 లక్షలు వసూలు చేసింది. ఇందులో కేశప్ప, చలపతి ఒక్కొక్కరు రూ.1.65 లక్షలు, శీనప్ప రూ.2.70 లక్షలు, లక్ష్మీనారాయణ రూ.50 వేలు ఆమెకు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె అదిగో..ఇదిగో.. అంటు కాలం గడపడంతో బాధితులు మోసపోయామని తెలుçసుకుని స్థానిక పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కామాక్షి తండ్రి సుబ్బయ్యపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా కేసును రాజీ చేసుకునేందుకు కామాక్షి, తండ్రి రామసుబ్బయ్య కేశాపురం గ్రామంలోని ఇంట్లో బాధితులతో మాట్లాడుతుండగా ఎస్ఐ, సిబ్బంది వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని రూ.4.20,లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీతెలిపారు. -
అగ్నిమాపకశాఖలో 139 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అగ్నిమాపకశాఖలో 139 మంది హోంగార్డుల నియామకానికి హోంశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఫైర్ అవుట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న హోంగార్డుల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా అగ్నిమాపకశాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ)కి సూచించారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 117 మందిని హోంగార్డులుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నోటీఫికేషన్ జారీ చేసింది. హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 10 నుంచి 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సీటీ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.