brass
-
ఇంపుసొంపుల ఇత్తడి
ఇత్తడి .. పుత్తడి ఒక్కటేనా అంటారు. కాని ఇంటి అలంకరణ విషయంలో మాత్రం ఇత్తడి.. పుత్తడి కన్నా మిన్న.. నాడు.. నేడూనూ! ఆ కళావైభవం ఎట్టిదనిన.. పూజా సామాగ్రే కాదు ఇప్పుడు సెంటర్ కన్సోల్ టేబుల్స్, సోఫా సెట్స్, కార్నర్ స్పేస్‌లలోనూ ఇత్తడి అందాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇంటీరియర్ పట్ల అత్యంత శ్రద్ధ కనబరచేవాళ్లు ఖరీదు గురించి పట్టించుకోకుండా ఇంటికి ఇత్తడి తెచ్చే కళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆధునిక డిజైన్స్ ఇంటీరియర్‌లో మోడర్న్ మెరుపు కావాలనుకుంటున్న వారు బ్రాస్ వెస్ట్రన్ డిజైన్స్ పట్లే మక్కువ చూపుతున్నారు. ల్యాంప్స్, వాల్ డెకర్ సెట్స్ మాత్రమే కాదు పార్టిషన్ వాల్స్, రూమ్ డివైడర్స్కీ బ్రాస్మెటల్ డిజైన్స్‌నే ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇత్తడిని ఇతర లోహాలైన రాగి, వెండి, అల్యూమినియం వంటివాటితో జతచేసి ఇంటి అలంకరణకు అదనపు సోయగాన్ని అద్దుతున్నారు. ఇలా డోర్ నాబ్స్ నుంచి వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్, రూఫ్ డెకర్ వరకు ఇంచ్ ఇంచ్‌కు ఇత్తడి ఇచ్చే సొంపు ఎంత చెప్పినా తక్కువే! మరింకెందుకు ఆలస్యం.. ఇంట్లో పాత ఇత్తడి సామానును అటక మీద నుంచి కిందకు దించండి.. ఇంటీరియర్‌లో భాగం చేయండి!! -
అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?
భారతదేశంలోని ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని కలల నగరం హోదాను కలిగి ఉoడగా, మరికొన్ని చరిత్రను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నాయి. భారతదేశంలోని ఒక నగరాన్ని ఇత్తడి నగరం అని అంటారు. ఆ నగరంలో జరిగే వ్యాపారం మనదేశంలోనే కాదు అమెరికా నుండి యూరప్ వరకు విస్తరించింది. ఆ నగరం గురించి, అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మనదేశ ఘనతను తెలియజేస్తుంది. ఆ నగరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం పేరు మొరాదాబాద్. ఈ నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ప్రభుత్వం ఈ నగరానికి బ్రాస్ సిటీ అనే పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఉత్పత్తి పథకం కింద దీనికి ఈ పేరు వచ్చింది. ఈ నగరంలో తయారైన ఇత్తడి ఉత్పత్తులు భారతీయ సంస్కృతి, వైవిధ్యం, వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇత్తడి వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు, పెద్ద కర్మాగారాలు అనేకం ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు మొదలుకొని మొఘల్ కాలం నాటి ఆకృతుల వరకు అన్నింటినీ ఇక్కడ ఇత్తడితో తయారుచేస్తారు. ఫలితంగా నగరంలో అనునిత్యం ఎక్కడచూసినా పాత్రల తయారీ శబ్ధాలు వినిపిస్తుంటాయి. అమెరికా నుండి యూరప్ వరకు.. బ్రాస్ సిటీలో తయారయ్యే ఉత్పత్తులు భారతదేశంలో విక్రయమవడమే కాకుండా అమెరికా, యూరప్ వంటి ఖండాలకు కూడా ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఇత్తడి ఎగుమతి అవుతుంది. ఇక్కడి ఇత్తడి పరిశ్రమ టర్నోవర్ ఏటా రూ. 8,000 నుంచి 9,000 కోట్ల వరకూ ఉంటుంది. ది వైర్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ నగర జనాభాలో దాదాపు 47% మంది ముస్లింలు. ఇక్కడి ముస్లింలు ఇత్తడి పాత్రల తయారీలో ముందున్నారు. ప్రస్తుతం మొరాదాబాద్‌లో దాదాపు 4,000 మంది ఇత్తడి ఎగుమతిదారులు ఉన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది? -
‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!
పెరవలి: ఇత్తడి.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అజ్జరం. ఇత్తడికి పుట్టిల్లుగా ఈ గ్రామం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవ్వని వస్తువంటూ లేదు. పవిత్రమైన దేవాలయాల్లోను, సామాన్యుల ఇళ్లలోను, సినిమాల్లోనూ కనిపించే అరుదైన ఇత్తడి వస్తువులు అజ్జరంలో తయారైనవే. బ్రిటిష్ వారి హయాం నుంచీ.. బ్రిటిష్ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే. ‘దేవత’ బిందెలు.. ఆలయాల్లో గంటలు ‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే. ఈ గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు. నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. తండ్రి నుంచీ ఇదే వృత్తి మా తండ్రి గారు ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. నాకూ అదే నేర్పారు. మేం ఈ పనిని ఇష్టంగా చేస్తాం. అందుకే ఇంతకాలమైనా విసుగు రాలేదు. వచ్చిన కస్టమర్లు మా పనిని చూసి ఎంతో అందంగా చేస్తున్నావని అన్నపుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ పనిలో ఎంతో హాయి ఉంది. – నున్న వీర వెంకట సత్యనారాయణ, ఇత్తడి వస్తువుల తయారీ కార్మికుడు నేర్చుకునే వారు తగ్గిపోయారు మేం నాయీబ్రాహ్మణులం. ఈ పనంటే ఎంతో ఇష్టం. అందుకే దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాను. మెషీన్లు రావడంతో ఇత్తడి వస్తువుల తయారీ పని నేర్చుకునేవారు ఇప్పుడు తగ్గిపోయారు. కార్మిక చట్టాల వలన పిల్లలు పనికి రావడం లేదు. దీంతో ఈ పని మా తరంతోనే అంతమైపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, కార్మికుడు 40 ఏళ్లుగా ఇదే పని గత 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కులాలకు అతీతంగా అందరం కలసి ఉంటాం. గ్రామంలోని దాదాపు అందరూ ఈ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు యంత్రాల రాకతో పని నేర్చుకునేవారే లేరు. ఈ పనితో కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాం. – యడ్ల పోతురాజు, కార్మికుడు వేగం పెరిగినా కార్మికులు తగ్గిపోయారు ఒకనాడు ఇత్తడి పరిశ్రమ అజ్జరంలో వైభవంగా ఉండేది. యంత్రాలు వచ్చాక పని వేగంగా జరుగుతోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు తగ్గిపోతున్నారు. గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వ్యాపారం ఉంది. మా తాత బెప్పే పేరలింగం, మా తండ్రి సాంబమూర్తి కూడా ఈ వ్యాపారమే చేసేవారు. ఆయనకు మేం ముగ్గురు కుమారులం. అందరం ఈ పనే చేస్తున్నాం. చిన్నాపెద్దా తేడా లేకుండా 20 ఏళ్ల క్రితం అందరూ ఈ పనికి వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు పనికి రావడం లేదు. చిన్నప్పటి నుంచీ పని నేర్చుకునేవారు తగ్గిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. – బెప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని -
పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
తాడిపత్రి: ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వివరాలను బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి ఇత్తడితో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి తాడిపత్రిలో మంగళవారం రాత్రి విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణీబాబు అక్కడకు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ మట్కా నిర్వాహకులు.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమాంవలి, పీర్ల హాజీ ముస్తాఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు. -
ఊరంతా ఉపాధి.. ఇత్తడి ఖజానా అజ్జరం
టంగ్.. టంగ్.. టక్కుంటక్కుం.. అంటూ లయబద్ధంగా వినిపించే శబ్దాలు.. ఏ ఇంటి ముంగిట చూసిన ఇత్తడి సామగ్రి, కళాకృతుల మెరుపులు.. అజ్జరం ప్రత్యేకం.. సాధారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులు చేయడం పరిపాటి. అయితే ఈ గ్రామంలో మాత్రం అన్ని వర్ణాల వారూ కలిసి ఇత్తడి సామాన్ల తయారీని వందల ఏళ్లుగా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దీంతో అజ్జరం ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. గంటల తయారీలో ప్రత్యేకతతో ప్రతి ఆలయంలోనూ ‘అజ్జరం గంట’ మోగాల్సిందే అన్నట్టుగా నిలిచిపోయింది. పెరవలి: దాదాపు 200 ఏళ్ల నుంచి అజ్జరంలో ఇత్తడి సామగ్రి పరిశ్రమ ఉంది. నాడు చేతి పనిముట్లతో వస్తువులు తయారు చేయగా ప్రస్తుతం యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో మార్మోగుతున్నాయి. గ్రామ జనాభా 2,957 మంది కాగా 2,500 మంది ఇత్తడి సామాన్ల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఇత్తడి పని తప్ప మరే పని తెలియదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా సామగ్రి, కళాకృతుల తయారీలో వీరు నైపుణ్యం కనబరుస్తుండటంతో గ్రామంలో ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. అజ్జరంలోని ఇత్తడి పరిశ్రమలో బిందెలను తయారుచేస్తున్న కార్మికులు గంటలు ప్రత్యేకం ఇత్తడితో పలురకాల సామగ్రిని తయారుచేస్తున్నా ఆలయాల్లో గంటల తయారీతో వీరి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను వీరు తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇత్తడి గంటల తయారీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇత్తడి అంటే అజ్జరం.. అజ్జరం అంటే ఇత్తడి.. అన్నట్టుగా పేరు సంపాదించారు. పట్టణాల్లో దుకాణదారులు ‘అజ్జరం వారి ఇత్తడి షాపు’ అని పేరు పెట్టుకుని వ్యాపారులు సాగిస్తున్నారు. మెరుగులు దిద్దుతూ.. 200 ఏళ్ల అనుబంధం అజ్జరానికి ఇత్తడితో అనుబంధం 200 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో ముడిసరుకులను కలకత్తా, మద్రాసు నుంచి తీసుకువచ్చి ఇక్కడ వస్తువులు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడే ఇత్తడి రేకులు తయారుచేసి రాష్ట్ర నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా పనులు చేస్తున్నారు. వేకువజామున పని మొదలుపెట్టి రాత్రి వరకూ పనులు చేస్తూనే ఉంటారు. ఇత్తడి బిందెలు, బకెట్లు, పల్లెం, చెంబు, గంగాళా, డేగిసా, పప్పు గిన్నెలు తదితర పెళ్లి సామగ్రి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అజ్జరం వస్తుంటారు. దీంతో గ్రామ ఖ్యాతి దశదిశలా విస్తరించింది. తరతరాలుగా.. మా తాత పేరలింగం, తండ్రి సాంబమూర్తి ఇదే పనిచేసేవారు. నేనూ ఇదే పనిలో ఉన్నాను. 20 ఏళ్ల క్రితం చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పనికి వచ్చేవారు. తర్వాత కాలంలో చిన్న పిల్లలు పనికిరాకపోవడంతో పనినేర్చుకునే వారు తగ్గారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం. ఈ గంటలు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు అందించాం. అమెరికా కూడా పంపించాం. ఈ మధ్య కాలంలో యంత్రాలపైన తయారీ ఎక్కువయ్యింది. – బొప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని చిన్నప్పటి నుంచీ.. పుట్టినప్పటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. పని పూర్తిగా ఉండటంతో కుటుం బాన్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇటీవల మిషన్లు రావటంతో పనికి డిమాండ్ తగ్గింది. దీని వలన కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. – పాటి సత్యనారాయణ, వర్కర్ తండ్రి ద్వారా.. నా తండ్రి ద్వారా ఈ పని అబ్బింది. పనిని ఇష్టంగా చేస్తాం. మా వద్దకు వచ్చిన కస్టమర్లు మా పనిచూసి ఎంతో అందంగా ఉందని ప్రశంసించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ పనిలోనే హాయి ఉంది. – నున్న వీరవెంకట సత్యనారాయణ, వర్కర్ ఇదే జీవనోపాధి మేము నాయీబ్రాహ్మణులమైనా ఇత్తడి పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాం. మిషన్లు రావటంతో పని నేర్చుకునేవారు తక్కువైపోయారు. దీంతో ఈ పని మా తరంతోనే అంతరించిపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, వర్కర్ 40 ఏళ్లుగా.. 40 ఏళ్లుగా ఈ పనిచేస్తు న్నా. గ్రామంలో అందరూ ఇదే పని చేస్తుంటాం. ఇతర వ్యాపారాలు ఏమీ తెలియవు. ఇటీవల యంత్రాల రాకతో పని నేర్చుకునేవారు తగ్గారు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియలేదు. – యడ్ల పోతురాజు, వర్కర్ -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్‌మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్‌పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్‌మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్‌రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ఇత్తడి పాత్రకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. ఇంట్లో ఉంచి పూజ చేస్తే కోటీశ్వరులు అవుతారని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అమాయకులను నమ్మించి అంటగట్టేందుకు యత్నించిన ఓ రైస్ పుల్లింగ్ ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈమేరకు 14 మంది నిందితులను అరెస్టు చేసి రూ. 1.30 లక్షల నగదు, 16 సెల్ఫోన్లు, హోండా యాక్టివా వాహనంతో పాటు ఇత్తడి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇత్తడి పాత్రకు అద్భుత శక్తులు ఉన్నాయని దానిని రూ. 15 లక్షలకు విక్రయిస్తామంటూ ఒక ముఠా రాజేంద్రన గర్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ సిబ్బంది తాము కొనుగోలు చేస్తున్నట్లు ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. వారం రోజుల పాటు నిందితులతో మాట్లాడి రూ. 15 లక్షలకు కొంటామని నమ్మబలికారు. రాజేంద్రనగర్ కిషన్‌బాగ్ ప్రాంతానికి వచ్చి పాత్రను తీ సుకోవాలని ముఠా సభ్యులు సమాచారం ఇవ్వడంతో రా జేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేశాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన ఏ.శ్రీనివాస్‌గౌడ్, ఎమిగనూ రు గ్రామానికి చెందిన వడ్డె ఇరుకుండ, హన్మకొండ ని వాసి సి.భాస్కర్ , బేలగాల గ్రామానికి చెందిన బి.రాములు, నందవరం మండలాని చెందిన బి.జయ రాముడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నివాసి ప్రవీణ్‌కుమార్, కుత్బుల్లాపూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బిలాల్, మహ్మద్ ఆలీమ్పాషా, రాజేంద్రనగర్ సిక్చౌనీ నివాసి కుల్దీప్సింగ్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సి.రాకేష్, బహదూర్‌పురాకు చెందిన నాగరాజు, దోమలగూడకు నివాసి సంతోష్‌కుమార్, నాంపల్లివాసి మహ్మద్ అబ్దుల్ హసన్, అత్తాపూర్‌కు చెందిన సర్ధార్ డీదర్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు పద్నాలుగు మంది ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను నమ్మించి ఇత్తడిపాత్రను విక్రయించేందుకు ప్రయత్నించారు. ఇత్తడి పాత్రకు ఎలాంటి శక్తులు లేవని, అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసుకొని పారిపోతారని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ఇత్తడి పాత్ర రెట్టింపు డబ్బులు ఇస్తామని టోకరా పోలీసులకు ఫిర్యాదు యాలాల: ఐదేళ్ల తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్కు చెందిన మ్యాతరి వెంకటేష్ ఎస్ఆర్జీసీ అనే సంస్థలో డబ్బులు పొదుపు చేస్తే ఐదేళ్ల తర్వాత రెట్టింపు ఇస్తామని అప్పట్లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలోని పలువురిని నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన గాజుల ఖైరూన్ బేగం, అబ్దుల్ కరీం, షేక్ ఖైసర్ బాను, గురదోట్ల విజయ్, గాజుల మ హ్మద్ ముస్తఫా తదితరులు రూ.25,300 చొప్పున చెల్లించారు. తీ రా గడువు పూర్తయిన తరువాత డబ్బులు ఇవ్వాలని మ్యా తరి వెంకటేష్‌ను కోరగా రేపు, మాపు అంటూ తప్పించు కొని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితు లు తమకు ఇచ్చిన బాండ్లపై ఉన్న చిరునా మాలో ఆరా తీ యగా ఎలాంటి సంస్థ లేదని గుర్తించారు. దీంతో ఆది వారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మ్యా తరి వెంకటేష్ నారాయణపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2 కోట్ల మేర బాధితుల నుంచి సేకరించి మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయాన్ మృతదేహం లభ్యం గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలో రాళ్లలో గుర్తింపు శంషాబాద్: వరదలో కొట్టుకుపోయిన మరో మృతదేహం ఆదివారం లభ్యమైంది. వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఖరీమాబేగం కుమారుడు ఆయాన్(7) మృతదేహం నాలుగురోజులుగా లభ్యం కాలేదు. గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలోని సెలబ్రేషన్ కన్వెన్షన్ దగ్గర రాళ్లలో చిక్కుకుపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వరదలో కొట్టుకుపోయిన ఆయాన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి సన్మానం
నూతనకల్ : మండల పరిధిలోని తాళ్లసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పొడిశెట్టి మహేశ్వరికి ఉపాధ్యాయులు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగాని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిస్కస్‌త్రోలో పాఠశాలకు చెందిన విద్యార్థిని మూడో స్థానంలో నిలవడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సరైన సౌకర్యాలు లేనప్పటికీ తనలోని ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం అదృష్టంగా బావిస్తున్నామన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు వర్థెల్లి కృష్ణ, ఎన్. దుర్గాప్రసాద్‌రెడ్డి, మధుకర్, రాందాస్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇత్తడిని పుత్తడి చేసి అమ్ముతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : ఇత్తడి ఆభరణాలపై బంగారపు పూత పూసి అమ్ముతున్న ఓ ముఠాను అరెస్ట్ చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈస్ట్‌జోన్ జోన్ డీసీపీ. ఈ ఘటనకు సంబంధమున్న 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.3.9 లక్షల నగదు, 15 కేజీల బంగారపు పూత నగలను, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో దొంగతనం కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, వారి నుంచి రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇత్తడి మెరుపు...
ఇంటిటిప్స్ ఇత్తడి లోహం పూజా సామగ్రి, ఇంటి అలంకరణ వస్తువులలో ప్రధానమైనది. అయితే, ఈ వస్తువులు సరిగా శుభ్రపరచకపోతే నల్లబడటం కళ తప్పడం చూస్తుంటాం. ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవాలంటే... ఒక చిన్న పాత్రలో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని క్లాత్కి అద్దుకుంటూ, ఇత్తడి పాత్రలపై రుద్దాలి. తర్వాత మరో పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవాలి. క్లాత్కి కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకొని శుభ్రపరిచిన వస్తువులపై మృదువుగా తుడవాలి. దీంతో అవి కొత్తవాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ (అర చెక్క), టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. నిమ్మ చెక్కపై ఉప్పు వేసి నల్లబడిన ఇత్తడి వస్తువులపై రుద్ది, నీళ్లతో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికి అంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. -
తూచ్.. బంగారం కాదు
ఈ ఫొటోను చూడండి.. ఏదో జరిగినట్లు జనం రోడ్డు మీద గుంపులు..గుంపులుగా ఉన్నారు కదూ..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, తిప్పర్తి మండలాల పరిధిలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై గురువారం పలువురు వాహనదారులు, స్థానికులు బంగారు పూత పూసిన ముక్కలను సేకరిస్తూ ఇలా కనిపించారు. ఆ ముక్కలను కొందరు స్థానిక బంగారు నగల తయారీదారుడి వద్దకు తీసుకెళ్లారు. వాటిని పరీక్షించిన సదరు దుకాణదారుడు బంగారం కాదు.. ఇత్తడి ముక్కలని చెప్పడంతో అవాక్కయ్యారు. ఆ ముక్కలు ఇళ్ల ఫ్లోరింగ్‌లో మెరుపు కోసం వాడతారని తెలియడంతో పెదవి విరుచుకుంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. - మిర్యాలగూడ -
అమరిక : ఇంటి కళకు ఇత్తడి, రాగి...
ఇంటి అలంకరణలో ఎంత ఆధునికత చోటుచేసుకుంటున్నా ప్రాచీన వస్తువుల పట్ల మనిషికి మక్కువ ఎక్కువవుతూనే ఉంటుంది. అంతటా ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ఇంటి అలంకరణలో ఇత్తడి, రాగి వస్తువులను ఉపయోగిస్తే ఆ కళ తీరే శోభాయమానంగా ఉంటుంది. ఇంట్లో స్టోర్ రూమ్‌లోనో, అటకమీదో పడేసిన వస్తువులను దించి, దుమ్మ తుడిచేయండి. పాతగా అనిపిస్తే కొత్తగా మెరిపించడానికి కింది చిట్కాలూ పాటించవచ్చు. ముందుగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. ఎమెరీ క్లాత్(లోహాలను మెరుగుపెట్టడానికి ఉపయోగించేది)తో ఇత్తడి పాత్రల, వస్తువుల అంచులను రుద్దాలి. దీనివల్ల అంచుల తయారీలో లోపాలు ఉండి, కొనలాంటి భాగాలు గుచ్చుకోకుండా కుదురుగా చేయొచ్చు. తర్వాత మెత్తని కాటన్ క్లాత్‌తో తుడవాలి. టొమాటో గుజ్జు ఇత్తడి పాత్రలకు రాసి, మెత్తటి కుచ్చు ఉన్న బ్రష్‌తో రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరిచి కాటన్ వస్త్రంతో తుడవాలి. ఒక భాగం నీళ్లలో రెండు భాగాలు పాలు పోసి అందులో ఇత్తడి వస్తువులు కొన్ని గంటల పాటు ఉంచాలి. తర్వాత మంచినీటితో శుభ్రపరిచి పొడిక్లాత్‌తో తుడవాలి. రెండు భాగాలు వెనిగర్, ఒక భాగం నీరు కలిపి అందులో రెండు గంటలు ఇత్తడి వస్తువులను ఉంచాలి. తర్వాత శుభ్రపరచాలి. పొడి క్లాత్‌కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకుని, దాంతో ఇత్తడి వస్తువులను బాగా రుద్దుతూ తుడిస్తే మెరుపు తగ్గదు. రాగి, ఇత్తడి వస్తువులను నిమ్మముక్కతో రుద్దినా పాత్రలకు కొత్తదనం వస్తుంది. ఇప్పుడిక అమ్మమ్మ వాడిన పూలసజ్జనో, నానమ్మ పెట్టిన నగలపెట్టెనో, తాతయ్య తాగిన మరచెంబునో పనికిరాదని పడేసే అవసరమే ఉండదు!