జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని! | sirkakulam district new sp vishal gunni | Sakshi
Sakshi News home page

జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని!

Published Sat, Feb 20 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని!

జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని!

ప్రస్తుత ఎస్పీ ఏఎస్ ఖాన్ పదోన్నతిపై బదిలీ ?
శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా విశాల్ గున్ని నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎస్ ఖాన్‌కు ఇటీవల డీఐజీగా పదోన్నతి రావడంతో బదిలీ జరిగింది. ఆయన 2014 జూలై 31న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి సమర్థవంతంగా విధులు నిర్వహించి పలు కీలక అంశాలను పరిష్కరించారు. ఆయన్ని విజయవాడ కమిషనరేట్ పరిధిలో నియమించవచ్చునని పోలీస్‌శాఖలో చర్చసాగుతోంది. కాగా శ్రీకాకుళం నూతన ఎస్పీగా నియమితులైనట్టు ప్రచారం జరుగుతున్న విశాల్ గున్ని ప్రస్తుతం విశాఖ రూరల్ ఓఎస్‌డీగా విధులుగా నిర్వహిస్తున్నారు.

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేసిన గున్నిను శ్రీకాకుళం ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సంబంధిత శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనుండడంతో.. ఆ తర్వాత ఖాన్ బదిలీ, గున్ని నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement