district sp
-
అసభ్య పోస్టులను నివారించండి.. అక్రమ అరెస్టులు ఆపండి
-
ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు. ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు. ► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు. ► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు. ► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్‌పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు. -
ఎస్పీని కలిసిన వైఎస్ వివేకా
► మహేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కడప అర్బన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి రెండు సమస్యలపై చర్చించారు. సుండుపల్లె మండలం ఎంపీపీ అజంతమ్మ ఇంటిని రాత్రికి రాత్రే ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు, మరికొంతమంది దౌర్జన్యంగా కూల్చివేశారు. సదరు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ఆర్సీపీ నేతల సమస్యపై: ఆర్సీపీ నేతలు నిమ్మకాయల రవిశంకర్‌రెడ్డితోపాటు 11 మందిపై తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం రౌడీషీట్లను ఓపెన్ చేశారు. ఈ సమస్యపై అఖిలపక్ష నేతలు ఎస్పీని కలిసేందుకు వచ్చిన సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎస్పీ బంగ్లాకు వచ్చారు. ఆ సమయంలో ఆర్సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డికి తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి వివరించారు. స్పందించిన వైఎస్ వివేకా స్పందించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రౌడీషీట్లు ఆర్సీపీ నేతల ప్రవర్తనను బట్టి భవిష్యత్తులో తొలగిస్తామని, సమస్యను పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారని వైఎస్ వివేకా వెల్లడించారు. -
త్రివిధ దళాలకు దీటుగా పోలీసుల సేవలు
జిల్లాలో ఇప్పటి వరకూ అమరులైన 60 మంది ఎస్పీ రవిప్రకాష్ కాకినాడ క్రైం: దేశ భద్రతలో త్రివిధ దళాలు అందిస్తున్న సేవలకు దీటుగా శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు అవిశ్రాంతంగా పాటుపడుతున్నారని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత శాంతి భద్రతల విషయంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. పోలీసుశాఖ పట్ల అవగాహన కల్పించేందుకు భావిపౌరులైన విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా వక్తృత్వ, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ఏజెన్సీలో నక్సలైట్ల కార్యకలాపాలను, అక్రమ మైనింగ్‌ను అరికట్టే కృషిలో ఇప్పటి వరకూ 60 మంది పోలీసులు మరణించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది కాలంలో విధినిర్వహణలో 700 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో శాంతి భద్రతల విషయంలో పోలీసులు అందిస్తున్న సేవలు మరువలేనివమన్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకపోయినా సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు చురుగ్గా పాల్గొనడాన్ని అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసులు కీర్తి, శ్యామ్ ఇన్స్టిట్యూట్స్, పలు కళాశాలలకు చెందిన 200 మంది నుంచి రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా రక్త సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దామోదర్, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కార్యదర్శి డాక్టర్ దుర్గరాజు, ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ ఎస్.మురళీమోహన్, ఏఆర్ డీఎస్పీ వాసన్, ఆర్ఐ ఏఆర్ వెంకటేశ్వరరావు, ఆర్ఐ ఎఎన్ఎస్ రాజ్‌కుమార్, సీఐలు వి.పవన్‌కిషోర్, పి.మురళీకృష్ణ పాల్గొన్నారు. -
సిబ్బంది పనితీరుపై ఎస్పీ అసంతృప్తి
సామర్లకోట : సామర్లకోట పోలీసు స్టేషన్ సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సామర్లకోట పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ను ముందుగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం ఉన్నా రికార్డులు సక్రమంగా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్పెక్షన్ అంటే లెక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని వాటిని అరికడతామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు అందరికీ హైదరాబాద్, విజయవాడల్లో శిక్షణలు ఇస్తామని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంలో నేరాలు పెరిగిపోయాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి అదనపు పోలీసులను భర్తీచేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాల కోసం అదనంగా 200 మంది సిబ్బంది కావాలని కోరామన్నారు. సామర్లకోట స్టేషన్‌కు వచ్చిన జిల్లా ఎస్పీకి డీఎస్పీ ఎస్. రాజశేఖరరావు, సీఐ ఎస్.ప్రసన్నవిజయగౌడ్, ఎస్సైలు ఎ.మురళీకృష్ణ, లక్ష్మీకాంతం స్వాగతం పలికారు. సుమారు రెండు గంటల పాటు రికార్డులను ఆయన తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. -
జిల్లా కొత్త పోలీస్‌బాస్ విశాల్ గున్ని!
ప్రస్తుత ఎస్పీ ఏఎస్ ఖాన్ పదోన్నతిపై బదిలీ ? శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా విశాల్ గున్ని నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎస్ ఖాన్‌కు ఇటీవల డీఐజీగా పదోన్నతి రావడంతో బదిలీ జరిగింది. ఆయన 2014 జూలై 31న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి సమర్థవంతంగా విధులు నిర్వహించి పలు కీలక అంశాలను పరిష్కరించారు. ఆయన్ని విజయవాడ కమిషనరేట్ పరిధిలో నియమించవచ్చునని పోలీస్‌శాఖలో చర్చసాగుతోంది. కాగా శ్రీకాకుళం నూతన ఎస్పీగా నియమితులైనట్టు ప్రచారం జరుగుతున్న విశాల్ గున్ని ప్రస్తుతం విశాఖ రూరల్ ఓఎస్డీగా విధులుగా నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేసిన గున్నిను శ్రీకాకుళం ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సంబంధిత శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనుండడంతో.. ఆ తర్వాత ఖాన్ బదిలీ, గున్ని నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. -
దాడి చేసిన సర్పంచ్‌పై కేసు పెట్టాలి
సంగారెడ్డి అర్బన్: తనకు అనుకూలంగా ఓ కేసు విషయమై తప్పుడు సాక్ష్యం చెప్పాలని గ్రామ సర్పంచ్ ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ బాల్‌రాజ్ సదాశివపేటకు చెందిన తుల్జారాంను తప్పుడు సాక్ష్యం చెప్పాలని కోరాడు. దానికి అతను నిరాకరించడంతో బాల్‌రాజ్ తన అనుచరులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తుల్జారాంను రక్షించారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్‌కు తుల్జారాం ఫిర్యాదు చేయగా, ఈ విషయమై జేసీ శరత్ స్పందిస్తూ ఈ విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఎస్పీని కలవాలని సూచించారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. ⇒ హత్నూర మండలం పల్పనూర్ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ⇒ మనూర్ మండలం కసర్గుత్తి గ్రామానికి చెందిన శాంతాబాయి వికలాంగుల పింఛన్ కోసం, శంకరంపేట(ఆర్)కు చెందిన రాములు వికలాంగుల కోటాలో ట్రైసైకిల్ మంజూరుకు వినతి. ⇒ మెదక్ మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాట్రోత్ గోపాల్ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్ మోటారు మంజూరుకు డిమాండ్. ⇒ కొండపాక గ్రామానికి చెందిన ఎంగయ్య తన భూమి రికార్డుల ప్రకారం సరిచేయాలని కోరారు. ⇒ న్యాల్కల్ మండలం తుజాల్‌పూర్‌కి చెందిన మణెమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రుణం ఇప్పించాలని కోరారు. ⇒ ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కంకర క్రషర్ మిషన్ నడుపుతున్నందున చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ⇒ మెదక్ మండలం ఔసలిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ, సోని, సుజాత, కళావతి, లక్ష్మీలకు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ⇒ అనావృష్టి వల్ల రైతులకు తగిన దిగుబడి రానందు వల్ల పూర్తి స్థాయిలో రైతులు బ్యాంక్ రె న్యువల్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి బ్యాంక్ లోన్స్ రెన్యువల్స్ చేయలేకపోతున్నారని, రెన్యువల్ చేయలేని రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు రంగాగౌడ్, పాపయ్యలు జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్‌ను కోరారు. -
సందడి చేద్దాం.. సరదా తెద్దాం
ఏలూరు సిటీ : గడియారం తన పని తాను చేసుకుపోతోంది. 2014 సంవత్సరం చరిత్ర పుటల్లో కలిసిపోవడానికి.. 2015 ఆగమనానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలైతే చాలు జనం ఆనందానికి అవధులు ఉండవు. చిన్నాపెద్దా.. పేద, ధనిక.. ఉద్యోగులు, వ్యాపారులు.. కుల మత భేదాలు లేకుండా సంబరాలు చేసుకునే ఘడియలవి. దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువత రెడీ అవుతోంది. స్నేహాన్ని.. ప్రేమను.. అనుబంధాన్ని.. ఆప్యాయతలను చాటుకునేందుకు.. బహుమతులు ఇచ్చి పుచ్చుకునేందుకు.. కొంగొత్త ఆశలతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు.. రంగుల లోకాన్ని ఆవిష్కరించేందుకు యువత ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. వినోదాల పండగలాంటి ఈ అర్ధరాత్రి సంబరం విషాదం కాకూడదంటే ఏం చేయాలనే విషయమై ఏలూరు యువతుల మనోగతం... సంతోషంగా గడపాలి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పండగ చేసుకునే వేళ అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. సెలబ్రేషన్స్ పేరుతో వేధింపులు, గొడవలు చేయడం తగదు. స్నేహానికి విలువ ఇస్తూ.. ఇతరులను గౌరవించేలా.. ఎదుటి వారి ఆకాంక్షలు నెరవేరేలా శుభాకాంక్షలు చెబుతూ వేడుకలు చేసుకుంటే మంచిది. అన్నయ్యలూ.. తమ్ముళ్లూ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను హుందాగా జరుపుకుందాం. ఓకేనా. - జి.చంద్రిక తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకోవడం తప్పు కానే కాదు. కానీ.. దాని పేరుతో మోటార్ సైకిళ్లను సెలైన్సర్లు తీసేసి నడపటం వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇళ్లుల్లో ఉండే వృద్ధులు, చంటిపిల్లలు, గుండె వ్యాధితో బాధపడే వ్యక్తులు తీవ్ర ఇబ్బంది పడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. ఎదుటి వారి క్షేమాన్ని కోరి శుభాకాంక్షలు చెప్పుకునే వేళ తోటి వాళ్లను ఇబ్బంది పెట్టడం.. ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదు. - మమత జీవితం విలువను గుర్తించాలి జీవితం చాలా విలువైంది. దానిని జాగ్రత్తగా మలుచుకుంటేనే జీవితాంతం సంతోషం, ఆనందం ఉంటాయి. క్షణిక ఆనందం కోసం మనం చేసే సం దడి హద్దులు దాటితే ప్రమాదాల బారినపడతాం. దీనివల్ల మనతోపాటు మన కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టిన వాళ్లం అవుతాం. మనం చేసుకునే వేడుకల వల్ల ఆనందం, ఉత్సాహం రెట్టింపు అవ్వాలే తప్ప వీసమెత్తు విషాదం పలికినా ఇబ్బందే. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. - కావ్య హరివిల్లు కావాలి కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు రంగుల హరివిల్లులా మారాలి. విద్యార్థులు చదువులోను, ఉద్యోగులు, వ్యాపారులు తమ విధుల్లోను.. అన్ని రంగాల్లోని వ్యక్తులు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలి. కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. మనలో ఉన్న ఒక్క లోపాన్ని అయినా గతించిపోయే పాత సంవత్సరానికి వదిలేస్తే.. వచ్చే ఏడాది ఎంతో బాగుంటుంది. - స్వాతి అలా చేయొద్దు డిసెంబర్ 31న రాత్రి నుంచి కొత్త సంవత్సరం రాక కోసం ఎదురు చూస్తూ అంద రం ఆనందంగా గడుపుతాం. అలాంటి వేళలో కొందరు యువకులు మద్యం సేవించి గొడవలు పడటం.. రోడ్లపై వెళ్లేవారిని అల్లరి పెట్టడం.. బైక్‌లు వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడటం వల్ల వారిని చుట్టుపక్కల వాళ్లు తిట్టుకుంటారు. పండగ వేళ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం.. వారితో తిట్లు తినడం మంచిదంటారా. ఏడాదంతా బాగుండాలంటే తొలి రోజున నలుగురూ మెచ్చేలా ఉంటే బాగుంటుంది. - అనూష హద్దు మీరితే అరెస్ట్ చేస్తాం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరైనా హద్దు మీరితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. మహిళలు, యువతులు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. యువత కొత్త సంవత్సరం పండగను ఉత్సాహంగా చేసుకోవడం తప్పు కాదు. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. సెలైన్సర్లు తొలగించి మోటార్ సైకిళ్లు నడిపితే సహించేది లేదు. వాహనాలను అత్యంత వేగంగా నడపటం వల్ల ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని నష్టపోతారు. ఈ విషయాన్ని యువత గమనించాలి. ఫ్రెండ్స్.. మీరంతా డిసెంబర్ 31 వేడుకల్ని సంతోషంగా జరుపుకోండి. విషాదాలకు, వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించండి. తద్వారా అందరిలో సంతోషం నింపేవిధంగా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. - కె.రఘురామ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
ఎస్పీ రంగనాథ్ బదిలీ
* కొత్త ఎస్పీగా షానవాజ్‌ఖాసిం * ఏరికోరి ఎంపిక చేసిన ప్రభుత్వం! * హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా రంగనాథ్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ డీసీపీగా పనిచేస్తున్న షానవాజ్‌ఖాసిం నియమితులయ్యారు. గతంలో కొత్తగూడెం ఓఎస్డీగా జిల్లాలో పనిచేసిన అనుభవం షానవాజ్‌కు ఉంది. నక్సల్స్ నియంత్రణలో దిట్టగా పేరున్న ఈయన్ను ప్రభుత్వం ఏరికోరి జిల్లా ఎస్పీగా పంపించినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా రంగనాథ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 23 నెలలపాటు రంగనాథ్ సేవలు.. సరిగ్గా 23 నెలలపాటు ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్రవేశారు. అనేక ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన నక్సల్స్ కార్యకలాపాలను నియంత్రించటంలో సఫలీకృతులయ్యారు. జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో పువ్వర్తి ఎన్కౌంటర్, ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారు. ఇతర విప్లవ గ్రూప్‌లపై ఉక్కుపాదం మోపారు. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో అన్ని పార్టీలనూ మెప్పిస్తూ స్థానిక, మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్న భూ, స్థల వివాదాల పరిష్కారంలోనూ చొరవ చూపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన దొంగతనాల్లో చోరీ సొమ్మును రికవరీ చేయించడంలోనూ రంగనాథ్ సక్సెస్ అయ్యారు. అయితే మధిర శ్రీరాం చిట్స్‌లో జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించలేకపోయారు. ద్విచక్రవాహనాల చోరీలను అరికట్టడంలోనూ తనదైన శైలిలో ముందుకెళ్లారు. సామాజిక సేవపైనా రంగనాథ్ దృష్టి సారించారు. నగరంలో చెత్తపై సమరశంఖం పూరించారు. ‘క్లీన్ ఖమ్మం’ విషయంలో ఆయన దూకుడు ప్రదర్శించారు. నడివీధుల్లో చెత్తవేసే వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. ప్రజాదివస్ ద్వారా అనేక ఫిర్యాదులను పరిష్కరించారు. సంబంధిత స్టేషన్ అధికారులనూ అప్రమత్తం చేశారు. -
హైటెక్ మోసం
వైరా, న్యూస్‌లైన్ : చట్టాలలో లోపాలను ఆసరాగా చేసుకుని కోర్టును, జిల్లా ఎస్పీని మోసం చేసి భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించిన వైరాకు చెందిన ఆదూరి సురేష్ కుమార్, అతని తల్లి బేబి అమ్మాళ్‌ను అరెస్టు చేశామని వైరా సీఐ మోహన్‌రాజా తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరా లు వెల్లడించారు. వైరాకు చెందిన రాయల నారాయణ స్థానిక కూరగాయల మార్కెట్లో ఉన్న 330 గజాల భూమిని తన కుమారులు శంకర్రావుకు, అనంతరాములుకు పంచి ఇచ్చారని తెలిపారు. వారసత్వంగా రాయల అనంతరాములు పొందిన 220 గజాల భూమిని వైరాకు చెందిన ఆదూరి సురేష్ తప్పుడు పత్రాలతో తల్లి పేరుపై రిజిష్ట్రేషన్ చేయించి, అనంతరం తన పేరుపై బహుమతి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వివరించారు. అంతేకాకుండా తన స్థలాన్ని ఆక్రమించారని, వైరాకు చెందిన నెలవల్లి రామారావు, రాయల శంకర్రావులపై సత్తుపల్లి కోర్టులో తప్పుడు కేసు వేశారని, దాంతో కేసు విచారించిన కోర్టు ఆ స్థలం సురేష్‌కు చెందినదిగా డీక్రి ఇచ్చిందని వివరించారు. ఇటీవల ఆ స్థలంలో సురేష్ ఇంటి నిర్మాణం చేపట్టగా, అనంతరాములు అడ్డుకున్నాడని, దీంతో సురేష్ అనంతరాములుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ విచారణకు డీఎస్పీని ఆదేశించారని చెప్పారు. డీఎస్పీ సాయిశ్రీ విచారణలో సురేష్ అక్రమాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలకు నివేదిక.. రెండేళ్ల క్రితం స్థల ఆక్రమణపై సురేష్ ఫిర్యాదుమేరకు పోలీసులు కోర్టు డిక్రీ ఆధారంగా అనంతరాములుపై తప్పుడు కేసు చేశారని సీఐ మోహన్‌రాజా తెలిపారు. ఈ వ్యవహారాన్ని అప్పటి ఎస్సై పూర్తిగావిచారిస్తే త ప్పుడు ధ్రువపత్రాల బాగోతం బయటపడేదని అభిప్రాయపడ్డారు. రా య ల అనంతరాములు, అతని తమ్ముడు శంకర్రావులపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఎస్సై రవిపై కూడా చర్యలకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని స్పష్టం చేశారు. కోర్టు నుంచి ఇచ్చిన డిక్రీని రద్దు చేయాలని, జడ్డీకి జరిగిన సంఘటనను వివరిస్తూ లేఖ పంపిస్తామని మోహన్‌రాజా తెలిపారు. ఇలాంటి కేసు తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. సమావేశంలో వైరా ఎస్సై తుమ్మా గోపి పాల్గొన్నారు.