
తాడిపత్రి: ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. వివరాలను బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి ఇత్తడితో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి తాడిపత్రిలో మంగళవారం రాత్రి విక్రయించేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ ధరణీబాబు అక్కడకు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పట్టుబడ్డ మట్కా నిర్వాహకులు..
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమాంవలి, పీర్ల హాజీ ముస్తాఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment