కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం | appriciation to who got brass medal | Sakshi
Sakshi News home page

కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం

Published Thu, Sep 29 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం

కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం

నూతనకల్‌ : మండల పరిధిలోని తాళ్లసింగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పొడిశెట్టి మహేశ్వరికి ఉపాధ్యాయులు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగాని శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిస్కస్‌త్రోలో పాఠశాలకు చెందిన విద్యార్థిని మూడో స్థానంలో నిలవడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సరైన సౌకర్యాలు లేనప్పటికీ తనలోని ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం అదృష్టంగా బావిస్తున్నామన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు వర్థెల్లి కృష్ణ, ఎన్‌. దుర్గాప్రసాద్‌రెడ్డి, మధుకర్, రాందాస్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement