Idols Sales
-
వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వినాయక చవితి' ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజులు దేశం మొత్తం వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా గణేష్ ఉత్సవాల్లో మునిగి తేలుతారు. గత ఏడాది ఈ పండుగ సందర్భంగా రూ. 300 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఎంత బిజినెస్ జరగవచ్చు? ఎలాంటి వస్తువుల వ్యాపారం ఎక్కువగా ఉంటుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిఏఐటి రిపోర్ట్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహాల బిజినెస్ రూ. 20 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. గతంలో చైనా నుంచి విగ్రహాలు దిగుమతయ్యేవి, కానీ క్రమంగా వీటి దిగుమతి భాగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం మన దేశంలో పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశ్యంతో మట్టి, ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి నిమజ్జనం కూడా చాలా సులభంగా ఉంటుంది. విగ్రహాలు తయారు చేసేవారు సంవత్సరం పొడువునా.. లేదా కొన్ని నెలలు అదేపనిలో నిమగ్నమైపోతారు. అయితే వినాయక చవితి ప్రారంభానికి ముందే దేశంలో బిజినెస్ మొదలైపోతుంది. ఇదీ చదవండి: మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు.. హోండా, కేటీఎమ్, కవాసకి ఈ ఏడాది కూడా అప్పుడే పండుగ శోభ మొదలైపోయింది.. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాలు ఏర్పాటు వేగంగా జరుగుతోంది. కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా పూజా సామగ్రి, అలంకార వస్తువుల వ్యాపారం కూడా బాగా ఊపందుకుంటాయి. కొంతమంది బంగారం కొనుగోలు చేయడం కూడా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా గణేష్ చతుర్థి సందర్భంగా కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
తాడిపత్రి: ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వివరాలను బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి ఇత్తడితో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి తాడిపత్రిలో మంగళవారం రాత్రి విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణీబాబు అక్కడకు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ మట్కా నిర్వాహకులు.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమాంవలి, పీర్ల హాజీ ముస్తాఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు. -
అయోధ్యలో రాముని భారీ విగ్రహం!
లక్నో: అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నట్లు సమాచారం. 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే దీపావళి రోజు ప్రకటించనున్నారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక శుభవార్త చెప్పనున్నారని, అది ఆయన ద్వారానే వింటే బావుంటుందన్నారు. -
జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు
కుల్కచర్ల: వినాయక చవితి దగ్గర పడుతుండటంతో మండల కేంద్రంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మండల ప్రజలు ,యువకులు పెద్ద వినాయకుల కోసం మహబూబ్‌నగర్, షాద్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లి తీసుకవచ్చే వారు కానీ వ్యాపారులు ప్రజలకు ఆఇబ్బందులు లేకుండా చేశారు. మండల కేంద్రంలో చిన్న వినాయకుడి నుంచి 12 అడుగుల వినాయక విగ్రహాల వరకు దొరుకుతున్నాయి. రూ. 50 నుంచి రూ. 12వేల వరకు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన యువకులు ముందుగానే బుగింక్ చేసుకుంటున్నారు.