తండ్రి, కూతురు అరెస్టు
తండ్రి, కూతురు అరెస్టు
Published Sun, Sep 25 2016 12:07 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM
కొత్తచెరువు: హోంగార్డు పోస్టులు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన తండ్రి, కూతురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీధర్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మండలంలోని కేశాపురం గ్రామానికి చెందిన కామాక్షి జిల్లా కేంద్రం అనంతపురంలో ఓ పోలీస్ అధికారి ఇంట్లో పనిచేసేది. ఈక్రమంలో పోలీస్‌శాఖలో హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామని తండ్రి రామసుబ్బయ్య సమక్షంలో గత ఏడాది జాలైలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులతోరూ.7,55 లక్షలు వసూలు చేసింది. ఇందులో కేశప్ప, చలపతి ఒక్కొక్కరు రూ.1.65 లక్షలు, శీనప్ప రూ.2.70 లక్షలు, లక్ష్మీనారాయణ రూ.50 వేలు ఆమెకు ఇచ్చారు.
అప్పటి నుంచి ఆమె అదిగో..ఇదిగో.. అంటు కాలం గడపడంతో బాధితులు మోసపోయామని తెలుçసుకుని స్థానిక పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కామాక్షి తండ్రి సుబ్బయ్యపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా కేసును రాజీ చేసుకునేందుకు కామాక్షి, తండ్రి రామసుబ్బయ్య కేశాపురం గ్రామంలోని ఇంట్లో బాధితులతో మాట్లాడుతుండగా ఎస్‌ఐ, సిబ్బంది వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని రూ.4.20,లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీతెలిపారు.
Advertisement
Advertisement