medal
-
కత్తి మీద సాము అన్నట్టుగా కత్తి తిప్పిన తెలంగాణ చెల్లెమ్మ
-
వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్ 11–6, 11–5, 11–8తో హర్మత్ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
నెత్తురోడుతున్నా.. బెదరకుండా..
సాక్షి, హైదరాబాద్: ఛాతి, మెడ, కడుపు, చేతుల మీద విచక్షణారహితంగా కత్తిపోట్లు.. రక్తం ఏరులై పారుతున్నా ఏమాత్రం బెదరకుండా కరుడుగట్టిన అంతర్రాష్ట్ర చెయిన్ స్నాచర్ ఇషాన్ నిరంజన్ నీలంనల్లి ఆటకట్టించారు హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య. అతని ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర హోం శాఖ అత్యున్నత శౌర్య పతకం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారానికి ఎంపిక చేసింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాదయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్యే కావడం విశేషం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్ సీసీఎస్‌లో యాదయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. యాదయ్య అవార్డుకు ఎంపికవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్వగ్రామమైన చేవెళ్లలోని మీర్జాగూడలో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.నాడు ఏం జరిగిందంటే..2022 జూలై 25న చెయిన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాల సరఫరాదారులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నాచింగ్‌లకు తెగబడ్డారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆర్సీపురం, మియాపూర్‌లలో వరుస చెయిన్ స్నాచింగ్‌లతో హడలెత్తించారు. దీంతో స్నాచర్లను పట్టుకునేందుకు వెంటనే అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్నాచర్ల కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. స్నాచింగ్ సమయంలో నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనం, వారు ధరించిన దుస్తులను గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుల జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్నాచర్లు మియాపూర్‌లో మరో స్నాచింగ్ చేసి, బైక్ మీద వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో మాదాపూర్ సీసీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య, దేబేష్లు బైక్ మీద ఆర్సీపురం నుంచి మియాపూర్ వైపు వస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇరువురు స్నాచర్లను పట్టుకునేందుకు బయలుదేరారు.రక్తం కారుతున్నా...నిందితులు అశోక్‌నగర్ హెచ్ఐజీ గేట్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు మళ్లారు. దీంతో కాలనీలోనే స్నాచర్లను పట్టుకోవాలని నిర్ణయించుకున్న యాదయ్య బైక్‌ను హెచ్ఐజీ గేట్ లోపలికి మళ్లించారు. కాలనీలో నుంచి బైక్ మీద ఎదురుగా వస్తున్న నిందితులు ఇషాన్, రాహుల్ వీరిని దాటి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ దేబేష్ స్నాచర్ రాహుల్‌ను, బైక్ నడుపుతూనే యాదయ్య మరో స్నాచర్ ఇషాన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇషాన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్య ఛాతి, మెడ, చేతులు, కడుపు, శరీరం వెనక భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా యాదయ్య ఏమాత్రం బెదరకుండా ఇషాన్‌ను అదిమి పట్టుకున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి రావడంతో ఇరువురు స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. యాదయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏడు కత్తిపోట్లతో ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన యాదయ్య 18 రోజులపాటు చావుతో పోరాడాడు. ఆఖరికి శరీరం లోపల, బయట మూడు సర్జరీలు, వందకు పైగా కుట్లు పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. గతంలో లాగా శరీరం సహకరించకపోవడంతో అధికారులు యాదయ్యను ఆఫీసు విధులకు పరిమితం చేశారు.సహచరుల సహకారంతోనే..తోటి కానిస్టేబుళ్లు దేబేష్, రవి సహకారంతోనే స్నాచర్లను పట్టుకోగలిగాం. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుగా మా విధి. పై అధికారుల ప్రోత్సాహంతో వారిని ఆదర్శంగా తీసుకొని విధులు నిర్వర్తిస్తాను. –చదువు యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ -
‘పిస్టల్’తో పంట పండించాడు!
‘కిసాన్ ద పుత్తర్ హై... దిల్ థోడా చడీ దా’... శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయిన తర్వాత సరబ్‌జోత్‌తో అతని తండ్రి జతీందర్ సింగ్ చెప్పిన మాట ఇది. ‘రైతు బిడ్డవు నువ్వు...బేలగా మారిపోయి బాధపడవద్దు’ అంటూ నాన్న స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయగా... సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ బిడ్డ మళ్లీ తన తుపాకీని లక్ష్యంపై సరిగ్గా గురి పెట్టాడు. ‘నా కొడుకు షూటింగ్‌ను చాలా ఇష్టపడ్డాడు. గత పదేళ్లుగా అందులో ఎంతో కష్టపడ్డాడు. గత ఈవెంట్లో ఫైనల్ అవకాశం కోల్పోయినప్పుడు అదే గుర్తు చేశాను. గతం మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టమని చెప్పాను. ఆ నిరాశను దూరం చేసి అతను ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది’ అని జతీందర్ సంతోషం వ్యక్తం చేశాడు. నాన్న అండతో... హరియాణా రాష్ట్రం అంబాలాలోని ధీన్ గ్రామం సరబ్జోత్ స్వస్థలం. ఐదు ఎకరాల వ్యవసాయదారుడు అయిన తండ్రి అక్కడి చాలా కుటుంబాలలాగే తన పెద్ద కొడుకు కూడా పొలంలో సహాయకారిగా ఉంటే చాలనుకున్నాడు. కానీ సరబ్జోత్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. స్థానికంగా జరిగిన వేసవి శిబిరంలో కొంత మంది కుర్రాళ్ల చేతుల్లో ఉన్న ఎయిర్ గన్స్ అతడిని ఆకర్షించాయి. కాగితాలపై చిత్రించిన లక్ష్యాలను వారు కొడుతున్న తీరు మరింత ఇష్టాన్ని పెంచింది. కొన్నాళ్లకు ఆ శిబిరం ముగిసిపోయినా... ఆ టీనేజర్ మనసులో పిస్టల్ ముద్రించుకుపోయింది. దాంతో ధైర్యం చేసుకొని 13 ఏళ్ల ఆ కుర్రాడు తాను షూటింగ్ నేర్చుకుంటానంటూ తండ్రితో చెప్పేశాడు. ముందుగా సందేహించినా...ఆ తర్వాత తండ్రి తనను అంబాలాలోని షూటింగ్ అకాడమీలో చేరి్పంచాడు. అక్కడ ఓనమాలు నేర్పించిన కోచ్ అభిషేక్ రాణా ఇప్పటి వరకు కూడా కోచ్‌గా ఉంటూ సరబ్జోత్ ఒలింపిక్ పతక ప్రస్థానంలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఆ వయసులోనే పొలంలో కష్టం చేసే అలవాటు ఉన్న ఆ అబ్బాయి తనకు సూపర్ఫిట్గా అనిపించాడని, నిర్విరామంగా గంటలకొద్దీ కదలకుండా నిలబడి సాధన చేసేవాడని రాణా గుర్తు చేసుకున్నాడు. అలా మొదలై... 16 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఈ హరియాణా అబ్బాయి వెలుగులోకి వచ్చాడు. అప్పుడే అతను తన తండ్రి వద్ద తొలిసారి సొంతంగా కొత్త పిస్టల్ కొనివ్వమని అడిగే ధైర్యం చేశాడు. అదే సమయంలో నోట్లు రద్దు కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నా... కొడుకు కోసం దాదాపు రూ. 2 లక్షలతో తండ్రి పిస్టల్ కొనిచ్చాడు. తనపై తండ్రి ఉంచిన నమ్మకాన్ని సరబ్జోత్ నిలబెట్టుకున్నాడు. తర్వాతి రెండేళ్ల పాటు ఆటలో మరింత రాటుదేలిన అతను 2019లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని రుచి చూశాడు. అదే ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం సరబ్‌ను భారత్ నుంచి మంచి భవిష్యత్తు ఉన్న పిస్టల్ షూటర్లలో ఒకడిగా మార్చింది. రెండేళ్ల తర్వాత పెరూలోని లిమాలో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో అతను ఆకట్టుకున్నాడు. ఇదే జోరులో వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజతాలు సరబ్ ఖాతాలో చేరాయి. గత ఏడాది చాంగ్వాన్లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడే అతనిపై అంచనాలు పెరిగాయి. చివరకు అతను వాటిని నిలబెట్టుకున్నాడు. లక్ష్యం చేరిన బుల్లెట్... ‘నాకు వరల్డ్ కప్ విజయాలు అవసరం లేదు... వేరే ఇతర టోర్నీ ల్లో పతకాలు అవసరం లేదు... నాకు ఒలింపిక్స్ పతకం మాత్రమే కావాలి... గత ఎనిమిదేళ్లుగా నేను దీని గురించి కలగన్నాను... ఇప్పుడు నా గుండెల్లో ఒక రకమైన అగ్ని జ్వలిస్తోంది’... పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సరబ్జోత్ సింగ్ ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడినప్పుడు కూడా అతను అంతే ఉత్సాహంగా కనిపించాడు. క్వాలిఫయింగ్‌లో జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్‌తో కలిసి 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే 10 పాయింట్ల షాట్లు వాల్టర్కంటే ఒకటి తక్కువగా కొట్టడంతో అనూహ్యంగా ఫైనల్ చేరే అవకాశం చేజారింది. దాంతో ఆవేదనగా ని్రష్కమించిన అతను ఇప్పుడు మిక్స్‌డ్‌లో కాంస్యంతో ఆ భారం కాస్త దించుకున్నాడు. వేగంగా దూసుకెళ్లే కార్లు, పంజాబీ పాప్ సంగీతాన్ని ఇష్టపడే ఈ 23 ఏళ్ల షూటర్ తన ఇంట్లో, పరిసరాల్లో, సరదాగా ఆడే వీడియో గేమ్‌లపై కూడా ఒలింపిక్ రింగ్‌లను ఎల్ఈడీ లైట్లతో అలంకరించుకున్నాడు. వాటిని చూడగానే తన లక్ష్యం ఏమిటో, తాను పడిన శ్రమ ఏమిటో ఇవి పదే పదే గుర్తుకొస్తుందని, తన కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలను పెంచడం కోసం ఇలా చేసినట్లు అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలుచుకున్న క్షణాన ‘నేను ఎన్నో ఫాస్ట్ కార్లను అద్దెకు తీసుకొని నోయిడా సర్క్యూట్లో వేగంగా డ్రైవింగ్ చేశాను. ఇప్పుడు నా కోసం ఒకటి కొనుక్కుంటాను. అది ఎంతో వేగంగా దూసుకెళ్లాలంటే 3–4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోవాలి’ అంటూ తన కోరికను అతను బయటపెట్టాడు. –సాక్షి క్రీడా విభాగం నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్టేబుల్ టెన్నిస్మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్: ఆకుల శ్రీజ X జియాన్ జెంగ్ (సింగపూర్) (మధ్యాహ్నం గం. 2:20 నుంచి).ఆర్చరీ మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: దీపిక X రీనా పర్నట్ (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 3:56 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: తరుణ్‌దీప్ రాయ్X టామ్ హాల్ (బ్రిటన్) (రాత్రి గం. 9:15 నుంచి). ఈక్వె్రస్టియన్ డ్రెసాజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రి: అనూష్ అగర్వల్లా (మధ్యా హ్నం గం. 1:30 నుంచి). బాక్సింగ్మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్: లవ్లీనా బొర్గొహైన్ X సునీవా హాఫ్స్టడ్ (నార్వే) (మధ్యాహ్నం గం. 3:50 నుంచి). పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్: నిశాంత్ దేవ్ X జోస్ గాబ్రియల్ రోడ్రిగ్జ్ (ఈక్వెడార్) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి). బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: పీవీ సింధు X క్రిస్టిన్ కూబా (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 12:50 నుంచి). పురుషుల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: లక్ష్యసేన్ X జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 1:40 నుంచి). పురుషుల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్): హెచ్ఎస్ ప్రణయ్ ్ఠ డక్ పాట్ లీ (వియత్నాం) (రాత్రి గం. 11:00 నుంచి). షూటింగ్50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్ రౌండ్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). -
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. -
ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు. ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు. ► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు. ► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు. ► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్‌పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు. -
CM Jagan: గౌరవం చేతల్లోనూ..
సాక్షి, కృష్ణా: ఎదుటివారిని వాళ్ల వాళ్ల అర్హతను బట్టి గౌరవించడం, ప్రేమించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రత్యేకత. మాటల్లోనే కాదు.. ఒక్కోసారి చేతల్లోనూ అది చూపిస్తుంటారాయన. అందుకోసం తన స్థాయిని పక్కనపెట్టి మరీ ఆయన ఓ మెట్టు కిందకు దిగుతుంటారు కూడా. తాజాగా.. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి మెడల్ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. సీఎం జగన్ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్‌ను తీసి మళ్లీ ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో జగనన్న అభిమానుల నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. -
ఐదుగురు రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అత్యుత్తమ నేర పరిశోధన చేసిన 140 మంది పోలీసు అధికారులను 2023 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపిక చేశారు. నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఈ పతకాలను 2018 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, బోధన్ ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రాజుల సత్యనారాయణరాజు, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ యం.జితేందర్‌రెడ్డి, ఏసీపీ భూపతి శ్రీనివాసరావు పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఐ అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సీఐ మన్సూరుద్దీన్ షేక్, డీఎస్పీ ధనుంజయుడు మల్లెల, ఏఎస్పీ సుప్రజ కోర్లకుంట, డీఎస్పీ రవిచంద్ర ఉప్పుటూరి అవార్డులు పొందారు. ఎనిమిది మందికి జీవితఖైదు – అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ప్రస్తుతం ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న మేకల తిరుపతన్న.. 2016లో సంగారెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కంగ్టి పోలీస్ స్టేషన్లో ఓ గిరిజనుడి హత్యకేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారు. పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్ నమోదు చేయడంతో ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు దోషులుగా తేలారు. వారికి గత ఫిబ్రవరిలో జీవిత ఖైదు విధించారు. హత్యాచారం కేసులో దర్యాప్తునకు.. – ఏసీపీ మూల జితేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషన రేట్లో ప్రస్తుతం ఎస్బీ ఏసీ పీగా విధులు నిర్వర్తి స్తున్న యం.జితేందర్‌రెడ్డి హనుమకొండ ఏసీపీగా పనిచేసే సమయంలో ఓ కేసు దర్యాప్తునకు అవార్డు దక్కింది. 2020 జనవరిలో హనుమకొండ రాంనగర్లో ఓ యువతిపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కేసులో దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నిందితుడుకి యావజ్జీవ శిక్ష పడింది. ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో దర్యాప్తునకు... – డీఎస్పీ కె.ఎం.కిరణ్‌కుమార్, ఏసీపీ బోధన్ ప్రస్తుతం బోధన్ ఏసీపీగా పని చే స్తున్న కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌కుమార్ భూపాలపల్లి డీ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు 2017 నవంబర్‌లో రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల దళిత పాపపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు కటకం శివను 3 రోజుల్లోనే గుర్తించి 6 నెలల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. కటకం శివకు యావజ్జీక శిక్ష పడింది. అనాథ బాలిక కేసులో... – డీఎస్పీ సత్యనారాయణరాజు అమీన్పూర్లో అనాథ బాలికపై నెలలపాటు లైంగిక దాడి చేయడం, ఆమె మృతికి కారణమైన కేసు దర్యాప్తును నారాయణ ఖేడ్ డీఎస్పీగా పని చేస్తున్న రాజుల సత్యనారాయణరాజుకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించడంతో ఈ కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. -
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్‌ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్‌కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్‌హామ్‌లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
టోక్యోలో మనం
-
భారత సంతతి వ్యక్తికి అరుదైన పురస్కారం
న్యూయార్క్ : ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తిని ప్రతిష్టాత్మక ‘ఫీల్డ్స్’ మెడల్ వరించింది. ఇండో - ఆస్ట్రేలియన్ అయిన అక్షయ్ వెంకటేష్ ఈ అరుదైన ఘనత సాధించారు. గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఫీల్డ్స్ మెడల్’ను బహుకరిస్తారు. దీన్ని గణిత శాస్త్ర రంగంలో నోబెల్‌గా భావిస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే ఈ పురస్కారం ఈ సారి భారత సంతతి వ్యక్తి అక్షయ్‌ను వరించింది. ఈ అరుదైన పురస్కారాన్ని అక్షయ్ మరో నలుగురితో కలిసి పంచుకునున్నారు. ఈ అవార్డు అందుకున్న వారిలో కచేర్ బిర్కర్(ఇరానీయన్ కుర్దిషియ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు), పీటర్ స్కాల్జ్ (జర్మనికి చెందిన వ్యక్తి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బాన్ అండ్ అలెస్సియో ఫిగల్లిలో ప్రొఫెసర్), మరో ఇటాలియన్ మ్యాథమేటిషియన్లు ఉన్నారు. వీరితో కలిసి అక్షయ్ బ్రెజిల్‌లోని రియో డీ జెనిరాలో ఉన్న ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమేటిషియన్స్’లో బుధవారం (నిన్న) నాడు ఈ అవార్డును అందుకున్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు 15 వేల కెనడియన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో 7, 88, 358 రూపాయలు) విలువైన ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు. 1924 టొరంటోలో జరిగిన మ్యాథ్య్ కాంగ్రెస్‌లో భాగంగా కెనడియన్ గణితశాస్త్రవేత్త జాన్ చార్లెస్ ఫీల్డ్ అభ్యర్ధన మేరకు 1932లో ఫీల్డ్ మెడల్‌ను ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణిత శాస్త్రరంగంలో అపార కృషి చేసిన వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. నలభై ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే దీన్ని ఇవ్వడం ఆనవాయితి. -
భారత టీటీ జట్టుకు పతకం ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత బాలుర జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది. మానవ్ ఠక్కర్, జీతన్ చంద్ర, మనుష్ షాలతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 3–1తో ఇరాన్‌ను ఓడించింది. మరోవైపు మౌమితా దత్తా, అర్చన కామత్, సెలెనాదీప్తిలతో కూడిన భారత బాలికల జట్టు 0–3తో చైనా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
డీఎస్పీ రాజశేఖర్ రాజుకు రాష్ట్రపతి మెడల్
– అభినందించిన డీఐజీ రమణ కుమార్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జాతీయ స్థాయిలో పోలీసులకు ప్రదానం చేసే రాష్ట్రపతి మెడల్‌కు డీఎస్పీ సాళ్వ రామరాజుగారి రాజశేఖర రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా పోలీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఇతనికి.. కర్నూలు రెంజ్ డీఐజీ రమణ కుమార్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఉక్కుపాదంతో ఫ్యాక్షనిజం అణిచివేత చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సుబ్బమ్మ రామరాజు దంపతుల కుమారుడైన రాజశేఖరరాజు ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశారు. ప్రొద్దుటూరు సీఐగా పదోన్నతి పొంది విజయవంతంగా తన విధులను నిర్వహించారు. అక్కడి నుంచి కర్నూలులో ఐదేళ్ల పాటు ఆర్టీసీలో స్పెషల్ డ్రైవ్ ఇన్స్పెక్టర్గా, మరో ఐదేళ్ల పాటు ట్రాన్స్‌కోలో విజిలెన్స్ ఆఫీసర్‌గా పని చేసి కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలా చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అల్లర్లను సమస్ఫూర్తిగా అదుపులోకి తెచ్చారు. అత్యంత సమస్యాక్మమైన మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించడం ఆయన ప్రత్యేకమని పోలీసులు చెప్పుకుంటారు. ఐదేళ్ల నుంచి కర్నూలు జిల్లా పోలీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. అవార్డుల రారాజు... విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా రాజశేఖరరాజుకు మంచిపేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో సేవా మెడల్, ఉత్తమ సేవలకు 2014లో ముఖ్యమంత్రి ప్రశంసాపత్రం, 2016లో పోలీసు ఉత్తమ సేవా మెడల్, బెస్టు ట్రాన్స్‌కో విజిలెన్స్ ఆఫీసర్‌గా పలు అవార్డులు అందుకున్నారు. అంతేకాక సర్వీసులో 225 రివార్డులు, 3 క్యాష్ రివార్డులు, 72 ప్రశంసాపత్రాలు, 62 కమాండేషన్లు, ఒక్క బంగారుపతం, పోలీసు డ్యూటీ మీట్లో ఆల్ రౌండ్ చాంపియన్ షిప్, బెస్టు ఎస్ఐ, బెస్టుసీఐ అవార్డులను అందుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది: రాజశేఖరరాజు, రాష్ట్రపతి పోలీసు మెడల్ అవార్డు గ్రహీత జాతీయ స్థాయిలో బెస్టు పోలీసు మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. రాష్ట్రపతితో అవార్డు అందుకోవడం కోసం ఎదురుచూస్తున్నాను. ఫ్యాక్షన్ ప్రభావిత పోలీసు స్టేషన్లలో ఎక్కువగా పనిచేసి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించా. ఈ అవార్డు మా తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామరాజులకు అంకితం చేస్తున్నా. -
నా గన్ లైసెన్స్ ఎప్పుడో రద్దయింది
నయీమ్ కేసుకు గన్ లైసెన్స్ రద్ధుకు ఎలాంటి సంబంధం లేదు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీమ్‌తో సంబంధాలు వెలుగులోకి వస్తాయి నా పై హత్యకు కుట్ర పన్నారు దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండ: ‘ఆత్మరక్షణ కోసం నేను కొనుగోలు చేసిన గన్ను ప్రభుత్వానికి ఎప్పుడో సరెండర్ చేశాను. నా గన్ లైసెన్స్ ఎప్పుడో రద్దు అయింది. నయీమ్ కేసుకు నా గన్ లైసెన్స్ రద్దుకావడానికి ఎలాంటి సంబంధం లేదు’ అని టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీమ్‌తో సంబంధాలు కలిగిఉన్నట్లు ఆ కారణంగానే ప్రభుత్వం నా గన్ లైసెన్స్ రద్దు చేసినట్లు’ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను హత్య చేయించడానికి కోమటరెడ్డి బ్రదర్స్ పథకం పన్నారని దాంతో ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నుంచి గన్‌లైసెన్స్ పొందినట్లు దుబ్బాక పేర్కొన్నారు. నయీమ్‌తో సంబంధాలు కలిగినట్లు విచారణలో తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో నయీమ్ భౌతికంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గెలుపునకు పనిచేశారని, నల్లగొండను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేశారాని ఆరో పించారు. నయీమ్ అనుచరుడు యూసుఫ్ సహకారంతో టీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు పాల్పపడ్డారని, ముస్లింసోదరులను చంపుతామని బెదిరించాడని తెలిపారు. నయీమ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్విచారణలోత్వరలోనే అవన్నీ వెలు గులోకి వస్తాయన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపడుతున్నందున ఓర్వలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైతికదెబ్బతీసేందుకే తన పై దుష్ప్రచారం చేస్తున్నారని దుబ్బాక విమర్శించారు. నయీమ్ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం ఉన్నా బాధితులు తన పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అబ్బగోనిరమేష్ గౌడ్, బషీర్, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం
నూతనకల్ : మండల పరిధిలోని తాళ్లసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పొడిశెట్టి మహేశ్వరికి ఉపాధ్యాయులు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగాని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిస్కస్‌త్రోలో పాఠశాలకు చెందిన విద్యార్థిని మూడో స్థానంలో నిలవడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సరైన సౌకర్యాలు లేనప్పటికీ తనలోని ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం అదృష్టంగా బావిస్తున్నామన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు వర్థెల్లి కృష్ణ, ఎన్. దుర్గాప్రసాద్‌రెడ్డి, మధుకర్, రాందాస్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
'మెడాల్'కు మేత!
పరీక్షల పేరుతో ప్రైవేట్ సంస్థకు రోజుకు రూ.50 లక్షలు చెల్లింపు ఏడాదికి రూ.180 కోట్లు.. మూడేళ్లకు రూ.540 కోట్లు • ఈ సొమ్ముతో అన్ని ఆస్పత్రుల్లో యంత్రాలు • సమకూర్చుకోవచ్చంటున్న అధికారులు • నిధులు గాలికి... ప్రైవేట్‌పైనే పాలకుల మోజు • రక్త పరీక్షల కోసం మెడాల్ మాయోపాయాలు • ఆ సంస్థ పరీక్షల ఫలితాలన్నీ తప్పుల తడకలే • ఫ్రాంజైజీలను అమ్ముకుంటున్న ప్రైవేట్ సంస్థ • అవసరం లేకపోయినా పరీక్షలు రాస్తున్న వైద్యులు కాలు బెణికిందని ఆస్పత్రికి వెళ్తే మెదడుకు ఎమ్మారై స్కానింగ్ చేయించుకోమని వైద్యుడు చీటీ రాస్తే ఎలా ఉంటుంది?.. వాంతులతో బాధపడే వారిని వెన్నుపూస ఎక్స్‌రే తీయించుకోమని చెబితే ఏమనిపిస్తుంది?.. జబ్బొకటైతే ఔషధం వేరేదిస్తే రోగం నయమౌతుందా?.. సర్కారీ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ సంస్థ తీరు అచ్చం అలాగే ఉంది. సాక్షి, హైదరాబాద్/పార్వతీపురం/గుడివాడ టౌన్ : ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జి.శ్రీనివాసరావు గ్యాస్ట్రిక్ సమస్యతో ప్రభుత్వ ఆస్పత్రికెళ్లగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌తోపాటు అవసరం లేని మరికొన్ని పరీక్షలు రాశారు. మరోచోట కుక్క కరిచి ఆసుపత్రిలో చేరినా ఎనిమిది రకాల పరీక్షలు రాశారు. ఇంతేకాదు.. సాధారణ వైరల్ జ్వరాలకూ 10 రకాల టెస్టులు చేయించుకురావాలని పురమాయిస్తున్నారు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు?.. ఒక్క ‘మెడాల్’కు మేత పెట్టేందుకే! రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న మెడాల్ సంస్థకు దోచిపెట్టేందుకు ఇలా అడ్డగోలు రక్త పరీక్షలన్నీ రాస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడం కోసం ఓ ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర సర్కారు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. రక్త పరీక్షల కోసం మెడాల్ అనే సంస్థతో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రోజుకు అక్షరాలా రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి రూ.180 కోట్లు... మూడేళ్లకు రూ.540 కోట్లు. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ యంత్రం పాడైతే మరమ్మతుల కోసం కనీసం రూ.2 వేలు కూడా విదల్చని ప్రభుత్వం ఇలా ప్రైవేట్ సంస్థకు భారీగా నిధులు ఇస్తుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల దండుకుంటున్న మెడాల్ సంస్థ కనీసం పరీక్షలనైనా సక్రమంగా చేస్తోందా? అంటే అదీ లేదు. ఆ సంస్థ నిర్వహస్తున్న పరీక్షల ఫలితాలు తప్పుల తడకలేనని తేలుతోంది. కొందరు మంత్రుల బంధువులు, మాజీ నేతలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు మారి ప్రభుత్వ ధనాన్ని దోచుకుతింటున్నట్టు వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అసలు మెడాల్ చేస్తున్న వ్యాపారం దారుణమని రోజువారీ నివేదికలు అందుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పట్టణాల్లో రక్త పరీక్షల నిర్వహణను కొన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన మెడాల్ అమ్మేసుకుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు స్థానిక నేతల కనుసన్నల్లో ఉండడంతో వారు మెడాల్‌పై ఈగ వాలనివ్వడం లేదు. రూ.100 కోట్లకు మించి అవసరం లేదు రాష్ట్రంలో 32 ఏరియా ఆస్పత్రులు, 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులన్నింటిలో రక్త పరీక్షల యంత్రాల ఏర్పాటు, నిర్వహణకు రూ.100 కోట్లకు మించి అవసరం లేదని నిపుణుల పరిశీలనలో తేలింది. ఆటో అనలైజర్, సెల్‌కౌంటర్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇలాంటి పరికరాలన్నింటికీ కలిపి రూ.30 లక్షలు వెచ్చిస్తే చాలు. ఈ పరికరాలు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు మాత్రమే అవసరం. పీహెచ్సీ స్థాయిలో అయితే రూ.5 లక్షలు వెచ్చిస్తే ప్రాథమిక పరీక్షలకు నిర్వహించవచ్చు. ఇది ఒకసారి పెట్టుబడి మాత్రమే. ప్రధాన పరీక్షలన్నీ ఈ పరికరాలతోనే చేయచ్చు. ఇక నెలవారీ సిబ్బంది వేతనాలు, పరీక్షలకు కావల్సిన కిట్లు, రసాయనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి నెలకు రూ.1.50 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.180 కోట్లు అప్పనంగా చెల్లిస్తుండడం గమనార్హం. సొంతంగా రక్త పరీక్షలు నిర్వహిస్తే ఖర్చు భారీగా తగ్గి, నిధులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రజల సొమ్మును ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టడంపైనే పాలకులు శ్రద్ధ చూపుతున్నారు. రోజుకు 21 వేల మందికి పరీక్షలు రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆరు నెలల క్రితం టెండర్లు పిలిస్తే మెడాల్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ దక్కేలా చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో రక్త నమూనాకు ప్రభుత్వం రూ.245 చొప్పున చెల్లించాలి. రోజుకు 12 వేల మంది రక్త నమూనాలు ఇప్పిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెడాల్ సంస్థ రాష్ట్రంలో రోజుకు 21 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే ఒక్కో పరీక్షకు రూ.245 చొప్పున ప్రభుత్వం రోజుకు రూ.50.45 లక్షలు చెల్లిస్తోంది. కేవలం రక్త పరీక్షలకే రోజుకు అర కోటి చెల్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ సంస్థకు ఏడాదిపాటు చెల్లించే సొమ్ముతో రాష్ట్రంలోని 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తపరీక్షల కోసం అత్యుత్తమ యంత్రాలను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు పువ్వులు.. ఆరు కాయలు మెడాల్ వ్యాపారం ఆరు మాసాల్లోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. రక్త పరీక్షల కేసులు అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారం రూ.కోట్లలోకి చేరింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు కలెక్టర్లు కూడా మెడాల్‌కు ఇబ్బడిముబ్బడిగా రక్త పరీక్షల కేసులు రాయాలని వైద్యులకు ఆదేశాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 2016 జనవరి నుంచి మెడాల్ చేసిన రక్త పరీక్షలను చూస్తే వీరి వ్యాపారం ఏస్థాయిలో పెరిగిందో తెలిసిపోతుంది. నెల మెడాల్ చేసిన టెస్టులు --------------------------- జనవరి 940 ఫిబ్రవరి 81,755 మార్చి 1.77 లక్షలు ఏప్రిల్ 2.03 లక్షలు మే 2.62 లక్షలు జూన్ 2.80 లక్షలు ఫ్రాంచైజీల లెక్కన అమ్మకం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెడాల్ సంస్థ సొంతంగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లతో మాట్లాడుకొని గుడ్‌విల్ కింద రూ.లక్షలు వసూలు చేసుకుని ఫ్రాంచైజీల లెక్కన అమ్ముకున్నారు. ఇలా ప్రతి జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్‌లతో మాట్లాడుకొని నయాపైసా పెట్టుబడి పెట్టకుండా మెడాల్ సంస్థ దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఫ్రాంచైజీలు మెడాల్‌కు చెల్లించిన సొమ్మును రాబట్టుకునేందుకు డాక్టర్లకు విదేశీ పర్యటనల ఆఫర్లు ఇస్తూ ఎక్కువ సంఖ్యలో బ్లడ్ టెస్టులను రాయించుకుంటున్నాయి. మెడాల్‌కు మేలు చేసేందుకు అవసరం లేకపోయినా వైద్యులు రక్త పరీక్షలు రాస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వరదాయపాలెంలో మాయ చిత్తూరు జిల్లా వరదాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు నాలుగైదుకు మించి రక్త పరీక్షలు జరగవు. గత రెండు నెలల్లో 90 టెస్టులు జరిగినట్టు పీహెచ్‌సీలోని రిజిస్టర్ నమోదైంది. కానీ, 250 టెస్టులకు పైగా జరిగినట్టు కోర్ డ్యాష్‌బోర్డులో చూపిస్తున్నారు. అంటే ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ప్రమేయం లేకుండా మెడాల్ సంస్థే ఇష్టారాజ్యంగా టెస్టులు చేసుకుంటున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇదేమి కౌంట్.. మెడాల్ తప్పుడు నివేదికలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మెడాల్ సంస్థ. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తికి సోమవారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో మెడాల్ సంస్థ రక్త పరీక్షలు నిర్వహించింది. ఆ సంస్థ రిపోర్టులో ప్లేట్లెట్ కౌంట్ 65,000గా ఉంది. అంత తక్కువగా కౌంట్ రావడంపై అనుమానం వచ్చి ఆయన ఆ రిపోర్టు వచ్చిన రెండు గంటల్లోనే పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ రిపోర్టులో కౌంట్ 2,38,000గా ఉంది. బుధవారం ఏరియా ఆసుపత్రిలోని మెడాల్ సిబ్బందిని నిలదీయగా.. తమకేమీ తెలియదని, రక్తం తీసి పంపించేంతవరకే తమ పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 4 గంటల తర్వాతే రక్త పరీక్షలు వాస్తవానికి రక్త నమూనాలను సేకరించిన 2 గంటల్లోగానే ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించాలి. కానీ, ఉదయం 11 గంటలకు సేకరించి, సాయంత్రం 4 గంటలకు కూడా పరీక్షలు చేయడం లేదు. సాయంత్రం 4 గంటల వరకూ రక్తపరీక్షలు జరిగినట్టు చూపించడం లేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలల్లో పరీక్షలు జరిగినట్టు కోర్‌డ్యాష్ బోర్డులో చూపిస్తున్నారు. అంటే నాలుగైదు గంటల తర్వాత పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈలోగా రక్తం గడ్డకడుతోంది. దీంతో తప్పుడు రిపోర్టులు వస్తున్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం ‘‘రక్త పరీక్షల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రధానమైన హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ పరీక్షలు మెడాల్ ప్యాకేజీలో లేవు. అయినా ఇంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? ప్రస్తుతం రోజుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. రేపు రూ.కోటి అవుతుందని ప్రైవేట్ సంస్థ చెబితే, ప్రభుత్వం చేతులెత్తేస్తే బాధ్యత ఎవరిది? రక్త పరీక్షలను ప్రైవేట్‌కు కట్టబెట్టకుండా ఆ డబ్బుతో ప్రభుత్వమే నిర్వహించాలి’’ - డా.గేయానంద్, ఎమ్మెల్సీ -
సింధు సంచలనం
-
సింధు సంచలనం
రియో డి జెనీరో: విమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఇహాన్ ను మట్టికరిపించి సంచల విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఇహాన్ తో తలపడిన సింధు 22-20, 21-19 లతో వరుస సెట్లలో విజయాన్ని సాధించింది. మొదటి సెట్ ప్రారంభంలో కొద్దిగా తడబాటుకు గురైన సింధు వేగంగా పుంజుకుని సెట్ ను గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న రెండో సెట్ లో సింధు ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్ ను కోల్పొయిన వాంగ్ రెండో సెట్ లో టెంపర్ మెంట్ ను కోల్పొయినట్లు అనిపించింది. వరుసగా సింధుకి అవకాశాలిచ్చిన వాంగ్ రెండో సెట్ లో సగం వరకూ రెండు పాయింట్ల వెనకంజలోనే ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింధు పత్యర్ధిని మట్టికరిపించి సెమీ ఫైనల్ లోకి ప్రవేశించింది. -
ఇంకా నిరీక్షణే...
పతకం కోసం భారత్ ఎదురుచూపులు గత నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (లండన్, బీజింగ్, ఏథెన్స్, సిడ్నీ) పోటీలు మొదలైన నాలుగు రోజుల్లోపే భారత్ పతకాల బోణీ చేసింది. కానీ రియో ఒలింపిక్స్‌లో మాత్రం వారం రోజులు గడిచినా మనోళ్లు ఇంకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయారు. కచ్చితంగా పతకం తెస్తారనుకున్న వారంతా ఒక్కొక్కరుగా నిష్ర్కమిస్తుండటంతో... పతకం కోసం భారత్ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ‘గన్’ గురి సరిపోలేదు లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం బోణీ చేసిన షూటర్ గగన్ నారంగ్ ఈసారి తడబడుతున్నాడు. తన తొలి ఈవెంట్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైన ఈ హైదరాబాద్ షూటర్... రెండో ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలోనూ విఫలమయ్యాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గగన్ నారంగ్ 623.1 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 47 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన మరో షూటర్ చెయిన్ సింగ్ 619.6 పాయింట్లు సాధించి 36వ స్థానంలో నిలిచాడు. పురుషుల స్కీట్ ఈవెంట్లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక మేరాజ్ అహ్మద్ ఖాన్ 72 పాయింట్లతో 10వ స్థానంలో... 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక గుర్ప్రీత్ సింగ్ 289 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు. అతాను ఆదుకోలేదు ఆర్చరీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో అతాను దాస్ 4-6తో (28-30, 30-28, 27-27, 27-28, 28-28) ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ సెయుంగ్ యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆర్చరీలో భారత పోరు ముగిసింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో... లక్ష్మీరాణి తొలి రౌండ్లో నిష్ర్కమించారు. లీ సెయుంగ్ యున్‌తో జరిగిన పోటీలో ఇద్దరూ చెరో సెట్ గెలిచాక స్కోరు 2-2తో సమమైంది. మూడో సెట్లో మూడో బాణంపై 9 పాయింట్లు సాధిస్తే అతాను సెట్ గెలిచేవాడు. కానీ ఎనిమిది మాత్రమే రావడంతో స్కోరు సమమై ఇద్దరికీ ఒక్కో పాయింట్ లభించింది. నాలుగో సెట్‌ను కోల్పోయిన అతాను ఐదో సెట్లో స్కోరును సమం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీకాంత్ శుభారంభం మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. గ్రూప్ ‘హెచ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 21-17తో లినో మునోజ్ (మెక్సికో)పై గెలుపొందాడు. జ్వాల-అశ్విని జంట అవుట్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ ఈవెంట్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కథ ముగిసింది. నాకౌట్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో ఈ భారత నంబర్‌వన్ జోడీ ఓడిపోయింది. ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) ద్వయంతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 16-21, 21-16, 17-21తో ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లోనూ జ్వాల జంట ఓడిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన మిసాకి-అయాక (జపాన్), ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మను అత్రి జోడి పోరాటం కూడా ముగిసింది. ఈ భారత జంటకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సుమీత్-మను అత్రి 13-21, 15-21తో బియావో చాయ్-వీ హాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
ఏదీ గుర్తురాలేదు...!
కరణం మల్లీశ్వరి... భారత క్రీడారంగంలో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణి. ఈనాటికీ ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక అసలు సిసలు పదహారణాల తెలుగు బిడ్డ. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో జన్మించి... ప్రపంచం అంతా కీర్తించే స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌కు అప్పట్లో మల్లీశ్వరి ఎలా సన్నద్ధమైంది. పోటీల్లో పాల్గొనే సమయంలో ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించింది. అసలు ఇప్పుడేం చేస్తోంది..? భవిష్యత్‌లో మళ్లీ ఆటకు తిరిగి చేయబోతున్నదేంటి..? ఇలాంటి అనేక అంశాలతో మల్లీశ్వరి కాలమ్ ‘సాక్షి’కి ప్రత్యేకం. కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ (2000)లో తొలిసారి మహిళలకు వెయి ట్ లిఫ్టింగ్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మా అందరిలోనూ ఒక రకమైన ఉద్వేగం. అయితే అప్పటి వరకు నేను అంతర్జాతీయ స్థాయిలో 54 కిలోల కేటగిరీలోనే పాల్గొని పతకాలు సాధిం చాను. నా ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం కూడా ఇదే కేటగిరీ లో వచ్చింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మాత్రం 69 కేజీల విభాగంలో పోటీ పడ్డాను. ఈ కేటగిరీలో నాకు ఇదే తొలి అంతర్జాతీయ ఈవెంట్ కూడా. అందరిలాగే నేనూ ఒలింపిక్స్ కోసం కఠోర సాధన చేశాను. సన్నాహక శిబిరంలో చాలా కష్ట పడ్డాను. సిడ్నీ వెళ్లేటప్పుడు కూడా మనసులో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈవెంట్ ప్రారంభానికి ముందు కూడా నాపై ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలేదు. ప్రశాంతంగానే పోటీకి సిద్ధమయ్యాను. స్వర్ణం కోల్పోయాను పోటీలు జరిగిన రోజు కొద్దిగా టెన్షన్‌తో ఉన్నా ... ఒక్క సారి డయాస్ వద్దకు వెళ్లగానే ఏ విషయమూ మనసులోకి రాలేదు. ఎదురుగా ఎంత మంది ఉన్నా, పతకం, రికార్డులాంటివేవీ ఆలోచించలేదు. బార్‌పై చేతులు ఉంచగానే మన శక్తిని అంతా ఒక్క చోటికి చేర్చి బరువు ఎత్తడమొక్కటే నాకు తెలిసిన పని. అది మినహా ఆ క్షణంలో ఏదీ గుర్తురాలేదు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 110 కేజీలు స్కోర్ చేశాను. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125, 130 కిలోలు ఎత్తగలిగాను. మూడో ప్రయత్నంలో వాస్తవానికి 132.5 కిలోలు ఎత్తినా నాకు స్వర్ణం లభించేది. కానీ మా కోచ్‌లు లెక్కల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల నేను స్వర్ణం కోల్పోయాను. మూడో ప్రయత్నంలో నేను 137.5 కిలోల బరువు ఎత్తే విధంగా లక్ష్యం పెట్టుకున్నాను. ఇంత బరువు కోసం ట్రైనింగ్ సమయంలో సాధన చేసినా... అసలు పోటీల్లో అంత సులువు కాదు. రెండో ప్రయత్నంలో 130 కిలోలు ఎత్తిన నేను మూడో సారి అంతకంటే ఐదు కిలోలు అదనంగా అయినా ప్రయత్నించగలిగేదానిని. కానీ ఏకంగా ఏడున్నర కిలోలు తేడా తీసుకు రావడం అనేది దాదాపు అసాధ్యం. కేవలం అదనంగా రెండున్నర కిలోలు పెంచి 132.5 కిలోలు లక్ష్యంగా చేసుకోవాల్సింది (ఈ మొత్తం ఎత్తితే మల్లీశ్వరి స్కోరు 242.5 అయ్యేది. స్వర్ణ, రజతాలు గెలిచిన ఇద్దరూ ఇంతే బరువు లేపారు. అయితే ఈ ముగ్గురిలో బరువు తక్కువగా ఉన్న మల్లీశ్వరికి మొదటి స్థానం దక్కేది). కానీ 137.5 నా వల్ల కాక విఫలమయ్యాను. చివరకు 110 ప్లస్ 130 కలిపి 240 కేజీలతో కాంస్య పతకమే లభించింది. చేతులారా స్వర్ణం పోగొట్టుకున్నాననే అంశం నన్ను చాలా సార్లు బాధించింది. అది అపూర్వం స్వర్ణం కోల్పోయిన ఆలోచన కొద్ది సేపు ఉన్నా... ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం గెలిచిన తొలి క్రీడాకారిణిని నేనే కావడం ఎప్పటికీ గర్వపడేలా చేసింది. సిడ్నీలో ఉన్న భారత బృందం మొత్తం కలిసి అభినందనలు తెలిపి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నా విజయం విలువేమిటో తెలిసింది. దేశ ప్రధాని వాజ్‌పేయి కూడా ఫోన్ చేసి అభినందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత లభించిన అపూర్వ స్వాగతం, సన్మానాలు ఎప్పటికీ మరచిపోలేను. తెలుగు ప్రజలంతా నా విజయాన్ని తమ విజయంగా భావించారు. మన మల్లి అంటూ వాడవాడలా అభినందనలు తెలియజేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనే కల నెరవేరడం, తొలి మహిళను నేనే కావడంతో అవి నా జీవితంలో అత్యుత్తమ క్షణాలుగా నిలిచాయి. ఏథెన్స్లో నిరాశ కాంస్యం సాధించడంతోనే సరిపెట్టకుండా తర్వాతి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. బరువు తగ్గి వెయిట్ కేటగిరీ 69 కేజీలనుంచి 63 కేజీలకు మారాను. బెంగళూరులో జరిగిన క్యాంపులో కూడా తీవ్రంగా సాధన చేశాను. అయితే కీలక సమయంలో దురదృష్టం వెంటాడింది. స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో బరువు ఎత్తే సమయంలోనే నా వెన్నుపూస పట్టేసింది. దాంతో పోటీనుంచి ఒక్కసారిగా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి వెన్ను గాయం నన్ను అంతకు ముందు చాలా రోజులనుంచే బాధిస్తోంది. కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడ్డా చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. కోచ్‌లు కూడా అప్పటి వరకు కోలుకోగలవని ప్రోత్సహించారు. ఆ నమ్మకంతోనే ఏథెన్స్ వెళ్లాను. కానీ నా రెండో ఒలింపిక్స్ అలా ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ లిఫ్టింగ్ చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరించడంతో ఆటను ఆపేశాను. ఏథెన్స్ తర్వాత ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత కొన్నేళ్లలో డోపింగ్ తదితర వివాదాల కారణంగా వెయిట్ లిఫ్టింగ్‌కు బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఫలితాలు కూడా ఆశించినంత గొప్పగా లేకపోగా, చాలా మంది ఇతర క్రీడల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సారి రియోకు ఇద్దరు లిఫ్టర్లే వెళుతున్నారు. వారి ప్రదర్శనపై నమ్మకముంది. కానీ పతకంపై ఏమీ చెప్పలేం. అనుబంధం కొనసాగిస్తా రిటైర్మెంట్ తర్వాత నేను వెయిట్లిఫ్టింగ్కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గౌరవ హోదాలో సాయ్‌లో కూడా అనేక బాధ్యతలు నిర్వహించాను. అర్జున అవార్డులు తదితర ఇతర కమిటీల్లో భాగంగా ఉన్నాను. ప్రస్తుతం శాప్ డెరైక్టర్లలో ఒకరిగా ఉన్నాను. అయితే నేరుగా కోచ్‌గా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యవహరించలేదు. పైగా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యతో కూడా పెద్దగా కలిసి పని చేయలేదు. కానీ నా ఆటను నలుగురితో పంచుకోవాలని, శిక్షణ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. సాధ్యమైనంత త్వరలో నా స్వస్థలంలో అకాడమీ ప్రారంభం అవుతుంది. కుమారుడు షూటర్‌గా... వ్యక్తిగత జీవితంలో నా భర్త రాజేశ్ త్యాగి ఎంతో అండగా నిలిచారు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద అబ్బాయి శరద్ త్యాగికి 15 ఏళ్లు. అతను క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. పూర్తి స్థాయిలో షూటింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకున్న శరద్... 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. మా ఇంట్లోకి మరో ఒలింపిక్ పతకం తీసుకు రాగలడేమో చూడాలి. రెండో అబ్బాయి అంగద్ త్యాగికి పదేళ్లు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ
మెక్సికో సిటీ: భారత ఆర్చర్ అభిషేక్ వర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో కాంపౌండ్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్ వర్మ 143-145 పాయింట్ల తేడాతో దెమిర్ ఎల్మాగ్స్లి (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు సెమీఫైనల్లో వర్మ 150-142తో మారియో కార్డోసో (మెక్సికో)పై, క్వార్టర్ ఫైనల్లో 148-146తో మార్టిన్ డామ్బో (డెన్మార్క్)పై విజయం సాధించాడు. -
ప్రతిసారీ గర్వపడతా
సాక్షి, హైదరాబాద్: దేశం తరఫున ఆడి గెలిచిన ప్రతీ పతకం ప్రత్యేకమైనదేనని, దేనికి ఎక్కువ విలువ అంటే చెప్పలేమని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. పతకం గెలిచాక జాతీయ పతాకం ఎగిరిన ప్రతిసారీ గర్వపడతానని చెప్పింది. ఆసియా క్రీడల తర్వాత చైనా ఓపెన్ ఆడి హైదరాబాద్ వచ్చిన సానియా... సోమవారం మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... గత రెండు నెలలు అద్భుతం: యూఎస్ ఓపెన్ నుంచి కాలం చాలా వేగంగా గడిచినట్లు అనిపించింది. ఆడిన ప్రతిచోటా విజయాలు వచ్చాయి. కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నా. అన్నీ సరైన ఫలితాన్ని ఇచ్చాయి. ఆసియా క్రీడల్లో పతకాలు: ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం... నాకు వ్యక్తిగతంగా ఎనిమిదో పతకం. వెళ్లిన ప్రతిసారీ మెడల్స్ సాధించినందుకు గర్వంగా ఉంది. నేను, సాకేత్ కలిసి సాధించిన స్వర్ణం చాలా ప్రత్యేకం. సాకేత్ తన ర్యాంక్ (189) కంటే చాలా మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఈ పతకంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగి మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశిస్తున్నాను. పాల్గొన్న తొలిసారే స్వర్ణం, రజతం గెలవడం గొప్ప ఘనత. అది సాకేత్ సాధించాడు. అలాగే మహిళల డబుల్స్‌లో తొలిసారి మనకు పతకం వచ్చింది. దేశంలో మహిళల టెన్నిస్ మెరుగుపడిందనడానికి ఇదే ఉదాహరణ. సాకేత్ గురించి: మంచి వ్యక్తి. మేం కలిసి హైదరాబాద్‌లో గతంలో ప్రాక్టీస్ చేశాం. ఆసియా క్రీడల్లో ఆడాలని నిర్ణయం తీసుకోగానే ఎవరితో ఆడాలనే అంశం చర్చించాం. సాకేత్‌తో కలిసి ఆడిన తొలి మ్యాచ్‌లో కాస్త తడబడ్డాం. కానీ ఒక్క మ్యాచ్‌తోనే పరస్పరం అర్థం చేసుకున్నాం. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. గతంలో ఆసియా క్రీడలకు వెళ్లిన ప్రతిసారీ జట్టులో నేనే యువ క్రీడాకారిణిగా ఉండేదాన్ని. ఇప్పుడు సీనియర్ క్రీడాకారిణిగా వెళ్లాను. ఈ క్రీడల్లో లభించిన అనుభవం, సాధించిన పతకాలతో... వచ్చే ఆసియా క్రీడల్లో ఈ యువ క్రీడాకారులంతా మరిన్ని పతకాలు సాధిస్తారనే విశ్వాసం ఉంది. ఏ పతకం ప్రత్యేకం: దేశం తరఫున గెలిచిన ప్రతి పతకం ప్రత్యేకమే. టీమ్ ఈవెంట్లలో ఏ ఒక్కరి వల్లో విజయాలు రావు. సమష్టి కృషితోనే మంచి ఫలితాలు వస్తాయి. దేశం తరఫున పతకం గెలవగానే జాతీయ జెండా ఎగిరిన ప్రతిసారీ గర్వపడతా. ఆసియా క్రీడల్లో ఆడటం నేను తీసుకున్న మంచి నిర్ణయం. విశ్రాంతి లేదు: ఎనిమిది వారాలుగా అస్సలు విశ్రాంతి దొరకలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ విరామం లేదు. డబ్ల్యూటీఏ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆడటానికి 17న సింగపూర్ వెళుతున్నాను. గత ఏడాది ఐదు టైటిల్స్ గెలిచాను. అయితే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లు ఏడాదికి 30 వారాల పాటు ఆడుతూనే ఉండాలి. విజయం వస్తే సంబరం చేసుకోవడానికి, ఓడిపోతే బాధపడటానికి కూడా సమయం దొరకదు. ఎప్పటికీ హైదరాబాదీనే: నేను హైదరాబాద్ అమ్మాయిని. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం. హైదరాబాద్‌తో, భారతదేశంతో నా అనుబంధం ఎప్పటికీ ఉంటుంది. షోయబ్ హైదరాబాద్‌లో ఆడటం: తను నగరానికి వచ్చినప్పుడు నేను లేకపోవడం దురదృష్టమే. అయితే నేను ఆ సమయంలో దేశం తరఫున ఆడుతున్నాను. కాబట్టి ఎలాంటి బాధా లేదు. తను కూడా ఇక్కడ ఉన్న రోజులను బాగా ఆస్వాదించాడు. కొత్త భాగస్వామి: కొన్ని కార ణాల వల్ల నేను, ప్రస్తుత భాగస్వామి కారా బ్లాక్ విడిపోయాం. ఇకపై మహిళల డబుల్స్‌లో చైనీస్ తైపీ అమ్మాయి సు వీ సెయితో కలిసి బరిలోకి దిగబోతున్నాను. సెయి ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి. కారా బ్లాక్ చాలా మంచి వ్యక్తి. తనతో నా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది. -
ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్
ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణష్. ఇది సినిమా డైలాగ్. నిజ జీవితంలో కార్మికుడి కొడుకు ఆటైనా.. ఈతైనా.. పరుగైనా.. సైక్లింగైనా.. ఒంటి చేత్తో జాతయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. మణికట్టు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న మురళికి వికలాంగులే ప్రేరణ అయ్యారు. రామగుండం(కరీంగనర్), న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని రాంనగర్లో నివాసముంటున్న తడబోయిన రమేష్-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్, మురళి, సరళ సంతానం. రమేష్ సింగరేణి రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 మేయిం టనెన్స్ సెక్షన్లో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మురళికి పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు లేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన అతడికి కుటుంబ సభ్యులు, మిత్రులు, కోచ్‌ల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న మురళి పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. వికలాంగులే ప్రేరణ చిన్నతనంలో సెలవు దినాల్లో కామారెడ్డి సమీపంలోని ముత్యంపేట గ్రామానికి వెళ్లిన మురళి అక్కడ చూసిన ఆ దృశ్యం అతడి జీవితాన్నే మార్చేసింది. రెండుకాళ్లు, ఒక చేయి లేని వ్యవసాయ కూలి చెరువులో ఈత కొడుతుంటే చూసి ఆక్చర్యపోయాడు. అంతే కాదు.. తన తాత మల్లయ్యకు కంటి చూపు లేకున్నా గోదావరిలో ఈత కొడుతుంటే గమనించాడు. కరీంనగర్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మాదాసు శ్రీనివాస్‌కు రెండు కాళ్లు లేవు. ఆయన క్రీడల్లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ దగ్గరగా గమనించిన మురళిలో ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. క్రీడారంగలో అడుగులు ముందుకు వేయడానికి దారి చూపాయి. డిగ్రీ చదువుతున్న కాలేజీ డెరైక్టర్ రాజేందర్, లెక్చర్లు రాజయ్య, రవీందర్ మిత్రులుగా మారిపోయారు. తోటి క్రీడాకారులు అఖిల్షాఖన్, మధు, ఆనంద్, కోచ్‌లు కష్ణమూర్తి, కొండయ్య, శ్రీనివా స్, లైఫ్‌సేవింగ్ టీం మెంబర్ గౌతం ప్రోత్సాహం పుష్కలంగా లభించింది. తొలిసారి వరంగల్‌లో స్టేట్‌లెవల్ స్విమ్మింగ్ మీట్‌కు వెళ్లడానికి భయం పడుతుంటే.. మిత్రులు అఖిల్షాఖన్, ఆనంద్ కాలేజీకి డుమ్మాకొట్టి పోటీలకు తీసుకుపోగా ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం లో నిలిచాడు. ఇది మురళి క్రీడా జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా మారింది. దీంతో ప్రతీ ఈవెంట్‌ను ఛాలెం జ్గా తీసుకుంటూ ముందుకు సాగాడు. సాధించిన విజయాలు చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పారా ఒలంపిక్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు అంశాలలో(750 మీటర్ల ప్రీస్టైల్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైకిలింగ్, 5 కిలోమీటర్ల పరుగు పందెం) కోలకతాలో జరిగిన పారా ఒలంపిక్ త్రైత్లాన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన రాష్ట్రీయ క్రీడల్లో ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడి బంగా రు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీలే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడమే తన లక్ష్యం. ఇందుకోసం అవసరమైన కసరత్తు చేస్తున్నాను. రక్షణ శాఖ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్(డీఆర్డీఓ)లో ఉద్యోగం చేయాలని ఉంది. -తడబోయిన మురళి