ఇత్తడి .. పుత్తడి ఒక్కటేనా అంటారు. కాని ఇంటి అలంకరణ విషయంలో మాత్రం ఇత్తడి.. పుత్తడి కన్నా మిన్న.. నాడు.. నేడూనూ! ఆ కళావైభవం ఎట్టిదనిన.. పూజా సామాగ్రే కాదు ఇప్పుడు సెంటర్ కన్సోల్ టేబుల్స్, సోఫా సెట్స్, కార్నర్ స్పేస్‌లలోనూ ఇత్తడి అందాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇంటీరియర్ పట్ల అత్యంత శ్రద్ధ కనబరచేవాళ్లు ఖరీదు గురించి పట్టించుకోకుండా ఇంటికి ఇత్తడి తెచ్చే కళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ఆధునిక డిజైన్స్ ఇంటీరియర్‌లో మోడర్న్ మెరుపు కావాలనుకుంటున్న వారు బ్రాస్ వెస్ట్రన్ డిజైన్స్ పట్లే మక్కువ చూపుతున్నారు. ల్యాంప్స్, వాల్ డెకర్ సెట్స్ మాత్రమే కాదు పార్టిషన్ వాల్స్, రూమ్ డివైడర్స్‌కీ బ్రాస్‌మెటల్ డిజైన్స్‌నే ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇత్తడిని ఇతర లోహాలైన రాగి, వెండి, అల్యూమినియం వంటివాటితో జతచేసి ఇంటి అలంకరణకు అదనపు సోయగాన్ని అద్దుతున్నారు.
ఇలా డోర్ నాబ్స్ నుంచి వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్, రూఫ్ డెకర్ వరకు ఇంచ్ ఇంచ్‌కు ఇత్తడి ఇచ్చే సొంపు ఎంత చెప్పినా తక్కువే! మరింకెందుకు ఆలస్యం.. ఇంట్లో పాత ఇత్తడి సామానును అటక మీద నుంచి కిందకు దించండి.. ఇంటీరియర్‌లో భాగం చేయండి!!
Comments
Please login to add a commentAdd a comment