బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు.
ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు
► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు.
► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు.
► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు.
► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్‌పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు.
► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment